బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వి మదివాడ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కమిట్‌మెంట్. నాలుగు ఇంట్రెస్టింగ్ కథలతో తెరకెక్కిన ఈ మూవీని రచనా మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. లక్ష్మీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తేజస్వీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► ఈ సినిమాలో నాలుగు స్టోరీలు ఉన్నాయి అందులో ఒకటి నాది. ఇందులో నా క్యారెక్టర్ సినిమా చాన్స్ అవకాశాల కోసం తిరిగేది.ఇండస్ట్రీ లో జరిగే న్యాచురాలిటీ కి దగ్గర గా ఈ సినిమా ఉంటుంది . అందుకే ఈ స్టోరీ వినగానే ఓకే చేశాను . సినిమా ఇండస్ట్రీని బద్నామ్ చేయొద్దు అని చెప్పేదే ఈ మూవీ మెసేజ్. కమిట్‌మెంట్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇది చాలా డిఫరెంట్ మూవీ. ఇందులో ప్రతిదీ నేచురల్‌గా ఉంటుంది.
► ఒక సినిమా కి ఎంత అవసరం ఉంటుందో అంతే చేయాలి. బోల్డ్ అయినా కిస్ సీన్ అయినా కంటెంట్ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తాను . ఈ సినిమాలోనూ రొమాన్స్ ఉంటుంది. ఈ మూవీలో శ్రీనాథ్ నాతో రొమాన్స్ సీన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు(నవ్వుతూ..)
► ఇండస్ట్రీలో నన్ను ఎవరూ కమిట్‌మెంట్ అడగలేదు. అందరూ నాతో కూల్‌గానే ఉన్నారు. నన్ను కమిట్‌మెంట్ అడగాలి అంటే బయపడేవాళ్లు . ఇప్పటికీ వరుస అవకాశాలు వస్తున్నాయి కానీ.. చాలా మంది అక్క, చెల్లి క్యారెక్టర్స్ అని చెబుతున్నారు. లేదంటే బోల్డ్ క్యారెక్టర్స్ తీసుకొస్తున్నారు. ‘కేరింత’లాంటి క్యారెక్టర్స్ ఎవరూ ఇవ్వడం లేదు(నవ్వుతూ)
► సినిమాలు మానేసి పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు అన్నారు. అందుకే పెళ్లి చేసుకోవడం మానేశా(నవ్వుతూ..)
► బిగ్‌బాస్‌లోకి వెళ్లడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఆ షో కారణఃగానే ఇల్లు, కారు కొనుక్కొని హ్యాపీగా ఉన్నాను. బిగ్‌బాస్‌లోకి వెళ్లడం వల్ల ఆఫర్స్ మిస్ అయ్యాయని ఎవరైనా అంటే కూడా ఐ డోంట్ కేర్. , సినిమా ఇండస్ట్రీ కి వచ్చిందే మనీ కోసం. నేను చాల స్మార్ట్.. లైఫ్‌ని ఎలా రన్ చేయాలో బాగా తెలుసు.
► ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ చిత్రంలోనూ నటిస్తున్నాను. ఇతర భాషల నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment