tirumala tickets
-
వీఐపీ బ్రేక్ దర్శన వేళలో మార్పు
-
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
-
తిరుమల: రేపు ఆన్లైన్లో వర్చువల్ సేవ టికెట్లు
సాక్షి, తిరుమల: వర్చువల్ సేవ టికెట్లను ఆగస్టు 7న ఆన్లైన్లో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈనెల 17 నుంచి 20 తేదీ వరకు గల వర్చువల్ సేవ టికెట్లను అందుబాటులో ఉంచనుంది. వీటితో పాటు ఈనెల 30, 31 తేదీలకు సంబంధించిన వర్చువల్ సేవ టికెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. శనివారం ఉదయం 11 గంటల నుంచి టికెట్లు భక్తులకు అందుబాటులో ఉండనున్నట్లు టీటీడీ తెలిపింది. -
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
తిరుమల: భక్తుల సౌకర్యార్థం ఆగస్టుకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 20న మంగళవారం ఉదయం 9 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆన్లైన్లో విడుదల చేసింది. రోజుకు 5 వేల చొప్పున టికెట్లను విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. https://tirupatibalaji.ap.gov.in/ వెబ్సైట్లో భక్తులు టికెట్లు, గదులను బుక్ చేసుకోవచ్చు. -
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
తిరుమల: జూలైకి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆన్లైన్లో విడుదల చేసింది. రోజుకు 5 వేల టికెట్ల చొప్పున అందుబాటులో ఉంచారు. వీటితో పాటు జూలైకి సంబంధించిన గదుల కోటాను ఈనెల 23న బుధవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. https://tirupatibalaji.ap.gov.in/ వెబ్సైట్లో భక్తులు టికెట్లు, గదులను బుక్ చేసుకోవచ్చు. చదవండి: తగ్గుతున్న కేసులు.. కుదుటపడుతున్న బతుకులు -
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల: జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్లైన్లో శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 49,046 టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఆన్లైన్లో www.ttdseva-online.com వెబ్సైట్ ద్వారా ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు పద్మావతి పరిణయోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆ మూడు రోజుల పాటు తోమాల, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేశారు. సేవా టికెట్లు వివరాలు: సుప్రభాతం 6,157 తోమాల 140 అర్చన 140 విశేషపూజ 750 అష్టదళపాదపద్మారాధన 80 నిజపాద దర్శనం 1,115 కల్యాణోత్సవం 10,874 ఊంజల్‌సేవ 2,900 వసంతోత్సవం 6,880 ఆర్జిత బ్రహ్మోత్సవం 6,235 సహస్రదీపాలంకరణ సేవ 13,775 -
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా
నేటి ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి.. సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో నిర్వహించే వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల కోటాను టీటీడీ అధికారుల శుక్రవారం విడుదల చేస్తారు. అదేరోజు ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్లో www.ttdseva-online.com వెబ్సైట్ ద్వారా ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు పద్మావతి పరిణయోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆ మూడు రోజుల పాటు తోమాల, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేశారు. తిరుమలలో ప్రతి నెలా మొదటి శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించనున్నారు. టీటీడీ పరిధిలో ఎదురయ్యే సమస్యలు, సూచనలపై భక్తులు 0877-2263261 నంబరుకు ఫోన్ ద్వారా టీటీడీ ఈవో డాక్టర్ డి.సాంబశివరావుకు తెలియజేయవచ్చు.