మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి సోదరుడు శ్రీనాథరెడ్డి దంపతులు పార్టీలో చేరిక
పులివెందుల రూరల్/పుంగనూరు: వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో గురువారం కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. వీరశివారెడ్డితో పాటు ఆయన కుమారుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. కార్యాలయ ఆవరణలో వీరశివారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పారు.
చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో గుర్తింపులేనందువల్ల పార్టీ మారినట్లు చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగన్‌దేనన్నారు.
ప్రతినెల 1వ తేదీ తెల్లవారకముందే వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటివద్దకే పింఛన్లు అందిస్తూ వికలాంగులు, వితంతువులకు ఇంటి పెద్దకొడుకు అనిపించుకున్నారని చెప్పారు. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్‌ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. రాష్ట్ర ప్రజలందరు రెండోసారి కూడా జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నిపార్టీలు ఏకమైనా జగన్‌మోహన్‌రెడ్డి విజయాన్ని ఆపలేవన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరిన తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన చెప్పారు.
పార్టీలో చేరిన శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి దంపతులు
మాజీ మంత్రి అమరనాథరెడ్డి సోదరుడు శ్రీనాథరెడ్డి, ఆయన సతీమణి అనీషారెడ్డి గురువారం సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. మంత్రి పెద్ది రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు వారు చర్చలు జరిపారు. నామినేషన్ వేసేందుకు గురువారం పులివెందుల వచ్చిన సీఎంను శ్రీనాథరెడ్డి దంపతులు కలిసి పార్టీలో చేరారు. సీఎం వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీలో సీనియర్లుగా ఉన్న శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి వైఎస్సార్‌సీపీలోకి రావడంతో పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో టీడీపీకి ఊహించని దెబ్బ పడింది. శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఆశయాలు, సీఎం పనితీరు, అభివృద్ధి, సంక్షేమం చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment