Dil se
-
బ్యూటిఫుల్ పిక్ స్టోరీ చెప్పిన సొట్టబుగ్గల సుందరి: ఫోటో వైరల్
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్‌ను ఏలిన అందాల తార ప్రీతి జింటా. యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్‌గా పాపులర్ అయిన ప్రీతి తాజాగా ఒక ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. హిమాచల్‌లోని సిమ్లాలో పుట్టిన ప్రీతి వెండి తెర మీద చెరగని సంతకం. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. 1998లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సందర్బంగా తీసిన ఒక ఫోటోను, దానికి సంబంధించిన జ్ఞాపకాలను ట్వీట్ చేసింది.( మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!) ‘‘దిల్ సే సెట్లో తొలి రోజు ఈ ఫోటో తీశారు. మణిరత్నం, షారూఖ్ ఖాన్‌తో కలిసి వర్క్ చేస్తుందకు చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఇంతలో మణిసార్ నన్ను చూడగానే మొహం కడుక్కుని రమ్మని, నవ్వుతూ మర్యాదగా అడిగారు. అయితే సార్... నా మేకప్ పోతుంది సార్ అని చెప్పా. నాకు కావలసింది అదే.. వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రా అని చెప్పారు అంతే మర్యాదగా. తమాషా చేస్తున్నారా అనుకున్నా మొదట. కానీ కాదని ఈ ఫోటో చూసిన తర్వాత అర్థం అయింది. ఫోటోగ్రఫీ డైరెక్టర్ సంతోష్ శివన్ గారు నిజంగా మనసు పెట్టి (దిల్సే) తీసిన ఫోటో. ప్రెష్‌గా, ప్రశాంత ముఖంతో అద్భుతమైన ఫోటో ఇది. ఆయనకు ధన్యవాదాలు’’ అంటూ తన మొమోరీస్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ ట్వీట్ 10లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. (ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్‌బర్డ్స్) This picture was taken on the first day on the set of Dil Se. I was so excited to be working with Mani Ratnam sir & Shah Rukh Khan. When Mani sir saw me he smiled and politely asked me to wash my face…. But sir… my make up will come off, I said smiling …. That’s exactly what I… pic.twitter.com/Lrr6CpSMFA — Preity G Zinta (@realpreityzinta) February 8, 2024 కాగా 1975 జనవరి 31న పుట్టిన ప్రీతి జింటా హిందీతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో అనేక సూపర్‌హిట్ మూవీలతోపాటు టాలీవుడ్లో కూడా తనదైన ముద్రను వేసుకుంది. ప్రేమంటే ఇదేరాతో టాలీవుడ్లోకి ప్రవేశించి, ప్రిన్స్ మహేష్‌బాబు సరసన 1999లో రొమాంటిక్ కామెడీ రాజ కుమారుడులో నటించి టాలీవుడ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. 2016 ఫిబ్రవరి 29న వ్యాపారవేత్త జీన్ గూడెనఫ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనా నటిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. ఈ జంటకు ఇద్దరు(ట్విన్స్) పిల్లలు ఉన్నారు. -
గ్రాండ్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సే తమ్ముడి రిసెప్షన్ (ఫోటోలు)
-
ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ‘దిల్సే’
ప్రేమకథా చిత్రాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంటుంది. అందుకే మన దర్శకనిర్మాతలు లవ్‌స్టోరీ చిత్రాలపై ప్రత్యేక దృష్టిపెడతారు. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ రాబోతుంది. అభినవ్ మదిశెట్టి , స్నేహ సింగ్ హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం ‘దిల్ సే’. శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్ పై రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సాంగ్ ‘రెండు కన్నులతో’ కు మంచి స్పందన లభించింది. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట 2 మిలియన్ వ్యూస్ కు చేరుకుంది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు నూతన సంగీత దర్శకుడు శ్రీకర్ సంగీతం అందించాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా నచ్చే విధంగా ‘దిల్ సే’ ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఒన్ మీడియా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యబోతోంది. -
చయ్య.. చయ్య.. రీమిక్స్ చేయొద్దయ్యా
ప్రస్తుతం బాలీవుడ్లో రీమిక్స్ పాటల హవా నడుస్తోంది. అయితే ఈ విధానం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘క్లాసిక్ పాటల్ని రీమిక్స్ చేయడం అంటే పాడు చేయడమే. కొన్ని కొన్ని రీమిక్స్ పాటలు మినహా మిగతా పాటలేవీ ఆకట్టుకునేలా లేవు. ఆ క్లాసిక్ పాటల్ని అలానే ఉంచితే బెస్ట్ ఏమో. అలాంటి పాటల్లో మా ‘చయ్య చయ్య చయ్యా చయ్యా ఛల్ చయ్య....’ (మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘దిల్ సే’ సినిమాలో పాట) కూడా ఒకటి. ఆ పాటకు మలైకా వేసిన స్టెప్పులను అంత సులువుగా మరచిపోలేం. ‘‘దయచేసి ఎవ్వరూ ఆ పాటను రీమిక్స్ చేయొద్దు’’ అన్నారు మలైకా. -
చయ్య చయ్య.. చిత్రీకరణలో కష్టాలయ్యా
షారుక్ ఖాన్ ‘దిల్ సే’లో ‘చయ్య చయ్య చయ్య చల్ చయ్య చయ్య..’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ట్రైన్ సాంగ్స్‌లో ఓ బెస్ట్ సాంగ్‌గా ఆ పాట ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో పరిగెడుతూనే ఉంది. ఈ పాటకు షారుక్‌తో కలసి బాలీవుడ్ భామ మలైకా అరోరా స్టెప్పులేశారు. ఇటీవలే ఈ సూపర్‌హిట్ సాంగ్ మేకింగ్ వెనక జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను షేర్ చేసుకున్నారు. ‘‘కదిలే ట్రైన్ మీద నిలబడి ఈ పాటకు డ్యాన్స్ చేస్తుంటాను. అది అందరికీ తెలిసిందే. ట్రైన్ కదలికలకు ఒక్కోసారి కిందపడిపోయేదాన్ని. దాంతో మా టీమ్ నేను వేసుకున్న గాగ్రా మీదగా నా నడుము చుట్టూ ఓ తాడుతో నన్ను ట్రైన్‌కి కట్టేశారు. అలా అయితే నేను కిందపడను కదా. తాడు కట్టాక చిత్రీకరణ సవ్యంగా జరిగింది. కానీ పాట పూర్తయ్యాక ఆ తాడు తీసేసినప్పుడు నా నడుము మొత్తం గీసుకుపోయి రక్తంతో నిండిపోయింది. దాంతో సెట్లో అందరూ కంగారుపడిపోయారు’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు మలైకా అరోరా. స్క్రీన్ మీద కనువిందు చేయడానికి స్క్రీన్ వెనక స్టార్స్ ఇలాంటి కష్టాలు పడుతుంటారు. -
దిల్ సే... ఓ మాట!
‘దిల్ సే’ అంటే... ఫ్రమ్ ద హార్ట్ (‘గుండె లోతుల్లోంచి’ అనొచ్చు) అని మీనింగ్! షారూఖ్ ఖాన్, మనీషా కోయిరాల జంటగా దర్శకుడు మణిరత్నం తీసిన ‘దిల్ సే’ కూడా ప్రేక్షకుల గుండె లోతుల్లోని తడిని తట్టి లేపింది. ఎందరో ఆ సినిమాకు తమ హృదయంలో గుడి కట్టేశారు. అటువంటి ప్రేక్షకుల్లో అనుష్కా శర్మ కూడా ఒకరు. షారూఖ్ సరసన ‘రబ్ నే బనాదీ జోడీ’, ‘జబ్ తక్ హై జాన్’, ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ సినిమాల్లో నటించిన అనుష్కకు అతని ‘దిల్ సే’ అంటే చచ్చేంత ప్రేమ అట! అంతే కాదు... ఆ సినిమాను ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మళ్లీ తీయాలని కోరుకుంటున్నారు. ఇంకా అనుష్కా శర్మ మాట్లాడుతూ– ‘‘ఐ లవ్ ద మూవీ ‘దిల్ సే’. దాన్ని రీమేక్ చేస్తే... నేను మనీషా కోయిరాల పాత్రలో నటిస్తా. అందులో ఆమె పాత్ర, ఆమె నటించిన విధానం నాకెంతో నచ్చాయి’’ అని పేర్కొన్నారు. మనీషా కోయిరాల పాత్రలో నటించాలనుందని అనుష్కా శర్మ మనసులో మాటను బయట పెట్టేశారు. మరి, షారూఖ్ ఖాన్ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుంది? ఆలోచించండి! ఇంతకీ, దర్శకుడు మణిరత్నం అనుష్కా శర్మ మాటలను విన్నారో? లేదో? ‘దిల్ సే’ను రీమేక్ చేసే ఆలోచన ఆయనకు ఉందంటారా? లేదంటారా? వెయిట్ అండ్ సీ!! -
'దిల్ సే' విత్ భూమిక
కమర్షియల్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకున్న భామ భూమిక చావ్లా. తెలుగులో దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించిన ఈ ఢిల్లీ బ్యూటీ, ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. దక్షిణాది భాషలన్నింటితో పాటు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భూమిక, చాలా కాలం తరువాత ఓ తెలుగు సినిమాలో నటించేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన కెరీర్ లోని ఎత్తుపల్లాలతో పాటు తన అభిరుచులు, ఆశలు, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. 2000 సంవత్సరంలో సుమంత్ హీరోగా తెరకెక్కిన యువకుడు సినిమాతో భూమిక సినీ ప్రయాణం మొదలైంది. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా తెరకెక్కిన ఖుషీ సినిమా ఆమెను స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. తరువాత ఒక్కడులో మహేష్ బాబుతో, సింహాద్రి, సాంబ సినిమాల్లో ఎన్టీఆర్ తో జోడి కట్టిన భూమిక, తేరే నామ్ సినిమాతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సరసన నటించి మెప్పించారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న భూమిక, పెళ్లి తరువాత కూడా నటనను కొనసాగిస్తునే ఉన్నారు. అయితే గ్లామర్ క్యారెక్టర్స్ ను పక్కన పెట్టి ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. చివరగా క్రికెటర్ ఎమ్ ఎస్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎమ్ ఎస్ ధోని : ద అన్ టోల్డ్ స్టోరి సినిమాలో కనిపించిన భూమిక, ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. -
దిల్ సే-గొల్లపూడి మారుతిరావు