
బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ నటించిన కమిట్‌మెంట్ సినిమా ట్రైలర్‌పై కేసు నమోదైంది. మూవీ ట్రైలర్‌లో భగవద్గీత శ్లోకాన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా వాడింది చిత్రయూనిట్. దీనిపై నటి కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు కించపరిచేలా ట్రైలర్ ఉందంటూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బూతు సన్నివేశాలకు భగవద్గీత శ్లోకం ఎలా వాడుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి దీనిపై చిత్రయూనిట్ ఏమని స్పందిస్తుందో చూడాలి!
కాగా కమిట్‌మెంట్ చిత్రాన్ని ఆగస్టు 19న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.
చదవండి: దుస్తులు లేకుండా రణ్‌వీర్.. అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ
కిడ్నీ ఫెయిలై మహాభారత్ నటుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment