పాలసీదారులకు ఎల్ఐసీ ‘డైమండ్’ బోనస్
♦ వజ్రోత్సవం సందర్భంగా ప్రకటన
ముంబై: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్‌స కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తన పాలసీదారులకు వజ్రోత్సవం సందర్భంగా ప్రత్యేక బోనస్‌ను కానుకగా ప్రకటించింది. ప్రతీ వెరుు్య రూపాయల బీమా మొత్తంపై రూ.5 నుంచి రూ.60 రూపాయల వరకు ఒక విడత బోనస్‌ను వార్షిక బోనస్‌కు అదనంగా పాలసీదారులు అందుకోనున్నారు. ముంబైలో గురువారం జరిగిన ఎల్‌ఐసీ స్వర్ణోత్సవ కార్యక్రమంలో బోనస్ విషయాన్ని సంస్థ చైర్మన్ ఎస్‌కే రాయ్ ప్రకటించారు.
♦ పాలసీ కాల వ్యవధిని బట్టి రూ.లక్ష రూపాయల బీమా పాలసీపై కనీసం రూ.500, గరిష్టంగా రూ.6వేల వరకు బోనస్ లభించనుంది. పాలసీ తీసుకుని ఎక్కువ కాలం అరుు ఉండి లేదా గడువు తీరడానికి దగ్గరలో ఉన్న వాటిపై ఎక్కువ బోనస్ అందుకోవడానికి వీలుంటుంది. గరిష్టంగా రూ.6వేల బోనస్‌కు 1986, మార్చి 1 కటాఫ్ తేదీ, కనిష్టంగా రూ.500 బోనస్‌కు కటాఫ్ తేదీ 2015 మార్చి 31గా ఎల్‌ఐసీ ఖరారు చేసింది.
♦ రూ.లక్ష పాలసీపై ప్రతీ ఐదేళ్ల కాలానికి రూ.500 చొప్పున బోనస్ పెరుగుతూ వెళుతుంది.
♦ 2016 మార్చి 31 వరకు మనుగడలో ఉన్న పాలసీలు, 2016 సెప్టెంబర్1 తర్వాత కూడా కొనసాగుతున్న పాలసీలు బోనస్‌కు అర్హమైనవి. ఒకవేళ మార్చి 31లోపు పాలసీ ల్యాప్స్ అరుుపోతే దాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పునరుద్ధరించుకోవడం ద్వారా బోనస్ అందుకోవచ్చు.