కేథరిన్‌తో షికారు
‘ఎర్రబస్సు’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లోనే ఆ సినిమా హీరోయిన్ కేథరిన్ కూడా ఈ పిల్లలతో కలిసి శిల్పారామంలో కాసేపు కేరింతలు కొట్టింది. తన సినిమా విశేషాలను పిల్లలకు చెప్పి పిల్లల వివరాలు తెలుసుకుంది. బ్యాటరీ కార్‌లో శిల్పారామం ఆవరణలో కాసేపు షికారు చేసింది. పిల్లల భవిష్యత్ లక్ష్యాలకు ఆల్ ది బెస్ట్ చెప్పి సైనాఫ్ అయింది.
ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నారంటే?
మాసాయిపేట మానసపుత్రి రుచితజడ్జి ఎందుకు కావాలనుకుంటుందంటే..‘పేదవాళ్లకు న్యాయం చేయడానికి. అన్యాయం చేసినవాళ్లను కఠినంగా శిక్షించడానికి’
నల్లగొండ ఖేల్ రత్న వైజయంతి పోలీస్ ఆఫీసర్ ఎందుకు కావాలనుకుంటుందంటే..
‘ఆడవాళ్ల తరఫున నిలబడడానికి. వాళ్ల మీద జరుగుతున్న దాడులకు చెక్ పెట్టేందుకు’
మయూర అగ్రికల్చర్ జర్నలిస్ట్ ఎందుకవ్వాలనుకుంటుందంటే..
‘దేశానికి వెన్నుముక రైతన్న. ఆయన ఏలే వ్యవసాయరంగాన్ని కలంతో ప్రపంచానికి పరిచయం చేయాలని’
అర్చన సైంటిస్ట్ ఎందుక్కావాలనుకుంటుందంటే..
‘ఇంకెన్నో కొత్త విషయాలను కనిపెట్టాలి... ప్రపంచ శాస్త్రీ పరిశోధనలకు మనం కొత్తమార్గం చూపించేందుకు’
ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచనలున్న ఈ పిల్లలు నిజంగా మణిమాణిక్యాలే. వాళ్ల ఊళ్లకు వెళ్లడానికి వెహికిల్ ఎక్కిన బాలల్ని ఈ హైదరాబాద్ ట్రిప్ ఎలా అనిపించింది అని అడిగితే ‘సూపర్! దాసరి నారాయణరావు తాతయ్యను కలవడం.. ఆయనతో మాట్లాడటం ఇంకా హ్యాపీ. కేథరీన్ మా ఫేవరేట్ హీరోయిన్. అనుకోకుండా ఆమెను కలవడమూ మరీ ఆనందంగా ఉంది’ అని చెప్పారు.