మార్చి 9న సూర్యగ్రహణం | Solar eclipse on March 9th | Sakshi
Sakshi News home page

మార్చి 9న సూర్యగ్రహణం

Published Fri, Feb 12 2016 4:40 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM

Solar eclipse on March 9th

12 గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేత
సాక్షి, తిరుమల: వచ్చేనెల... మార్చి 9 వ తేదీ ఉదయం 5.47 నుంచి ఉదయం 9.08 గంటల మధ్య సూర్యగ్రహణం సంభవించనుంది.  ఈసందర్భంగా శ్రీవారి ఆలయం సుమారు 12 గంటలపాటు మూసివేయనున్నారు. మార్చి 8న మంగళవారం రాత్రి 8.30 గంటలకు  ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి మార్చి 9వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈసందర్భంగా మార్చి 9వ తేదీన సహస్రకలశాభిషేకం రద్దుచేశారు. ఇతర సేవల్ని ఏకాంతంగా నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement