జూబ్లీహిల్స్‌లో వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణం | Venkateswara temple in Jubilee | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణం

Published Thu, Aug 11 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

జూబ్లీహిల్స్‌లో వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణం

జూబ్లీహిల్స్‌లో వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణం

శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ చదలవాడ 
 

హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సేవలు, పూజలను నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో జూబ్లీహిల్స్‌లోని మూడున్నర ఎకరాల  స్థలంలో రూ.28 కోట్ల వ్యయంతో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ మహాగణపతి దేవాలయాలు నిర్మిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు.

బుధవారం ఆయన ఆలయ నిర్మాణ పనులకు టీటీడీ పాలక మండలి సభ్యులు కె.రాఘవేంద్రరావు, చింతల రాంచంద్రారెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సుచరిత, అరికెల నర్సారెడ్డిలతో కలసి శంకుస్థాపన చేశారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ ఏడాదిలోగా ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్నారు. కురుక్షేత్ర, కన్యాకుమారిలో  శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. తన నియోజక వర్గంలో ఈ ఆలయం నిర్మితమవడం ఆనందంగా ఉందని  ఖైరతాబాద్ ఎమ్మెల్యే,టీటీడీ పాలకమండలి సభ్యుడు, చింతల రాంచంద్రారెడ్డి తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement