Shiva Reddy
-
హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు
అనంతపురం: అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దెయ్యం శివారెడ్డి హత్య కేసులో ఏడుగురు నిందితులకు రెండు జీవితకాల కఠిన కారాగార శిక్షలు (ఏకకాలంలో అమలవుతుంది) విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ తీర్పు చెప్పారు. కందుకూరు గ్రామానికి చెందిన దెయ్యం శివారెడ్డి, అతని కుమారుడు భానుప్రకాష్‌రెడ్డి 2018, మార్చి 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు పొలంలో గడ్డి కోసుకుని బైక్‌పై పెట్టుకుని ఇంటికి వెళుతుండగా, వారి గ్రామానికే చెందిన టీడీపీ నాయకుడు బోయ సాకే బాలకృష్ణ, అతని చిన్న తమ్ముడు (మైనర్) అడ్డుకునేందుకు ప్రయత్నించారు.బైక్ నడుపుతున్న భానుప్రకాష్‌రెడ్డి ఆపకుండా ముందుకు వెళ్లగా, బాలకృష్ణ తమ్ముడు రమేష్, బంధువులు అశోక్, సూర్యనారాయణ మరో బైక్‌పై వచ్చి ఢీకొట్టారు. భానుప్రకాష్‌రెడ్డి, శివారెడ్డి కిందపడిపోయారు. బాలకృష్ణ, అతని చిన్న తమ్ముడు (మైనర్), సూర్యనారా యణ వేటకొడవళ్లతో శివారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తన తండ్రిని చంపవద్దని వేడుకున్న భానుప్రకాష్‌రెడ్డిపై కూడా దాడి చేసేందుకు బాలకృష్ణ తమ్ముళ్లు భాస్కర్, విజయ్, కుమారుడు (మైనర్) వేటకొడవళ్లు పట్టుకుని వెంటపడ్డారు. భానుప్రకా ష్‌రెడ్డి కేకలు వేయడంతో సమీపంలోనే పొలంలో ఉన్న అతని చిన్నాన్న నరసింహారెడ్డి, నాగిరెడ్డి, సతీష్‌రెడ్డి రావడంతో బాలకృష్ణ, అతని తమ్ముళ్లు, బంధువులు పారిపోయారు.తీవ్రంగా గాయపడిన శివారెడ్డి అక్కడిక్కడే చనిపోయాడు. భానుప్రకాష్‌రెడ్డి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అభియోగాలు రుజువుకావడంతో బోయ సాకే బాలకృష్ణ, రమేష్, అశోక్, భాస్కర్, విజయ్‌కుమార్, తలా రి సూర్యనారాయణ, మహేంద్రలకు రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష (ఏకకాలంలో అమలు) విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీరిలో సాకే భాస్కర్, సాకే విజయ్‌కుమార్‌లకు రూ.35వేలు చొప్పున, మిగిలిన ఐదుగురికి రూ.30 వేలు చొప్పున జరిమానా విధించారు. ఇద్ద రు మైనర్లపై జువైనల్ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు. శిక్ష పడినవారిలో సూర్యనారాయణ మినహా మిగిలిన ఆరుగురు అన్నదమ్ములు కావడం గమనార్హం. -
ఆమెతో కలిసి నటించాలన్న కల నెరవేరింది: హీరో
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం 'జ్యువెల్ థీఫ్'.శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పీఎస్ నారాయణ దర్శకత్వం వహించాడు. కృష్ణ సాయి, ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు నటించారు.తాజాగా ఈ సినిమా టీజర్‌ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశాడు. ఆయన మాట్లాడుతూ.. హీరోగా కృష్ణసాయి 'జ్యువెల్ థీఫ్' సినిమాలో యాక్షన్ పార్టులు బాగా చేసాడు. సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. సమాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజ జీవితంలోనూ ఆయన రియల్ హీరో అని తెలిపాడు.హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ... నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. ఒకప్పుడు హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూశాను. ఆమెతో కలిసి నటించాలన్న కల 'జ్యువెల్ థీఫ్' సినిమాతో నెరవేరింది అని పేర్కొన్నాడు. -
సీఎం సమక్షంలో వైఎస్సార్సీపీలోకి వీరశివారెడ్డి
పులివెందుల రూరల్/పుంగనూరు: వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో గురువారం కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. వీరశివారెడ్డితో పాటు ఆయన కుమారుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. కార్యాలయ ఆవరణలో వీరశివారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో గుర్తింపులేనందువల్ల పార్టీ మారినట్లు చెప్పారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగన్‌దేనన్నారు. ప్రతినెల 1వ తేదీ తెల్లవారకముందే వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటివద్దకే పింఛన్లు అందిస్తూ వికలాంగులు, వితంతువులకు ఇంటి పెద్దకొడుకు అనిపించుకున్నారని చెప్పారు. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్‌ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. రాష్ట్ర ప్రజలందరు రెండోసారి కూడా జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నిపార్టీలు ఏకమైనా జగన్మోహన్రెడ్డి విజయాన్ని ఆపలేవన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన చెప్పారు. పార్టీలో చేరిన శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి దంపతులుమాజీ మంత్రి అమరనాథరెడ్డి సోదరుడు శ్రీనాథరెడ్డి, ఆయన సతీమణి అనీషారెడ్డి గురువారం సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మంత్రి పెద్ది రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు వారు చర్చలు జరిపారు. నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల వచ్చిన సీఎంను శ్రీనాథరెడ్డి దంపతులు కలిసి పార్టీలో చేరారు. సీఎం వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో సీనియర్లుగా ఉన్న శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి వైఎస్సార్సీపీలోకి రావడంతో పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో టీడీపీకి ఊహించని దెబ్బ పడింది. శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆశయాలు, సీఎం పనితీరు, అభివృద్ధి, సంక్షేమం చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. -
సీఎం సమక్షంలో వైఎస్సార్సీపీలోకి వీరశివారెడ్డి
పులివెందుల రూరల్/పుంగనూరు: వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో గురువారం కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. వీరశివారెడ్డితో పాటు ఆయన కుమారుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. కార్యాలయ ఆవరణలో వీరశివారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో గుర్తింపులేనందువల్ల పార్టీ మారినట్లు చెప్పారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగన్‌దేనన్నారు. ప్రతినెల 1వ తేదీ తెల్లవారకముందే వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటివద్దకే పింఛన్లు అందిస్తూ వికలాంగులు, వితంతువులకు ఇంటి పెద్దకొడుకు అనిపించుకున్నారని చెప్పారు. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్‌ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. రాష్ట్ర ప్రజలందరు రెండోసారి కూడా జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నిపార్టీలు ఏకమైనా జగన్మోహన్రెడ్డి విజయాన్ని ఆపలేవన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన చెప్పారు. పార్టీలో చేరిన శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి దంపతులుమాజీ మంత్రి అమరనాథరెడ్డి సోదరుడు శ్రీనాథరెడ్డి, ఆయన సతీమణి అనీషారెడ్డి గురువారం సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మంత్రి పెద్ది రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు వారు చర్చలు జరిపారు. నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల వచ్చిన సీఎంను శ్రీనాథరెడ్డి దంపతులు కలిసి పార్టీలో చేరారు. సీఎం వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో సీనియర్లుగా ఉన్న శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి వైఎస్సార్సీపీలోకి రావడంతో పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో టీడీపీకి ఊహించని దెబ్బ పడింది. శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆశయాలు, సీఎం పనితీరు, అభివృద్ధి, సంక్షేమం చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. -
మిమిక్రీ ఆర్టిస్ట్ శివ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది
మచిలీపట్నంటౌన్: ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తూనే.. మరికొన్ని డిమాండ్లను కూడా నెరవేర్చేందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తున్నారని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కె.వి.శివారెడ్డి చెప్పారు. ఆదివారం విజయవాడలో వారు.. ఉద్యోగులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి అంచెలంచెలుగా పరిష్కరిస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్‌పై త్వరలోనే జీవో రాబోతోందన్నారు. సీఎం జగన్.. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం అభినందనీయమన్నారు. ఉద్యోగులపై సీఎం జగన్ ప్రేమాభిమానాలు చూపుతున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 33 ఏళ్లుగా కార్పొరేషన్ కింద ఉన్న ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను సీఎం జగన్ 010 పరిధిలోకి తెచ్చారని వివరించారు. ఈ ఉద్యోగులు గతంలో ఎప్పుడు జీతం పడుతుందో తెలియక ఇబ్బందులు పడేవారని.. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే జీతం అందుకుంటున్నారని చెప్పారు. సీపీఎస్ కాకుండా జీపీఎస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని.. ఇది కూడా ఉపయోగకరమేనన్నారు. 71 డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించగా.. 65 డిమాండ్లపై సానుకూలంగా స్పందించారని.. మిగిలిన వాటిని కూడా సీఎం జగన్ పరిష్కరిస్తారనే ఆశాభావం తమకు ఉందన్నారు. ఆగస్ట్ 21, 22 తేదీల్లో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే సంఘం మహాసభలను జయప్రదం చేయాలని ఉద్యోగులను కోరారు. ఈ సభలకు సీఎం జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నారన్నారు. సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం నాయకులు ఉల్లి కృష్ణ, ఎ.వెంకటేశ్వరరావు, దారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ వాయిస్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన స్నేహితుడు లంకా రామశివారెడ్డి కొట్టిపారేశారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని.. ఫోన్లో తాను రికార్డ్ చేసిన వాయిస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రామశివారెడ్డి బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఇంత రాద్ధాంతం చేస్తాడనుకోలేదు.. ‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నా స్నేహితుడే. ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఆ తర్వాత ఆయన రాజకీయాలు వైపు వెళ్లగా.. నేను కాంట్రాక్టర్‌గా మారాను. డిసెంబర్లో నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోటంరెడ్డి ప్రభుత్వ అధికారుల మీద, ఆయనకు కలిగిన ఇబ్బందుల మీద సుదీర్ఘంగా మాట్లాడారు. అదే రోజు సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నాకు ఫోన్ చేశాడు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశం విషయాలపై చర్చించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల విషయంలో తొందరపాటుగా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని సలహా ఇచ్చాను. నియోజకవర్గ నిధులు, కాంట్రాక్టు పనులు, ఇతర పరిణామాలన్నీ సుదీర్ఘంగా చర్చించుకున్నాం. అవన్నీ కూడా నా ఫోన్లో ఆటోమేటిక్‌గా రికార్డయ్యాయి. నేను చెన్నై వెళ్లినప్పుడు.. కోటంరెడ్డితో ఫోన్లో మాట్లాడిన వాయిస్ రికార్డును నా స్నేహితుడికి పంపాను. అది యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప.. కావాలని చేసింది కాదు. ఆ తర్వాత అది కాస్తా వైరల్ అయ్యింది. ఇంత పెద్ద వివాదం అవుతుందని ఊహించలేదు. కోటంరెడ్డి అనవసరంగా చిన్న విషయంపై ఇంత రాద్ధాంతం చేస్తాడని అనుకోలేదు. రెండు, మూడు రోజుల్లో సమసిపోతుందనుకున్నా. అందుకే ఇంతకాలం బయటకు రాలేదు. కానీ కోటంరెడ్డి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో నాకు కొంత ఆందోళన కలిగింది. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇప్పుడు బయటకు వచ్చా. కోటంరెడ్డి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసినా ఫర్వాలేదు. నాది ఆండ్రాయిడ్ ఫోన్. ప్రతి ఫోన్ కాల్ రికార్డ్ అవుతుంది. గత 5 నెలలుగా నేను వాడుతున్న ఫోన్‌ను చెక్ చేసుకోండి. అన్ని కాల్స్ రికార్డ్ అయిన విషయం తెలుస్తుంది. ఎవరు వచ్చినా.. నా ఫోన్ ఇస్తా.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి నిజాలు తెలుసుకోవచ్చు. నేను వాయిస్ రికార్డు పంపిన నా స్నేహితుడి పేరును విచారణ అధికారులకు చెబుతా. ఆయన పేరు ఇప్పుడు బహిరంగంగా చెప్పి.. ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు’ అని లంకా రామశివారెడ్డి వివరణ ఇచ్చారు. -
ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్తున్న గణనాథులు
-
శివారెడ్డి-అమిత్ తివారి హీరోలుగా ‘రెంట్’
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, అమిత్ తివారి, వనితారెడ్డి, మనీషాశ్రీ,చైతన్య ప్రియ ప్రధాల పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రెంట్’. ‘నాట్ ఫర్ సేల్’ అన్నది ఉప శీర్షిక. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌కు రఘువర్ధన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ - రామ్ నాథ్ ముదిరాజ్ మూవీస్ పతాకాలపై చందక రాజ్ కుమార్ - సి.హెచ్.రామ్ నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ విభిన్న కథాచిత్రం గోవా, దేవఘడ్ తదితర ప్రాంతాల్లో మూడో షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివారెడ్డి, అమిత్ తివారి మాట్లాడుతుతూ.. హర్రర్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న రెంట్ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. ఈ చిత్రానికి డి.ఎస్.ఆర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, హజరత్ (వలి) డీవోపీగా పనిచేస్తున్నారు. -
అన్ని కాలాలకు వర్తించేదే మార్క్సిజం
సుందరయ్య విజ్ఞానకేంద్రం : మార్క్సిజానికి కాలపరిమితి లేదనీ, అన్ని కాలాలకు వర్తించేదే ఆ సిద్ధాంతమని దీన్ని మన సమాజానికి వర్తింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కవి, విమర్శకుడు కె.శివారెడ్డి అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, నవచేతన బుక్‌హౌస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రచయిత కె.గాంధీ రాసిన తెలుగు అనువాదం ‘మార్క్స్, ఏంగెల్స్ రచించిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక, కమ్యూనిజం సూత్రాలు’పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివారెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ లోని అభిప్రాయ భేదాల వల్ల విడిపోయి అవి బలహీన పడ్డాయన్నారు. పురోగమన శక్తుల నుంచే గొప్ప కవిత్వం వస్తుందని చెప్పారు.సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సైద్ధాంతిక అధ్యయనంతో వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలని, ఐక్య ఉద్యమాల ద్వారానే దోపిడీ శక్తులను తిప్పికొట్టాలన్నారు. పెట్టుబడిదారీ సమాజం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఘర్షణలు, యుద్ధాల ద్వారా వైవిధ్యాన్ని, సంక్షోభాన్ని పేద దేశాలపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయ ని హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ దాడులను తిప్పికొట్టడానికి కమ్యూనిస్టులంతా ఐక్యంగా పని చేయాలని చెప్పారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సీపీఎం, సీపీఐ పార్టీలు దేశ ఆర్థిక పరిస్థితులను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అర్థం చేసుకున్నారని, అందుకే భిన్నమైన రీతుల్లో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. సాయుధ పోరాటయోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య, తెలం గాణ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, ప్రజా గాయకురాలు విమలక్క, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌస్, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ కోయ చంద్రమోహన్, నవచేతన పబ్లిషింగ్ హౌస్ ప్రతినిధి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
శివారెడ్డి హత్యపై భగ్గుమన్న వైఎస్సార్సీపీ
-
అట్టుడికిన అనంత
అనంతపురం న్యూసిటీ: అనంతపురం మండలం కందుకూరులో శుక్రవారం ప్రత్యర్థుల చేతిలో వైఎస్సార్సీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యకు గురయ్యారు. సర్వజనాస్పత్రి మార్చురీలో శివారెడ్డి మృతదేహాన్ని శనివారం ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, శంకరనారాయణ, రాప్తాడు, తాడిపత్రి, అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, నదీం అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రిష్టప్ప, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైటీ శివారెడ్డి సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మృతదేహాన్ని సందర్శించిన వారిలో వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, పార్టీ నేతలు పైలా నర్సింహయ్య, మహానందరెడ్డి, నరేంద్రరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, ఆలమూరు సుబ్బారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కొండమ్మ, కృష్ణవేణి, ప్రశాంతి తదితరులు ఉన్నారు. పరిటాల శ్రీరామ్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చండి పరిటాల శ్రీరామ్ అండతోనే శివారెడ్డి హత్య జరిగిందని, ఎఫ్ఐఆర్లో ఆయన పేరును చేర్చాలని మార్చురీ ఆవరణలోనే వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చేశారు. సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ మంత్రి సునీతకు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ జోక్యం చేసుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. పరిటాల సునీత, శ్రీరామ్‌తోపాటు పరిటాల మహేంద్ర, మురళి ప్రమేయంతోనే హత్య జరిగిందని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. సీఐ ఉదాసీనతే హత్యకు కారణమని డీఎస్పీ దృష్టికి తెచ్చారు. పోలీసులు పచ్చ చొక్కాలకు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాను రాజకీయంగా శాసించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు దారుణాలకు తెగిస్తున్నారని, ఎన్నికల ఎత్తుగడలో భాగంగా టీడీపీ నేతలు హత్యాకాండకు తెరదీశారని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. శివారెడ్డిది ప్రభుత్వ హత్యేనని, ఈ హత్యకు సీఎం చంద్రబాబు, మంత్రి పరిటాల సునీత పూర్తి బాధ్యత వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకరనారాయణ డిమాండ్ చేశారు. మృత దేహంతో ర్యాలీ శివారెడ్డి మృతదేహంతో ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాలని వైఎస్సార్సీపీ నేతలు సర్వజనాస్పతి నుంచి ర్యాలీగా బయలు దేరారు. తెలుగుతల్లి విగ్రహం వద్దకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన హత్యాకాండపై డీఎస్పీ వెంకట్రావ్‌కు ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎంపీ ‘అనంత’, ప్రకాశ్‌రెడ్డి వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. మంత్రి సునీత బాధ్యత వహించాలి పోలీసుల మెతక వైఖరితోనే శివారెడ్డి హత్యకు గురయ్యాడు. వ్యవసాయం చేస్తూ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారిని హత్య చేయడం కిరాతకం. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న వరుస హత్యలకు మంత్రి పరిటాల సునీత పూర్తి బాధ్యత వహించాలి. హత్యలు జరుగుతుంటే, అదుపు చేయాల్సిన బాధ్యత మంత్రిపై ఉంది. కేసులో భాగస్వామ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరతాం. పీర్ల పండుగలో జరిగిన గొడవ తర్వాత హత్యకు ప్రయత్నిస్తున్నారని తమ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలకు రాచమర్యాదాలు చేస్తున్నారు. – వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ కిరాయి హంతకులతో హత్యలు రౌడీలు, కిరాయి హంతకులను మంత్రి సునీత, శ్రీరామ్, మహేంద్ర, మురళి దగ్గరపెట్టుకుని ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను హత్యలు చేయిస్తున్నారు. శివారెడ్డి ప్రజాదరణ కలిగిన కార్యకర్త. అతన్ని హత్య చేస్తే పార్టీ శ్రేణులు భయోత్పాతానికి గురవుతారనే చంపేశారు. కందుకూరులో పరిటాల మహేంద్ర దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీ వస్తుందనే కుట్రతోనే హత్య చేయించారు. బీకేఎస్ మండలానికి చెందిన రౌడీషీటర్ బాలకృష్ణకు ఇక్కడ పార్టీ పగ్గాలు అప్పగించారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం చేతకాక, ఓటమి భయంతో మంత్రి సునీత దాడులకు ఉసిగొల్పుతున్నారు. నసనకోటలో బోయ సూర్యంపై దాడి చేయించారు. శ్రీరామ్ తనను తీసుకెళ్లి చితకబాదాడని సూర్యం రెండుసార్లు ఎస్పీకి రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. టీడీపీ ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు చేసినా పోలీసులు వెనుకేసుకొస్తున్నారు. శివారెడ్డి హత్య కేసులో మంత్రి, వారి బంధువులను తప్పించాలని చూస్తున్నారు. – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, రాప్తాడు -
వారిది 3 దశాబ్దాల వైరం
వారి కోసం ఫ్యాక్షన్ కోరల్లో కూరుకుపోయిన ఎన్నో కుటుంబాలు ఇకపై టీడీపీ నేతలుగా చలామణి కానున్న దేవగుడి సోదరులు జీర్ణించుకోలేకపోతున్న గుండ్లకుంట వాసులు ఫ్యాక్షన్‌తో నలిగిపోయిన సుగమంచుపల్లె, చింతకుంట, కోడిగాండ్లపల్లె, కొండాయపల్లె, జంగాలపల్లె, జె.కొట్టాలపల్లె, సుద్దపల్లె, నాగరాజుపల్లె, పాలూరు, బిటిపాడు, చిన్నముడియం, చిన్నపసువుల, పెనికలపాడు ఇలా చెప్పుకుంటూపోతే చాలా గ్రామాలకు చెందిన టీడీపీ శ్రేణులు దేవగుడి బ్రదర్స్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప : ఆ రెండు కుటుంబాల వారు ఇన్నాళ్లూ ఉప్పు నిప్పులా జీవించారు. ఆధిపత్యం కోసం పరస్పర పోరు నడిపారు. వీరినే నమ్ముకొని వందలాది మంది ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి శల్యమయ్యారు. మరికొందరు ఇప్పటికీ జీవిత ఖైదీలుగా జైల్లో మగ్గుతున్నారు. ఫ్యాక్షన్‌కు నిలువెత్తు నిదర్శనంగా జమ్మలమడుగు నియోజకవర్గం నిలిచింది. తెలుగుదేశం పార్టీ వర్గీయులుగా గుండ్లకుంట శివారెడ్డి కుటుంబం కొనసాగుతుండగా వైరి వర్గంగా దేవగుడి నారాయణరెడ్డి కుటుంబం నిలిచింది. ఇలా మూడు దశాబ్దాలుగా గ్రామాల్లో ఆ రెండు కుటుంబాలకు చెందిన అనుచరుల మధ్య సైతం పరస్పర ఫ్యాక్షన్ నడిచింది. అంతటి చరిత్ర ఉన్న ఆ రెండు కుటుంబాలు ప్రస్తుతం పసువు జెండా నీడన చేరాయి. ‘గుండ్లకుంట శివారెడ్డి’ పేరు ఉచ్చరించగానే ఫ్యాక్షన్ రాజకీయాలు టక్కున గుర్తుకు వస్తాయి. 80వ దశకం పూర్తయ్యే వరకూ జమ్మలమడుగులో ఆయన హవా నడిచింది. జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ క్రమంలో 1983, 85, 89లో జమ్మలమడుగు నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం అనూహ్యంగా హైదరాబాద్‌లో హత్యకు గురయ్యారు. ఆపై వారసుడుగా శివారెడ్డి అన్న కుమారుడు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి తెరపైకి వచ్చారు. 1994, 99లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి, చంద్రబాబు క్యాబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో 1983 నుంచి 2004 వరకూ పొన్నపురెడ్డి కుటుంబానిదే పైచేయిగా నిలిచింది. కాగా, పుష్కరకాలంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో దేవగుడి కుటుంబీకుల ఆధిపత్యం నడుస్తోంది. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆదినారాయణరెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గాలిలో అతి సునాయాసంగా టీడీపీ అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిని ఓడించారు. తర్వాత 2009, 2014లో సైతం జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎందరో నాయకుల తోడ్పాటు, మరెందరో కార్యకర్తల సహకారం అండగా నిలిచింది. పసుపు కండువా కప్పుకున్న దేవగుడి బ్రదర్స్.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పసువు కండువా ధరించారు. ఇప్పటివరకూ ఆ ప్రాంతంలో టీడీపీ అంటేనే పొన్నపురెడ్డి కుటుంబం. పొన్నపురెడ్డి కుటుంబం అంటే టీడీపీ అన్నట్లుగా ఉండేది. అలాంటి పరిస్థితిలో చదిపిరాళ్ల (దేవగుడి) బ్రదర్స్ టీడీపీలో చేరడాన్ని ఆ ప్రాంతపు టీడీపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యక్తిగతంగా ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితిలో కొనసాగిన నేపథ్యమే ఇందుకు కారణంగా పలువురు భావిస్తున్నారు. ఈ రెండు కుటుంబాల కారణంగా అనేక మంది హతులయ్యారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇప్పటికీ ఆ కుటుంబాలకు చెందిన అనుచరులు జీవిత ఖైదీలుగా వివిధ జైళ్లలో మగ్గుతున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో దేవగుడి సోదరులు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం పొన్నపురెడ్డి వర్గీయులకు శరాఘాతంగా భావిస్తున్నట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. కలిసి పనిచేయడం సాధ్యమేనా? నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు మీడియా ఎదుట చెప్పుకొచ్చారు. కంప్యూటర్ యుగంలో సైతం పాత గొడవలు విస్మరించాలని, పొన్నపురెడ్డి వర్గీయులతో కలుపుగోలుగా వెళ్లేందుకు సమ్మతమేనని ప్రకటించారు. వాస్తవంలో అది అంత సులువు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే చేరిక అంశం తెరపైకి రాగానే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. ఎందుకోసం? ఎవరికోసం? ఏం ఆశించి పార్టీలోకి వస్తున్నావని నిలదీశారు. కేశవరెడ్డి విద్యా సంస్థల యజమాని ఆస్తులు కాపాడుకోవడమే లక్ష్యం కాదా.. అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిని బట్టి ఆ కుటుంబాల మధ్య వైరం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ ఒక ఒరలో రెండు కత్తులు ఇమడడం కష్టమేనని పలువురు చెప్పుకొస్తున్నారు. ఫ్యాక్షన్ కారణంగా ఎన్నో ఇక్కట్లు పడ్డామని, ఆ ఇబ్బందులకు కారణమైన దేవగుడి బ్రదర్స్‌కు పార్టీలో ఎలా చోటు కల్పిస్తారంటూ నియోజకవర్గంలోని పలు గ్రామాల నేతలు టీడీపీ ఉన్నత స్థాయి నేతలను నిలదీస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో ఆయా గ్రామాల్లోని బాధితులు ఆ ఇరు కుటుంబాలతో కలిసి అడుగులు వేయడం అసాధ్యమేనని పలువురు విశ్వేషిస్తున్నారు. -
సెలబ్‌డబ్ శివసేవ
ఆయన వేదికపైకి రాగానే.. ముందుగా ఎన్టీఆర్ పలకరిస్తాడు.. ఆ వెంటనే ఏఎన్నార్ తొంగిచూస్తాడు.. వీరిద్దరి వంతు పూర్తయ్యిందో లేదో నేనున్నానంటూ కృష్ణ వచ్చేస్తాడు. ఆపై శోభన్‌బాబు.. చిరంజీవి.. రాజశేఖర్.. ఇలా వెండితెర వేలుపులందరూ ఒకరి వెంట ఒకరు వచ్చి పలకరించి పోతుంటారు. వీరందరి స్వరాలను.. తన గళంలో ఇముడ్చుకుని.. నవ్వుల్ని పండించడంలో మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి దిట్ట. సినీరంగానికి చెందిన ఈ వ్యక్తి సినిమాల కన్నా తనదైన ప్రతిభతో జనాలకు దగ్గరయ్యారు. తనకు వచ్చిన కళను నలుగురినీ నవ్వించడానికి.. దాని ద్వారా వచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని, సంపాదనను నలుగురి కన్నీళ్లు తుడవడానికి వెచ్చిస్తున్నారు. ఆయన మనసుకు నచ్చిన పనుల గురించి గుర్తు చేసుకోమన్నప్పుడు.. ఇలా స్పందించారు. ..:: ఎస్.సత్యబాబు బహుశా నాలుగేళ్ల క్రితం అనుకుంటా.. నా తమ్ముడు సంపత్‌రెడ్డి వచ్చి ఓ విషయం చెప్పాడు. కూకట్‌పల్లిలో కూరగాయలు అమ్ముకునే వ్యక్తి మానసికంగా ఎదగని కూతుర్ని చూసి కుంగిపోకుండా మరికొందరు బుద్ధిమాంద్యం ఉన్న పెద్ద‘పిల్లల’కు ఆశ్రయం ఇస్తున్నాడని. ఎదుటివారి కష్టాలకు వెంటనే స్పందించే గుణం నాకు ఉందని తెలుసు కాబట్టే సంపత్ నాతో ఆ విషయం చెప్పాడేమో..! కళ్లలో నీళ్లు తిరిగాయి.. కొన్నిరోజుల తర్వాత వీలు చూసుకుని ఆ కూరగాయలు అమ్ముకునే శ్రీనివాస్‌ని కలిశాను. ఆయన తన కూతురి పేరు మీద నిర్వహిస్తున్న యామిని ఫౌండేషన్ అప్పట్లో ఇంకా బాలారిష్టాలు దాటలేదు. అక్కడికి వెళ్లి చూస్తే దాదాపు యాభై మంది వయసు ఎదిగినా మనసు ఎదగని పిల్లలు కనిపించారు. వారిని చూడగానే కళ్లలో నీళ్లు తిరిగాయి. కావాల్సిన తెలివితేటలు, ఆలోచించే శక్తి ఉన్న వాళ్లకే ఈ ప్రపంచంలో ఏదో రూపంలో కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి.. ఇలాంటి పిల్లల జీవనం ఎలా అని అనుకుంటేనే.. హృదయం ద్రవించింది. వెంటనే వాళ్లకు నాకు చేతనైనంత సాయం చేస్తానని మాటిచ్చాను. ఓ చారిటీ షో నిర్వహించి రూ.8 లక్షలు కలెక్ట్ చేశాను. మరో చారిటీ షో ద్వారా రూ.12 లక్షలు సమకూర్చగలిగాను. అది మొదలు ఆ సంస్థకు వీలైనన్ని మార్గాల్లో చేయగలిగినంత సాయం చేశాను. సినీ ప్రముఖుల సహకారంతో అక్కడ ఈవెంట్స్ నిర్వహించి, వచ్చిన ఆదాయాన్ని సంస్థకు అందించాం. సంస్థ నిర్వహణ మరింత మెరుగైంది. కొంతకాలానికి అక్కడ ఆశ్రయం పొందే పిల్లల సంఖ్య కూడా వందల్లో పెరిగింది. దాతలు కూడా స్పందిస్తున్నారు. నేను వెళ్లగానే నన్ను గుర్తుపట్టి.. చుట్టుముట్టేసి.. నేను చిన్న జోక్ వేసినా నవ్వేసే అమాయకపు ‘పిల్లల’ ఆనందం, పోటీలుపడుతూ కౌగిలించుకుని వదలనంత ఆప్యాయత వెలకట్టలేనివి. చేతనైనంత.. వైజాగ్‌లో నేను ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. నాకెందరో స్నేహితులున్నారక్కడ. మొన్నటి హుద్‌హుద్ తుఫాన్ తాకిడికి విశాఖ కకావికలమైంది. సినీ పరిశ్రమలో అందరితో పాటు నా వంతుగా కొంత సాయం చేశాను. ఇలాంటి సమయాల్లోనే కాదు.. అక్కడిక క్కడ స్పందించి అందించిన సందర్భాలూ ఉన్నాయి. గతంలో ఒకసారి ప్రొద్దుటూరులో ప్రోగ్రామ్‌కు వెళ్లాను. అయిపోయిన తర్వాత ఎవరో ఒకాయన వచ్చి దగ్గర్లోనే ఓల్డేజ్ హోం ఉంది కాసేపు ఉండి వాళ్లని ఎంటర్టైన్ చేయమని రిక్వెస్ట్ చేస్తే వెళ్లాను. ఆ సమయంలో అక్కడ కనీసం పడుకోవడానికి చాప కూడా లేని దుస్థితి చూసి చలించిపోయాను. వృద్ధాప్యంలో కూడా అన్ని కష్టాలా.. అనిపించింది. వెంటనే వాళ్లకి మంచాలు పంపించాను. ఈ మధ్యే ఎల్బీనగర్ వెళ్లినప్పుడు అక్కడ ఓ 8 ఏళ్ల చిన్నారి తీవ్రమైన డయాబెటిస్తో బాధపడుతోందని తెలిసింది. వాళ్లు నిరుపేదలు. మనసాగలేదు. చేతనైనంత ఇచ్చి వచ్చాను. పటాన్‌చెరులోని స్మైల్ ఓల్డేజ్హోమ్కి వెళ్లి ఓ వాలంటరీ కార్యక్రమం చేసి వచ్చాను. మన కనీస అవసరాలు తీరిపోయాక కష్టాల్లో ఉన్నవారి అవసరాలు సైతం మనవి అనుకోవడమే మనిషి గుణం అని భావించడానికి నా ఒకప్పటి అనుభవాలే కారణం. దారిద్య్రం ఎన్ని రకాలుగా హింసిస్తుందనేది స్వయంగా చవి చూసినవాణ్ని. ఆఫీస్‌బాయ్‌గా చేశా. బట్టల దుకాణంలో పనిచేశా. అన్నం పెడితే చాలంటూ ఇళ్లలో పనిచేసిన రోజులున్నాయి. అందుకే ఎవ రైనా అలాంటి సమస్యల్లో ఉన్నారంటే స్పందిస్తుంటా. -
సహానుభూతి
‘‘మరీ అంతగా నెత్తిన పెట్టుకున్నారేం?’’ గతవారం ‘దైవికం’ చదివిన వారిలో కొందరు ‘సాక్షి’కి ఫోన్ చేసిన అడిగిన ప్రశ్న ఇది. స్త్రీకి దైవత్వాన్ని ఆపాదించడం కూడా దైవదూషణే అవుతుందని వారు ఈ కాలమిస్టును ఆత్మీయంగా హెచ్చరించారు. ధన్యవాదాలు. అయితే ఒక సందేహం. స్త్రీకి కనీస గౌరవాన్ని, కనీస సౌకర్యాన్ని ఇవ్వకపోవడం దైవదూషణ అనిపించుకోదా?! ఇవన్నీ వాదనలతో తేలేవీ, తెలిసేవీ కాదు. కవి శివారెడ్డిలా స్త్రీ హృదయంలోకి ప్రవేశించాలి. అప్పుడిన్ని సందేహాలు రావు. అయితే- ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ, ‘‘ఆఫీస్‌కి క్యారేజీ రెడీ చేశావా, రాత్రికేం చేస్తున్నాం’’ అని అడిగినంత తేలికా... స్త్రీ హృదయంలోకి ప్రవేశించడం? కానే కాదు. మగపుట్టుక కదా! అన్నీ వేర్వేరు. లోపలి గ్రంధులు, నరాలు, నాళాలు. ఆ స్ట్రక్చర్, ఆ థాట్స్ అన్నీ డిఫరెంట్. మానవుడిగా పుట్టి దైవసాక్షాత్కారానికి యోగ్యత సాధించడం ఎంత కష్టమో, స్త్రీని మగవాడు అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం! ఇక మనం చేయగలిందేమైనా ఉందా అంటే స్త్రీల అసౌకర్యాలను అనుభూతి చెందే ప్రయత్నం చెయ్యడం. అది కూడా అయ్యే పని కాదు. చాలా శక్తి కావాలి. ఈ కండలు సరిపోవు. ఈ బుర్రలు సరిపోవు. ఈ చదువులు, సంస్కారాలు కూడా. ఒక సుపీరియన్ హ్యూమన్ బీయింగ్‌గా మగవాడు ఎదగాలి. అప్పుడేమైనా స్త్రీ మనసు మగవాడి మనసుకు అందుతుందేమో! లైంగిక హింస, లైంగిక దౌర్జన్యం, లైంగిక వేధింపు, లైంగిక అత్యాచారం స్త్రీని ఎంతగా కుంగదీస్తాయో మగవాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఆ బాధ, ఆ ఆవేదన, ఆ అవమానం ఎలా ఉంటుందో ఎన్ని జన్మలకీ అర్థం కాదు (ఆడజన్మకు తప్ప). బెత్తంతో కొడితే బెత్తానికి బాధ తెలుస్తుందా? రాయి తగిలితే రాయి ‘అమ్మా’ అంటుందా? అలాగే మగజన్మకు నొప్పి తెలియకపోవడంలో వింతేం లేదు. ఎలా మరి? దేనికి ఎలా? అదే, ఆడవాళ్ల బాధను అర్థం చేసుకోవడం ఎలా? ఇదిగో ఈ ప్రశ్న వేశారు కదా, సగం అర్థం చేసుకున్నట్లే. కనీసం అర్థం చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి! స్త్రీల ఆవేదనను, అసౌకర్యాలను అర్థం చేసుకునే ఉద్యమం ఒకటి ప్రస్తుతం బల్గేరియాలో బయల్దేరింది. ‘వాక్ ఎ మైల్ ఇన్ హర్ షూజ్’ అంటూ అక్కడి మగవాళ్లు కొందరు ఆడవాళ్లలా హై హీల్స్ వేసుకుని నడుస్తూ లైంగిక హింసలకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేపట్టారు. ‘స్త్రీల ఇబ్బందులేమిటో కొంతలో కొంతైనా అర్థం కావాలంటే, ఆ ఇబ్బందిని అనుభవించాలి తప్ప ఊహించలేం’ అనే విషయాన్ని సింబాలిక్‌గా హై హీల్స్ వేసుకుని మరీ అక్కడి మగవాళ్లు చూపిస్తున్నారు. మొన్న హైదరాబాద్‌లో కూడా ఉమెన్స్ డేకి ఇలాంటిదే ‘అర్థం చేయించే’ ప్రయత్నం ఒకటి జరిగింది. బస్టాపులు, టీ స్టాళ్లు, షాపింగ్ మాల్స్, పార్కులు... ఇలా కొన్ని బహిరంగ ప్రదేశాలలో అప్పటికప్పుడు కొంతమంది ఆడవాళ్లు ప్రత్యక్షమై, మగవాళ్లను వేధించారు. (రోడ్లపై మగాళ్లు ఆడవాళ్లను ఎలాగైతే వేధిస్తారో, సరిగ్గా అలాగే). ఇదో కనువిప్పు కార్యక్రమం. ‘నొప్పంటే ఇలా ఉంటుందిరా బయ్’ అని మగవాళ్లకు తెలియచెప్పడం. ‘మిర్రర్ మాబ్’ పేరుతో ‘హైదరాబాద్ ఫర్ ఫెమినిజం’ సంస్థ సభ్యులు ఇలా కొందరు మగాళ్లని ‘టీజ్’ చేశారు. వేధింపుల నాటకం అయ్యాక వీళ్లు అసలు విషయం చెప్పేవారు. ఆడవాళ్లను హర్ట్ చెయ్యడం హీరోయిజం కాదు అని చిన్నపాటి ప్రసంగం ఇచ్చి, ఇంకోచోటికి వెళ్లేవారు. ఏం జరుగుతుంది ఈ ప్రయత్నాల వల్ల? జరగనవసరం లేదు. జరగకుండా ఆగిపోతే చాలు... స్త్రీలపై ఈ దౌర్జన్యాలు, అఘాయిత్యాలు! స్త్రీ హృదయంలోకి ప్రవేశించే ద్వారాలను కాలితో తన్ని మూసేస్కోవడం మగవాడికి బాగా అలవాటు. ఆ అలవాటును మాన్పించే ఏ చిన్న ప్రయత్నమైనా దైవాన్వేషణ లాంటిదే. ముందు ఒక మెట్టంటూ ఎక్కితే, తర్వాత దేవుడే తన సన్నిధిలోకి రప్పించుకుంటాడు ఎంత నాస్తికుడినైనా! స్త్రీ హృదయంతో సహానుభూతి చెందడం అంటే దైవసాక్షాత్కారానికి యోగ్యత సంపాదించడమే. తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని, ఇరవై ఏళ్లు కళ్లలో పెట్టుకుని, ఆ తర్వాత భాగస్వామిగా జీవితాంతం కనిపెట్టుకుని ఉండే స్త్రీని నెత్తిన పెట్టుకోవడం దైవార్చన అవుతుంది కానీ దైవదూషణ అవుతుందా? చెప్పండి.