![AP CM YS Jagan Invited For Maha Samprokshanam Of Srivari Temple In Jammu - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/26/AP--CM--YS--Jagan--Invited--For--Maha--Samprokshanam.jpg.webp?itok=IkwoyWLV)
సాక్షి, అమరావతి: జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్‌ను టీటీడీ ఆహ్వానించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను గురువారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎస్‌వీ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, న్యూఢిల్లీ ప్రెసిడెంట్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిశారు.
జూన్ 3–8 వరకు జమ్మూలోని శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ, 8న మిధున లగ్నంలో కళావాహన, ఆరాధన అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాలకు హాజరుకావాలని వారు సీఎంకు ఆహ్వాన పత్రికను అందించారు.
(చదవండి: ఎప్పటి నీటి లెక్కలు అప్పటికే...)
Comments
Please login to add a commentAdd a comment