చయ్య.. చయ్య.. రీమిక్స్‌ చేయొద్దయ్యా | Malaika Arora says Chaiyya Chaiyya should not be recreated | Sakshi
Sakshi News home page

చయ్య.. చయ్య.. రీమిక్స్‌ చేయొద్దయ్యా

Published Fri, Feb 28 2020 12:24 AM | Last Updated on Fri, Feb 28 2020 12:24 AM

Malaika Arora says Chaiyya Chaiyya should not be recreated - Sakshi

మలైకా అరోరా

ప్రస్తుతం బాలీవుడ్‌లో రీమిక్స్‌ పాటల హవా నడుస్తోంది. అయితే ఈ విధానం కరెక్ట్‌ కాదని అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్‌ నటి మలైకా అరోరా. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘క్లాసిక్‌ పాటల్ని రీమిక్స్‌ చేయడం అంటే పాడు చేయడమే. కొన్ని కొన్ని రీమిక్స్‌ పాటలు మినహా మిగతా పాటలేవీ ఆకట్టుకునేలా లేవు. ఆ క్లాసిక్‌ పాటల్ని అలానే ఉంచితే బెస్ట్‌ ఏమో. అలాంటి పాటల్లో మా ‘చయ్య చయ్య చయ్యా చయ్యా ఛల్‌ చయ్య....’ (మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘దిల్‌ సే’ సినిమాలో పాట) కూడా ఒకటి. ఆ పాటకు మలైకా వేసిన స్టెప్పులను అంత సులువుగా మరచిపోలేం. ‘‘దయచేసి ఎవ్వరూ ఆ పాటను రీమిక్స్‌ చేయొద్దు’’ అన్నారు మలైకా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement