
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం 'జ్యువెల్ థీఫ్'.శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పీఎస్ నారాయణ దర్శకత్వం వహించాడు. కృష్ణ సాయి, ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు నటించారు.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశాడు. ఆయన మాట్లాడుతూ.. హీరోగా కృష్ణసాయి 'జ్యువెల్ థీఫ్' సినిమాలో యాక్షన్ పార్టులు బాగా చేసాడు. సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. సమాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజ జీవితంలోనూ ఆయన రియల్ హీరో అని తెలిపాడు.
హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ... నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. ఒకప్పుడు హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూశాను. ఆమెతో కలిసి నటించాలన్న కల 'జ్యువెల్ థీఫ్' సినిమాతో నెరవేరింది అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment