krishna sai
-
ఆమెతో కలిసి నటించాలన్న కల నెరవేరింది: హీరో
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం 'జ్యువెల్ థీఫ్'.శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పీఎస్ నారాయణ దర్శకత్వం వహించాడు. కృష్ణ సాయి, ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు నటించారు.తాజాగా ఈ సినిమా టీజర్‌ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశాడు. ఆయన మాట్లాడుతూ.. హీరోగా కృష్ణసాయి 'జ్యువెల్ థీఫ్' సినిమాలో యాక్షన్ పార్టులు బాగా చేసాడు. సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. సమాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజ జీవితంలోనూ ఆయన రియల్ హీరో అని తెలిపాడు.హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ... నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. ఒకప్పుడు హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూశాను. ఆమెతో కలిసి నటించాలన్న కల 'జ్యువెల్ థీఫ్' సినిమాతో నెరవేరింది అని పేర్కొన్నాడు. -
డ్రగ్స్ నిషేధంపై పాట రూపొందించిన హీరో కృష్ణసాయి
'జ్యువెల్ థీఫ్' సినిమా హీరో కృష్ణసాయి.. యాంటీ డ్రగ్స్‌పై 'డేంజర్' అనే పాటని రూపొందించారు. దీన్ని తాజాగా తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ వీక్షించారు.ఇకపోతే సామాజిక అవగాహనలో భాగంగానే 'డేంజర్: సే నో టూ డ్రగ్స్' అనే ప్రత్యేక పాటని చిత్రీకరించామని కృష్ణ సాయి చెప్పారు. చాలామంది యువత డ్రగ్స్ ఊబిలో చిక్కుకుని జీవితాలని నష్టపోతున్నారని, తమ కృష్ణసాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘జ్యువెల్ థీఫ్’
కృష్ణసాయి, మీనాక్షీ జైస్వాల్ జంటగా నటించిన చిత్రం ‘జ్యువెల్ థీఫ్’. పీఎస్ నారాయణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రేమ, అజయ్, శివారెడ్డి, శ్రావణి, శ్వేతారెడ్డి నటించారు. మల్లెల ప్రభాకర్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ఆడియో లాంచ్ వేడుకకి ముఖ్య అతిథులుగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డీఐజీ అనిల్ మింజ్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్ లవిదియ, అతిథిగా నటి ఎస్తేర్ హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కృష్ణ సాయి మాట్లాడుతూ– ‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘జ్యువెల్ థీఫ్’’ అన్నారు. ‘‘కృష్ణసాయికి తగ్గ కథను పది రోజుల్లోనే పూర్తి చేశాను. అందర్నీ ఆకట్టుకునే సినిమా ఇది’’ అన్నారు పీఎస్ నారాయణ. ‘‘ఈ మూవీలో మంచి పాత్ర చేశాను’’ అన్నారు నటి ప్రేమ. -
పేద మహిళలకు ‘సుందరాంగుడు’ఆర్థిక సాయం
వెండితెరపై నాలుగు పైట్లు, ఆరు పాటలు చేసి హీరో అనిపించుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ రియల్ లైఫ్‌లో నలుగురికి సాయం చేసి హీరో అనిపంచుకునే నటీనటులు చాలా తక్కువ. అలాంటి వారిలో నటుడు కృష్ణసాయి ఒకరు. ‘సుందరాంగుడు’సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. రియల్ లైఫ్‌లో నలుగురికి సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు. కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి కుల, మతాలకు అతీతంగా అభాగ్యులకు అండగా ఉంటున్నాడు. ఇప్పటికే పలు సేవకార్యక్రమాలతో పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్న హీరో కృష్ణ సాయి తాజాగా పల్నాడు జిల్లా కారెంపూడి మండలం పామిడిపాడు గ్రామంలో పేద మహిళలకు 50 వేల రూపాయల ఆర్ధిక సాయం చేశారు. అవసరమైతే భవిష్యత్తులో ఆ గ్రామ మహిళలకు తన ట్రస్ట్ ద్వారా సాయం చేస్తానని చెప్పారు. కృష్ణ సాయి తన ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.కృష్ణసాయి ప్రస్తుతం ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలింస్ పతాకంపై పీఎస్ నారాయణ దర్శకత్వంలో కొత్త చిత్రం 'జ్యువెల్ థీఫ్'(నగల దొంగ)లో నటిస్తున్నాడు. -
'సుందరాంగుడు' వచ్చేస్తున్నాడు
కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో చందర్ గౌడ్, యం.యస్.కె. రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17 న థియేటర్ లలో విడుదలవుతుంది. ఈ సందర్భంగా కృష్ణ సాయి మాట్లాడుతూ.. ‘నేను, చంద్ర గౌడ్‌గారు రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం. గోవాలోని అత్యద్భుత లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు, కామెడీ.. సుందరాంగుడు చిత్రానికి ప్రధానాకర్షణ. ఇటీవల సుందరాంగుడు ప్రివ్యూ చూసిన సినీపెద్దలు , సెన్సార్ అధికారులు చిత్రయూనిట్ ను ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం ద్వారా వచ్చే డబ్బుని ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్’ కోసం ఖర్చు చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు. -
రెండేళ్లు కష్టపడి ఈ సినిమా పూర్తి చేశాం
కృష్ణ సాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో చందర్ గౌడ్, యం.యస్.కె. రాజు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ‘సుందరాంగుడు’ ట్రైలర్‌ని విడుదల చేశారు. కృష్ణ సాయి మాట్లాడుతూ– ‘‘నేను, చంద్ర గౌడ్‌గారు రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మా ‘కృష్ణ సాయి చారిట బుల్ ట్రస్ట్’ తరఫున చాలామందికి సాయం చేస్తున్నాం. ఈ చిత్రం ద్వారా వచ్చే డబ్బుని ట్రస్ట్ కోసమే ఖర్చు చేయాలనుకుంటున్నాం. అయితే మా సినిమాకి థియేటర్స్ దొరికినా వాటి రెంట్, క్యూబ్స్‌కు డబ్బు కట్టడానికి ఇబ్బందిగా ఉంది. నాలాంటివాళ్లు చేసిన చిన్న సినిమాల విడుదలకు పరిశ్రమ పెద్దలు సపోర్ట్ చేయాలి’’ అన్నారు. -
‘సుందరాంగుడు’ వస్తున్నాడు!
కృష్ణసాయి టైటిల్ పాత్రలో చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్-ఎమ్.ఎస్.కె.ప్రమీదశ్రీ ఫిలిమ్స్ పతాకాలపై ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుందరాంగుడు’. వినయ్ బాబు దర్శకత్వం వహించిన ఈ వినూత్న ప్రేమకథాచిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి మూడోవారంలో విడుదలకు సిద్ధమవుతోంది. మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ ఈ చిత్రంలో హీరోయిన్లు. ఈ సందర్భంగా నిర్మాతలు ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్ మాట్లాడుతూ...‘మా హీరో కృష్ణ సాయి చాలా అద్భుతంగా నటించాడు. హీరోగా తనకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే చిత్రం ‘సుందరాంగుడు’. రామోజీ ఫిల్మ్ సిటీ, గోవాలోని అత్యద్భుత లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు ‘సుందరాంగుడు’ చిత్రానికి ప్రధానాకర్షణ’ అని అన్నారు. జీవా, భాషా, అమిత్ తివారి, జూనియర్ రేలంగి, మిర్చి మాధవి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సిద్ధబాబు సంగీతం అందిస్తున్నాడు. -
సస్పెన్స్.. థ్రిల్
కృష్ణసాయి, జహీదా శామ్ జంటగా పి.ఎస్. నారాయణ దర్శకత్వంలో ఎం.ఎస్.కె ప్రమిదశ్రీ ఫిలింస్ బ్యానర్‌పై ఎం.ఎస్.కె.రాజు నిర్మిస్తున్న ‘వీడు అసాధ్యుడు’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత సీతారామరాజు కెమెరా సిచ్చాన్ చేయగా, నటుడు శివాజీ రాజా క్లాప్ ఇచ్చారు. నటుడు శివకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. పి.ఎస్.నారాయణ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు హీరో, నిర్మాత ఎం.ఎస్.కె.రాజుగారే. హీరోగా కృష్ణసాయి అని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నారు. క్రిమినల్ లాయర్‌గా పనిచేసే ఆయన సినిమా నిర్మించాలనే ఆకాంక్షతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు’’ అన్నారు. ‘‘సినిమాపై ప్యాషన్‌తో ఈ రంగంలోకి వచ్చాను. సామాజిక స్పృహ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. మంచి కంటెంట్‌తో కమర్షియల్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు ఎం.ఎస్.కె.రాజు. ‘‘మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు జహీదా శామ్. ఈ చిత్రానికి çశంభుప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ∙కృష్ణ సాయి, జహీదా శామ్ -
నాకంటు ఒకరు మూవీ పోస్టర్స్
-
వినూత్నమైన సెర్చ్
కృష్ణసాయి ఫిలింస్ పతాకంపై టీవీఆర్‌కే బద్రినాధ్ సమర్పణలో ఒంగోలు సురేష్ నిర్మించిన చిత్రం ‘సెర్చ్’. మోజెస్ సాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జయసుందర్ పాటలు స్వరపరిచారు. ఈ సినిమా పాటల సీడీని బాబ్జీ ఆవిష్కరించి, సాయివెంకట్కి ఇచ్చారు. ఈ సందర్భంగా ఒంగోలు సురేష్ మాట్లాడుతూ -‘‘బాబ్జీగారు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసిన ‘భారత నారి’ చిత్రంలో బాలనటుడిగా చేశాను. ఇప్పుడు నేను నిర్మించిన చిత్రం ఆడియో వేడుకలో ఆయన పాల్గొనడం ఆనందంగా ఉంది. వినూత్న కథాంశంతో ఈ చిత్రం చేశాం. దర్శకుడికి ఇది తొలి సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించారు. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చిత్రవిజయంపై ఉన్న నమ్మకం రెట్టింపు అయ్యింది’’ అన్నారు. నన్ను, నా కథను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: శెట్టిపల్లి శ్రీమన్నారాయణ.