Dil Se 2023 Movie Release Date Out - Sakshi
Sakshi News home page

ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా ‘దిల్‌సే’

Published Thu, Jul 27 2023 6:33 PM | Last Updated on Thu, Jul 27 2023 6:46 PM

Dil Se Movie Release Date Out - Sakshi

ప్రేమకథా చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంటుంది. అందుకే మన దర్శకనిర్మాతలు లవ్‌స్టోరీ చిత్రాలపై ప్రత్యేక దృష్టిపెడతారు. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ రాబోతుంది. అభినవ్ మదిశెట్టి , స్నేహ సింగ్ హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం ‘దిల్‌ సే’. శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్ పై రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ఆగస్ట్‌ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సాంగ్ ‘రెండు కన్నులతో’ కు మంచి స్పందన లభించింది. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట 2 మిలియన్ వ్యూస్ కు చేరుకుంది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు నూతన సంగీత దర్శకుడు శ్రీకర్ సంగీతం అందించాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా నచ్చే విధంగా ‘దిల్ సే’ ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఒన్ మీడియా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యబోతోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement