మార్చి 9న సూర్యగ్రహణం
12 గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేత
సాక్షి, తిరుమల: వచ్చేనెల... మార్చి 9 వ తేదీ ఉదయం 5.47 నుంచి ఉదయం 9.08 గంటల మధ్య సూర్యగ్రహణం సంభవించనుంది. ఈసందర్భంగా శ్రీవారి ఆలయం సుమారు 12 గంటలపాటు మూసివేయనున్నారు. మార్చి 8న మంగళవారం రాత్రి 8.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి మార్చి 9వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈసందర్భంగా మార్చి 9వ తేదీన సహస్రకలశాభిషేకం రద్దుచేశారు. ఇతర సేవల్ని ఏకాంతంగా నిర్వహిస్తారు.