శివారెడ్డి-అమిత్ తివారి హీరోలుగా ‘రెంట్’ | Shiva Reddy, Amit Tiwari Rent Movie Latest Updates | Sakshi
Sakshi News home page

శివారెడ్డి-అమిత్ తివారి హీరోలుగా ‘రెంట్’

Published Sun, Aug 28 2022 4:41 PM | Last Updated on Sun, Aug 28 2022 4:41 PM

Shiva Reddy, Amit Tiwari Rent Movie Latest Updates - Sakshi

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, అమిత్‌ తివారి, వనితారెడ్డి, మనీషాశ్రీ,చైతన్య ప్రియ ప్రధాల పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రెంట్’. ‘నాట్ ఫర్ సేల్’ అన్నది ఉప శీర్షిక. ఈ రొమాంటిక్‌ థ్రిల్లర్‌కు రఘువర్ధన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ - రామ్ నాథ్ ముదిరాజ్ మూవీస్ పతాకాలపై  చందక రాజ్ కుమార్ - సి.హెచ్.రామ్ నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ విభిన్న కథాచిత్రం గోవా, దేవఘడ్ తదితర ప్రాంతాల్లో మూడో షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివారెడ్డి, అమిత్ తివారి మాట్లాడుతుతూ..  హర్రర్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న  రెంట్‌ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని  తెలిపారు. ఈ చిత్రానికి  డి.ఎస్.ఆర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, హజరత్ (వలి) డీవోపీగా పనిచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement