Jubilee
-
ఆప్కాబ్ వజ్రోత్సవాల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
నేత్రవర్వంగా రథోత్సవం
-
పాలసీదారులకు ఎల్ఐసీ ‘డైమండ్’ బోనస్
♦ వజ్రోత్సవం సందర్భంగా ప్రకటన ముంబై: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తన పాలసీదారులకు వజ్రోత్సవం సందర్భంగా ప్రత్యేక బోనస్‌ను కానుకగా ప్రకటించింది. ప్రతీ వెరుు్య రూపాయల బీమా మొత్తంపై రూ.5 నుంచి రూ.60 రూపాయల వరకు ఒక విడత బోనస్‌ను వార్షిక బోనస్‌కు అదనంగా పాలసీదారులు అందుకోనున్నారు. ముంబైలో గురువారం జరిగిన ఎల్ఐసీ స్వర్ణోత్సవ కార్యక్రమంలో బోనస్ విషయాన్ని సంస్థ చైర్మన్ ఎస్కే రాయ్ ప్రకటించారు. ♦ పాలసీ కాల వ్యవధిని బట్టి రూ.లక్ష రూపాయల బీమా పాలసీపై కనీసం రూ.500, గరిష్టంగా రూ.6వేల వరకు బోనస్ లభించనుంది. పాలసీ తీసుకుని ఎక్కువ కాలం అరుు ఉండి లేదా గడువు తీరడానికి దగ్గరలో ఉన్న వాటిపై ఎక్కువ బోనస్ అందుకోవడానికి వీలుంటుంది. గరిష్టంగా రూ.6వేల బోనస్‌కు 1986, మార్చి 1 కటాఫ్ తేదీ, కనిష్టంగా రూ.500 బోనస్‌కు కటాఫ్ తేదీ 2015 మార్చి 31గా ఎల్ఐసీ ఖరారు చేసింది. ♦ రూ.లక్ష పాలసీపై ప్రతీ ఐదేళ్ల కాలానికి రూ.500 చొప్పున బోనస్ పెరుగుతూ వెళుతుంది. ♦ 2016 మార్చి 31 వరకు మనుగడలో ఉన్న పాలసీలు, 2016 సెప్టెంబర్1 తర్వాత కూడా కొనసాగుతున్న పాలసీలు బోనస్‌కు అర్హమైనవి. ఒకవేళ మార్చి 31లోపు పాలసీ ల్యాప్స్ అరుుపోతే దాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పునరుద్ధరించుకోవడం ద్వారా బోనస్ అందుకోవచ్చు. -
జూబ్లీహిల్స్‌లో వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణం
శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ చదలవాడ హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సేవలు, పూజలను నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో జూబ్లీహిల్స్‌లోని మూడున్నర ఎకరాల స్థలంలో రూ.28 కోట్ల వ్యయంతో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ మహాగణపతి దేవాలయాలు నిర్మిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం ఆయన ఆలయ నిర్మాణ పనులకు టీటీడీ పాలక మండలి సభ్యులు కె.రాఘవేంద్రరావు, చింతల రాంచంద్రారెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సుచరిత, అరికెల నర్సారెడ్డిలతో కలసి శంకుస్థాపన చేశారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ ఏడాదిలోగా ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్నారు. కురుక్షేత్ర, కన్యాకుమారిలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. తన నియోజక వర్గంలో ఈ ఆలయం నిర్మితమవడం ఆనందంగా ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే,టీటీడీ పాలకమండలి సభ్యుడు, చింతల రాంచంద్రారెడ్డి తెలిపారు. -
స్నేహం వద్దన్నాడని.. బీర్ సీసాతో దాడి
తమతో స్నేహాన్ని కట్ చేశాడన్న కోపంతో ఓ యువకుడిపై.. ఆరు మంది బీర్ సీసాతో దాడి చేసి గాయపర్చిన ఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది. ఈ ఘటనలో ఐదు మందిని జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరోనిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్‌నగర్ సమీపంలోని కార్మికనగర్‌లో నివసించే లింగిడి విజయ్‌కుమార్(24) ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్నాడు. ఏడాది క్రితం రహ్మత్‌నగర్‌కు చెందిన రాము, లక్ష్మణ్, షకిల్, శ్రీరాంనగర్‌కు చెందిన సలీం, సొహైల్, నిసార్లతో స్నేహం ఉండేది. ఇటీవల కొన్ని కారణాలతో విజయ్‌కుమార్ వారిని కలవడం మానేశాడు. ఈ నెల 16వ తేదీన రాత్రి మెట్టుగూడకు చెందిన మరో స్నేహితుడు ప్రియనాథ్ విజయ్‌తో కలిసి నిమ్స్‌మే ఓపెన్ ల్యాండ్‌లో బీరుతాగుతూ కూర్చున్నారు. అదే సమయంలో రాము, లక్ష్మణ్, షకిల్, సలీం, సొహైల్, నిసార్లు అక్కడికి వచ్చి విజయ్‌కుమార్‌తో గొడవపడ్డారు. అసభ్యంగా దూషించారు. కొట్టి తరిమారు. వీరి బారి నుంచి విజయ్‌కుమార్‌తో పాటు స్నేహితుడు విజయ్ పరారవుతుండగా ఎల్ఆర్. కిషోర్ స్కూల్ వద్ద మళ్లీ వీరిద్దరినీ పట్టుకొని తమతోపాటు తెచ్చిన బీరు సీసాలను పగలగొట్టి విజయ్‌కుమార్ కడుపులో గట్టిగా పొడిచారు. లక్ష్మణ్ బీరుసీసాతో తనను పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయని వీరందరిపైన చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయిదు మందిని అరెస్టు చేశారు. లక్ష్మణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
అభివృద్ధి వన్ బై టూ..
అభివృద్ధికి బొమ్మా బొరుసులా కనిపించే ప్రాంతం బంజారాహిల్స్. ఓపక్క విలాసవంతమైన భవంతులు.. రాజకీయ, సినీ స్టార్లు, వ్యాపార ప్రముఖులకు నిలయం. మరోపక్క ఇరుకు ఇళ్లు.. గల్లీలు.. తాగునీటికి కొట్లాడే కాలనీలు ఇక్కడే కనిపిస్తాయి. ఓ వర్గం ప్రజలకు పాలకులతో పనిలేకున్నా.. మరో వర్గం నేతల కనుసన్నల్లోనే బతుకుతున్నారు. ఇప్పుడు జరగబోయే ‘గ్రేటర్’ ఎన్నికల్లో తమ బతుకులను బాగుచేసే నేతలకే ప్రాధాన్యం ఇస్తామంటున్నారు. - బంజారాహిల్స్ శ్రీమంతులకు కేరాఫ్ బంజారాహిల్స్ దేశంలోనే బంజారాహిల్స్కుప్రత్యేక స్థానం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రాంతంగా పేరుంది. ఖరీదైన కార్లు. ఇంద్ర భవనాలను తలపించే ఇళ్లకు నెలవైన ఈ ప్రాంతం ఐదు దశాబ్దాల క్రితం కొండలు, గుట్టలతో ఉండేది. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నాయకులకు కేంద్రం. సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివసించే బంజారాహిల్స్ డివిజన్ వీవీఐపీ డివిజన్‌గా పేరొందింది. రేణుకాచౌదరి లాంటి మహిళలు ఇక్కడి నుంచే కేంద్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. బంజారాల నివాసంతో పేరు.. ఒకప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన బంజారా ప్రజలు బంజారాహిల్స్ గుట్టల్లో గుడిసెలు వేసుకొని నివసించేవారు. 1960 వరకు ఈ ప్రాంతంలో గిరిజన తండాలే ఉండేవి. వీరు పంజగుట్ట, అమీర్‌పేట, సోమాజి గూడ, బేగంపేట ప్రాంతాల్లోని ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగించేవారు. మొదట భాగ్యనగర్ స్టూడియో ఎదురుగా లంబాడీ బస్తీ ఏర్పడింది. ఆ తర్వాత నందినగర్ పేరుతో ఇంకో బస్తీ వచ్చింది. కొన్నేళ్లకు బడాబాబుల దృష్టి ఈ కొండలపై పడింది. మొదట్లో ముస్లింలు, మార్వాడీలు ఇక్కడ ఆవాసాలు ఏర్పర్చుకున్నారు. తర్వాత అన్ని రంగాల ప్రముఖులను ఈ ప్రాంతం ఆకర్షించింది. అధికారికంగా ఈ ప్రాంతాన్ని 1961లో ‘బంజారాహిల్స్’గా నామకరణం చేశారు. జూబ్లీహిల్స్ మున్సిపాలిటీలో.. 1960 ప్రాంతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాలు జూబ్లీహిల్స్ మున్సిపాలిటీలో అంతర్భాగంగా ఉండేవి. ఇక్కడంతా ప్రభుత్వ స్థలాలు ఉండడం, నిజాం విక్రయించిన వందలాది ఎకరాల ప్లాట్లు కూడా ఉండడంతో దీనికి ప్రత్యేక అధికారులను నియమించారు. జూబ్లీహిల్స్ సొసైటీ ఏర్పడ్డప్పుడు కూడా ఈ ప్రాంతం జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ పరిధిలోనే ఉండేది. మొదటి కార్పొరేటర్ రేణుకాచౌదరి 1986లో జరిగిన ఎంసీహెచ్ ఎన్నికల్లో బంజారాహిల్స్ డివిజన్ కార్పొరేటర్‌గా రేణుకాచౌదరి టీడీపీ నుంచి విజయం సాధించారు. అనంతరం 16 ఏళ్ల తర్వాత 2002లో జరిగిన ఎంసీహెచ్ ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన బి.భారతీనాయక్ గెలిచారు. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీనాయక్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రెండో సారి విజయం సాధించారు. ల్యాండ్‌మార్క్‌లు.. బంజారాహిల్స్‌లో రోడ్ నెం.12లోని కమాన్ ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తోంది. ఆ తరువాత మినిస్టర్ క్వార్టర్స, జగన్నాథ ఆలయం, బసవతారకం ఆసుపత్రి, లోటస్‌పాండ్, కేబీఆర్ పార్కు, ఎల్వీప్రసాద్ ఆసుపత్రి, భాగ్యనగర్ స్టూడియో, ప్రసాద్ ఫిలిం ల్యాబ్, హోటల్ తాజ్ బంజారా వంటివి ల్యాండ్ మార్కలుగా ఉన్నాయి. కుదించుకుపోయిన డివిజన్.. రేణుకాచౌదరి కార్పొరేటర్‌గా పోటీ చేసినప్పుడు ఇప్పుడున్న జూబ్లీహిల్స్ డివిజన్, పంజగుట్ట, బంజారాహిల్స్, షేక్‌పేట, శ్రీనగర్‌కాలనీ, వెంకటేశ్వరనగర్ ప్రాంతాలన్నీ బంజారాహిల్స్ డివిజన్‌లోనే ఉండేవి. 2002లో వార్డుల పునర్విభజనలో బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ డివిజన్ ఏర్పడింది. 2009 ఎన్నికల నాటికి షేక్‌పేట డివిజన్ కొత్తగా ఏర్పడింది. ప్రస్తుతం బంజారాహిల్స్ డివిజన్‌ను మళ్లీ విభజించి ‘వెంకటేశ్వరకాలనీ డివిజన్’ను ఏర్పాటు చేశారు. డివిజన్ పరిధిలో ప్రాంతాలు... ఇప్పుడున్న బంజారాహిల్స్ డివిజన్లో ఎమ్మెల్యే కాలనీ, లోటస్‌పాండ్, ఎన్బీటీ నగర్, ఎన్బీ నగర్, బోళానగర్, ఖాజానగర్, శ్రీరాంనగర్, గ్రీన్బంజారా కాలనీ, మిథిలానగర్, ప్రేమ్‌నగర్, చింతల్‌బస్తీలోని కొంత భాగం, వెంకటరమణ కాలనీలోని కొంత భాగం, శ్రీధర్ ఫంక్షన్‌హాల్, వేమిరెడ్డి ఎన్క్లేవ్, ఉదయ్‌నగర్‌లో కొంత భాగం, సింగాడికుంట కొంత భాగం, రోడ్ నెం.13 అంబేద్కర్‌నగర్, రోడ్ నెం.10 గఫార్‌ఖాన్ కాలనీ తదితర ప్రాంతాలున్నాయి. -
ఏం చేద్దాం?
జూబ్లీహిల్స్‌లోని ఆరెకరాల పడావు భూమిపై అధికారుల మల్లగుల్లాలు ఎల్ఎంఏ నిర్ణయంపై చర్చ సర్కారు అనుమతి కోసం నిరీక్షణ సిటీబ్యూరో: షేక్‌పేట మండలం జూబ్లీహిల్స్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే ఆరు ఎకరాల ప్రభుత్వ పడావు భూమి స్వాధీనంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మూడు మాసాల కిందట సీసీఎల్ పరిధిలోని ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎల్ఎంఏ) ఈ భూమి స్వాధీనంపై నిర్ణయం తీసుకున్నా, సర్కారు నుంచి అనుమతి రాకపోవటంతో జిల్లా రెవెన్యూ శాఖ సందిగ్ధంలో పడింది. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా... ఎలాంటి ఆదేశాలు వెలువడకపోవటంతో భూమి స్వాధీనం చేసుకోవాలని ఎల్ఎంఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ పడినట్లయింది. ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎల్ఎంఏ)లో సభ్యులుగా సీసీఎల్ఏ కమిషనర్, రెవెన్యూ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో సహా 12 ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. భూకేటాయింపులు, స్వాధీనం, రెవెన్యూకు సంబంధించిన కీలక సమస్యలపై ఈ అథారిటీ ఆరు మాసాలకోసారి సమావేశమవుతుంది. ‘హాట్’ ఏరియాలో... నగరంలో సంపన్నుల ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్‌లోని 403 సర్వే నంబరులో 1994-95 సంవత్సరంలో మహర్షి, బాలాజీ, క్రియేటివ్ సంస్థలకు గజానికి కనీస ధర రూ.200 చొప్పున నిర్ణయించి....ఒక్కో సంస్థకు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు, పరిశ్రమలు నెలకొల్పలేదు. దీంతో పలుమార్లు ఆయా సంస్థలకు రెవెన్యూ శాఖ నోటీసులుు జారీ చేసింది. చివరిగా రెండు మాసాల కిందట ఖాళీగా ఉన్న ఈ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ హెచ్చరిక నోటీసులూ ఇచ్చారు. దీనిపై ఆయా సంస్థలు రాత పూర్వకంగా వివరణ ఇచ్చినా... సంతృప్తి చెందని రెవెన్యూ శాఖ ఆ భూముల స్వాధీనంపై ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీకి నివేదించింది. ఈ నేపథ్యంలో ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ మూడు మాసాల కిందట నిర్వహించిన సమావేశంలో ఆరు ఎకరాల పడావు భూమి స్వాధీనంపై తీర్మానం చేస్తూ...అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించింది. తీర్మానాలతో కూడిన ఈ మినిట్స్ నివేదిక సర్కారుకు చేరి మూడు మాసాలవుతున్నా ఎలాంటి ఆదేశాలు అందకపోవటంతో భూమి స్వాధీనంపై రెవెన్యూ వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. కాగా రాజకీయ ఒత్తిళ్లు, పైరవీల కారణంగానే భూముల స్వాధీనంపై ప్రభుత్వం స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. నగరంలో అంతే... నగరంలో ఎలాంటి కోర్టు కేసులు లేకుండా పడావు(ఖాళీ)గా ఉన్న 164.04 ఎకరాల భూములకు సంబంధించి 138 సంస్థలు సమర్పించిన వివరణ(నివేదిక)లను పరిశీలించిన ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ సమగ్రమైన నివేదికను సర్కారుకు సమర్పించింది. ముఖ్యంగా షేక్‌పేట మండలంలోని సంపన్నులు నివసించే కాలనీల్లో 25 సంస్థలు వినియోగించకుండా ఖాళీగా ఉంచిన కోట్లాది రూపాయల విలువ చేసే 138 ఎకరాల భూములపై ఏ విధమైన పద్ధతి అనుసరించాలో పేర్కొంటూ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ఆ నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తున్నది. అయినా చర్యలు లేకపోవడం విడ్డూరం. -
దాడికి యత్నించాడు
నిర్మాత సి.కల్యాణ్‌పై వైద్యురాలి ఫిర్యాదు పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు బంజారాహిల్స్: సినీ నిర్మాత సి.కల్యాణ్ తనను అసభ్యకర పదజాలంతో దూషించడంతో పాటు తనపై చేసి దాడికి యత్నించాడని ఓ వైద్యురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సి.కల్యాణ్‌పై ఐపీసీ సెక్షన్ 354 (సి), 506, 509ల కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐ గురుస్వామి, బాధితురాలి కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5లోని విమల్ అపార్ట్మెంట్స్, ప్లాట్ నెం. ఎస్-4లో డాక్టర్ తూపల్లి కవిత నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్స్ ప్లాట్ నంబర్ 41లో నిర్మాత సి.కల్యాణ్ ఉంటున్నారు. డాక్టర్ కవిత ఉంటున్న ఇంటిపై కొద్ది రోజుల క్రితం కల్యాణ్ కన్ను పడింది. ఆ ఫ్లాట్‌ను తాను చెప్పిన ధరకు విక్రయించి వెళ్లిపోవాలని మధ్యవర్తులతో హెచ్చరికలు జారీ చేయగా ఆమె పట్టించుకోలేదు. ఈ అపార్ట్మెంట్స్లోని కొంత భాగం మెట్రో రైలు పనుల్లో భాగంగా రోడ్డు విస్తరణలో పోతుండటంతో జీహెచ్ఎంసీ రూ.కోటిన్నర నష్టపరిహారం ప్రకటించింది. దీంతో ఆ డబ్బు కాజేయాలని కల్యాణ్ పథకం వేశాడు. తాను అపార్ట్మెంట్ అధ్యక్షుడినంటూ బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంక్ అకౌంట్ తెరిచి పరిహారం చెక్కు తనకు ఇవ్వాలని జీహెచ్ఎంసీకి లేఖ రాశారు. అయితే ఈ మొత్తాన్ని అపార్ట్మెంట్లోని అందరికీ సమానంగా పంపిణీ చేయాలని డాక్టర్ కవిత జీహెచ్ఎంసీకి లేఖ రాశారు. దీన్ని జీర్ణించుకోలేని కల్యాణ్ ఆమెపై కక్ష సాధింపు మొదలెట్టారు. సోమవారం సాయంత్రం అపార్ట్మెంట్ అసోసియేషన్ సమావేశం జరుగుతుండగా అక్కడికి వెళ్తున్న కవితను అడ్డగించాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కిందపడేసి కొట్టి లైంగికదాడికి యత్నించాడు. ఇక్కడి నుంచి తక్షణం వెళ్లకపోతే తన అసలు రూపాన్ని చూడాల్సి ఉంటుందని, 4 వేల మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇంటి ముందు ధర్నా చేయిస్తానని బెదిరించాడు. ఇన్ని రోజులూ చూసిన కల్యాణ్ వేరు.. రేపటి నుంచి చూసే కల్యాణ్ వేరని, హత్య చేస్తానని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కల్యాణ్‌ను నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతడిని తక్షణం అరెస్టు చేయాలని మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు వచ్చి డిమాండ్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కల్యాణ్ కోసం గాలిస్తున్నారు. -
మద్యం మత్తులో యువకుడి డ్రైవింగ్...
ఆటో, టూవీలర్‌ను ఢీకొట్టిన కారు ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో గురువారం రాత్రి ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి ఆటో, ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వీరు చావుబతుకుల మధ్య అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10నుంచి తప్పతాగిన మైకంలో ఓ యువకుడు ఆడికారు(ఏపీ 9సీటీ 0027) నడిపిస్తూ ముందు వెళ్తున్న ఆటోతోపాటు ద్విచక్ర వాహనం ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న పుష్పలతతో పాటు స్కూటీ నడిపిస్తున్న అంబిక తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ఉన్న మరో ముగ్గురు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో రోడ్డంతా రక్తసిక్తమైంది. ప్రమాదానికి కారకుడైన ఆడి కారు యజమాని పవన్ అక్కడి నుంచి తప్పించుకునే యత్నం చేయగా చుట్టుపక్కల వారు అడ్డుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించారు. అప్పటికి చేసిన తప్పును ఒప్పుకోకుండా పవన్ పోలీసులపై జులుం ప్రదర్శించాడు. నిందితుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడి కుమారుడిగా పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులకు స్థానికుల వాగ్వాదం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘చుక్క’ల్లా మెరిశారు..
ఫన్కార్ క్లబ్ జూబ్లీహిల్స్‌లోని హార్ట్‌కప్ కేఫ్‌లో మంగళవారం థీమ్ పార్టీ నిర్వహించింది. పార్టీలో పాల్గొన్న మగువలందరూ చుక్కల చుక్కల డిజైన్లు గల దుస్తులు ధరించి చుక్కల్లా మెరిశారు. ‘పుల్కా డాట్స్’ పేరిట చుక్కల దుస్తులు, రెట్రో ఫ్యాషన్ థీమ్ పేరిట 1960లు, 70ల నాటి హీరోయిన్లను అనుకరించే ఫ్యాషన్ వస్త్రాలంకారాలతో హొయలొలికించారు. ఇందులో పాల్గొన్న మహిళలందరూ పని ఒత్తిడికి దూరంగా ఆట పాటలతో ఉల్లాసంగా గడిపారు. కలసి లంచ్ చేసి, తమ కష్టసుఖాలను కలబోసుకున్నారు. - సాక్షి, సిటీప్లస్ -
సిబ్బంది పెంపుతోనే సమస్యల పరిష్కారం
అధ్యయన కమిటీతో మహిళా పోలీసు అధికారులు బంజారాహిల్స్: నగరంలోని చాలా పోలీసుస్టేష న్లలో మహిళా పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఉన్న ఈ కొద్దిపాటి సిబ్బందిని కూడా బందోబస్తులకు, ధ ర్నాలు, ర్యాలీలను అడ్డుకొనేందుకు విని యోగిస్తున్నారు. ఠాణాలో మహిళా పోలీ సులు అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వచ్చే బా ధిత మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇబ్బ డి ముబ్బడిగా వస్తున్న ఫిర్యాదులను పరి ష్కరించేందుకు అవసరమైన సిబ్బంది లేక అధికారులు అవస్థలు పడుతున్నా రు. మహిళా పోలీసుస్టేషన్ల సంఖ్యతో పాటు సిబ్బంది సంఖ్యను పెంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని మహిళా పోలీసు అధికారులు కోరుతున్నారు. మహిళల భద్రతపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్య యన కమిటీ సమావేశం జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సోమవారం జరిగింది. సీని యర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య తదితరుల ఆధ్వర్యం లో జరిగిన ఈ సమావేశంలో జంట క మిషనరేట్ల పోలీసు అధికారులు అధ్య యన కమిటీకి ఇవే సూచనలు చేశారు. వసతులు లేక సతమతం... నగరంలోని చాలా ఠాణాల్లో సరైన టా యిలెట్ సౌకర్యాలు లేవు. దీంతో ఫిర్యా దు చేసేందుకు వచ్చే మహిళలతో పాటు మహిళా పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని స్టేషన్లలో ఉమెన్స్ హెల్ప్ డెస్క్‌లు ఉన్నా... సరైన సౌకర్యాలు లేవు. మహిళా ఫిర్యాదుదారులు అందరినీ దాటుకొని అక్కడికి రావాల్సి వస్తోంది. విచారణకు కూడా ప్రత్యేక వసతి సదుపాయాలులేవు. అధ్యయన కమిటీ.. పో లీసు అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. ఠాణాల సంఖ్య పెంచాలి... నగరంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను నివారించేందుకు మహిళా పోలీస్స్టేషన్ల సంఖ్యను పెంచడంతోపాటు, సిబ్బంది సంఖ్యను పెంచాలి. అంతేకాకుండా ప్రజాఅవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించాలి. ఇక ఫిర్యాదులకు అనుగుణంగా మహిళా సిబ్బంది సంఖ్య ఉండటం లేదు. దీనిపై ఖచ్చితంగా దృష్టిసారించాలి. - రజిత, సౌత్‌జోన్ ఉమెన్ పోలీస్‌స్టేషన్ వైద్య పరీక్షల్లో జాప్యం తగ్గించాలి... మహిళా బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లే సమయంలో వివిధ పరీక్షలకు సమయం విపరీతంగా ఖర్చవుతోంది. దీనివల్ల అటు బాధితులు, ఇటు శాఖాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ జాప్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా బాధితుల విషయంలో అన్ని వైద్యసేవలు ఒకేసారి పూర్తయ్యేలా చొవర చూపాలి. - మాధవీలత, సరూర్‌నగర్ ఉమెన్ పోలీస్‌స్టేషన్ వెంటనే స్పందిస్తున్నాం... చిన్న చిన్న ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తున్నాం. నిర్భయ ఘటన తర్వాత మహిళా సమస్యలపై మాదాపూర్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఉమెన్ హెల్ప్‌లైన్‌లో పని చేస్తున్న నేను నిత్యం 20కిపైగా ఫిర్యాదులు అందుకుంటున్నాను. మిస్డ్కాల్స్, బ్లాంక్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఇలా అపరచిత వ్యక్తుల నుంచి వచ్చే కేసులు ఎక్కువగా మా దృష్టికి వస్తున్నాయి. వీటన్నింటిని సానుకూలంగా విని పరిష్కారిస్తున్నాం. నిందితులను అరెస్ట్ చేస్తున్నాం. - మధులత, పోలీసు అధికారి, సైబరాబాద్ కమిషనరేట్ బాధితులు ధైర్యంగా ఠాణాకు వచ్చేలా చేయాలి... మహిళా బాధితులు ధైర్యంగా వచ్చి పోలీస్‌స్టేషన్‌లో చెప్పుకొనే పరిస్థితులను పెంపొందించాలి. వారి సమస్యను సానుకూలంగా విని పరిష్కరించడంలో వేగం చూపాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలి. నేరస్థులకు శిక్ష పడటంలో చొరవ చూపితే బాధిత మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి వస్తారు. - వెంకటలక్ష్మి, సీసీఎస్, ఉమెన్స్ పోలీస్‌స్టేషన్ -
‘అందరి’ కల.. ఉన్నత విద్య
బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంతో సొంతం వివిధ కారణాలతో ఉన్నత విద్యకు దూరమైన వారికి ఆ విశ్వవిద్యాలయం ఓ ఆశాకిరణం. వివిధ ప్రాంతాల్లో ఉండే వారు సైతం అక్కడే ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించే బృహత్తరమైన అవకాశాన్ని ఆ వర్సిటీ కల్పించింది. అదే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. దేశంలోనే మొట్టమొదటి సారిగా దూరవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన అంబేద్కర్ విశ్వవిద్యాలయం మంగళవారం 33వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ ప్రగతిపై ప్రత్యేక కథనం. బంజారాహిల్స్: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీగా 1982వ సంవత్సరం ఆగస్టు 26న విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట లెజిస్లేచర్ చట్టం కింద యూజీసీ గుర్తింపు కూడా లభించింది. 1982 ఆగస్టు 26న నాగార్జున సాగర్ వద్ద అప్పటి రాష్ట్రపతి జ్ఞానిజైల్‌సింగ్ ఈ వర్సిటీని ప్రారంభించారు. 1991 అక్టోబర్ 26న ఈ వర్సిటీకి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. జూబ్లీహిల్స్‌లో క్యాంపస్‌ను 1986 జూన్ 1న నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రారంభించారు. 53.63 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశ్వవిద్యాలయం చుట్టూ రాళ్లు, చెట్లు, చెరువు ప్రకృతి సౌందర్యంతో అలరారుతోది. పది కోర్సులో ప్రారంభమైన ఈ వర్సిటీ ప్రస్తుతం పలు విభాగాల్లో 70 కోర్సులను అందిస్తోంది. ఏటా లక్ష మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా 23 ప్రాంతీయ కేంద్రాల ద్వారా 216 స్టడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న గృహిణులు, రైతులు, కార్మికులు, పోలీసులు, ఖైదీలు ఇలా అందరికీ ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఈ యూనివర్సిటీ కే దక్కింది. సెంట్రల్ జైళ్లలో కూడా ఈ విశ్వవిద్యాలయం ద్వారా స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి ఖైదీలకు విద్యను అందిస్తున్నారు. చర్లపల్లి, వరంగల్, రాజమండ్రి, వైఎస్సార్ జిల్లా (కడప), నెల్లూరు కేంద్ర కారాగారాల్లో అధ్యాయన కేంద్రాలను ఏర్పాటు చేసి డిగ్రీ, పీజీ కోర్సులను ప్రవేశపెట్టింది. తెలుగు, ఇంగ్లిష్, ఊర్దూ భాషల్లో కోర్సులను అందిస్తోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందుబాటులోకి తెచ్చారు. వర్సిటీ ఈ ఏడాది సీఎస్ఆర్ టాప్ డిస్టెన్స్ లెర్నింగ్ అనేక పేరొందిన విద్యాసంస్థలతో వివిధ కోర్సుల్లో ఎంఓయూ కుదుర్చుకుంది. అతి తక్కువ ఫీజులు తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం ఫీజు రూ. 1300, రెండు, మూడవ సంవత్సర ఫీజులు రూ. 1500 వసూలు చేస్తూ ఇందులోనే స్టడీ మెటీరియల్ కూడా అందిస్తున్నారు. నేడు వ్యవస్థాప దినోత్సవం యూనివర్సిటీ 33వ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం విశ్వ విద్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు. విశ్వవిద్యాలయ ఇంచార్జ్ వైస్ చాన్సలర్ వికాస్ రాజ్ అధ్యక్షతన వ్యవస్థాపక వేడుకలు జరగనున్నాయి. రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియన్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అనే అం శంపై వ్యవస్థాపక లెక్చర్‌ను కాకతీయ విశ్వవిద్యాలయ మాజీ సంచాలకులు మురళీమనోహర్ ఇవ్వనున్నారు.