వినూత్నమైన సెర్చ్ | Innovative movie 'search' | Sakshi
Sakshi News home page

వినూత్నమైన సెర్చ్

Published Thu, Sep 26 2013 1:36 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

వినూత్నమైన సెర్చ్ - Sakshi

వినూత్నమైన సెర్చ్

కృష్ణసాయి ఫిలింస్ పతాకంపై టీవీఆర్‌కే బద్రినాధ్ సమర్పణలో ఒంగోలు సురేష్ నిర్మించిన చిత్రం ‘సెర్చ్’. మోజెస్ సాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జయసుందర్ పాటలు స్వరపరిచారు. ఈ సినిమా పాటల సీడీని బాబ్జీ ఆవిష్కరించి, సాయివెంకట్‌కి ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఒంగోలు సురేష్ మాట్లాడుతూ -‘‘బాబ్జీగారు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసిన ‘భారత నారి’ చిత్రంలో బాలనటుడిగా చేశాను. ఇప్పుడు నేను నిర్మించిన చిత్రం ఆడియో వేడుకలో ఆయన పాల్గొనడం ఆనందంగా ఉంది. వినూత్న కథాంశంతో ఈ చిత్రం చేశాం. 
 
దర్శకుడికి ఇది తొలి సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించారు. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చిత్రవిజయంపై ఉన్న నమ్మకం రెట్టింపు అయ్యింది’’ అన్నారు. నన్ను, నా కథను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు అని దర్శకుడు చెప్పారు. ఈ  చిత్రానికి సహనిర్మాత: శెట్టిపల్లి శ్రీమన్నారాయణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement