సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకుంది. గ్రహణం కారణంగా నిన్న రాత్రి ఆలయ ద్వారాలను మూసివేశారు. గ్రహణ కాలంలో కిరణాలు సోకడం కారణంగా చెడు ఫలితాలు ఉంటాయని ఆలయాలు మూసివేస్తారు. ఉదయం 3:15 నిముషాలకు ఆలయ ద్వారాలు తెరిచి పుణ్యాహవచనం చేసి, ఆలయ శుద్ధి నిర్వహించారు. అనంతరం సుప్రభాతం, అర్చన, తోమాల సేవలను నిర్వహించారు.
ఉదయం 5 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం 15 కంపార్టుమెంట్లో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. నిన్న 47 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని, హుండీ ద్వారా 3.03 కోట్లు ఆదాయం వచ్చింది.
#WATCH | Tirupati, Andhra Pradesh: After the lunar eclipse, the Tirumala Tirupati Devasthanam officials reopened the Sri Venkateswara Shrine doors on Sunday morning, cleaned the temple according to 'Shastras' and started the Suprabhata Seva.
— ANI (@ANI) October 29, 2023
Temple Deputy EO Lokanadam, Peskar… pic.twitter.com/JpyirpnnyR
Comments
Please login to add a commentAdd a comment