అనంతపురం మండలం కందుకూరులో శుక్రవారం ప్రత్యర్థుల చేతిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త శివారెడ్డి దారుణహత్యకు గురయ్యారు. సర్వజనాస్పత్రి మార్చురీలో శివారెడ్డి మృతదేహాన్ని శనివారం ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అనంతపురం, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, శంకరనారాయణ, రాప్తాడు, తాడిపత్రి, అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, నదీం అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రిష్టప్ప, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైటీ శివారెడ్డి సందర్శించారు.