
వెండితెరపై నాలుగు పైట్లు, ఆరు పాటలు చేసి హీరో అనిపించుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ రియల్ లైఫ్‌లో నలుగురికి సాయం చేసి హీరో అనిపంచుకునే నటీనటులు చాలా తక్కువ. అలాంటి వారిలో నటుడు కృష్ణసాయి ఒకరు. ‘సుందరాంగుడు’సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. రియల్ లైఫ్‌లో నలుగురికి సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు.
కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి కుల, మతాలకు అతీతంగా అభాగ్యులకు అండగా ఉంటున్నాడు. ఇప్పటికే పలు సేవకార్యక్రమాలతో పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్న హీరో కృష్ణ సాయి తాజాగా పల్నాడు జిల్లా కారెంపూడి మండలం పామిడిపాడు గ్రామంలో పేద మహిళలకు 50 వేల రూపాయల ఆర్ధిక సాయం చేశారు.
అవసరమైతే భవిష్యత్తులో ఆ గ్రామ మహిళలకు తన ట్రస్ట్ ద్వారా సాయం చేస్తానని చెప్పారు. కృష్ణ సాయి తన ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.కృష్ణసాయి ప్రస్తుతం ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలింస్ పతాకంపై పీఎస్ నారాయణ దర్శకత్వంలో కొత్త చిత్రం 'జ్యువెల్ థీఫ్'(నగల దొంగ)లో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment