తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో నిర్వహించే వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల కోటాను టీటీడీ అధికారుల శుక్రవారం విడుదల చేస్తారు.
నేటి ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి..
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో నిర్వహించే వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల కోటాను టీటీడీ అధికారుల శుక్రవారం విడుదల చేస్తారు. అదేరోజు ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో www.ttdseva-online.com వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు పద్మావతి పరిణయోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆ మూడు రోజుల పాటు తోమాల, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేశారు.
తిరుమలలో ప్రతి నెలా మొదటి శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించనున్నారు. టీటీడీ పరిధిలో ఎదురయ్యే సమస్యలు, సూచనలపై భక్తులు 0877-2263261 నంబరుకు ఫోన్ ద్వారా టీటీడీ ఈవో డాక్టర్ డి.సాంబశివరావుకు తెలియజేయవచ్చు.