చయ్య చయ్య.. చిత్రీకరణలో కష్టాలయ్యా | Malaika Arora Reveals How Chaiyya Chaiyya Shoot Left Her Bruised And Bleeding | Sakshi
Sakshi News home page

చయ్య చయ్య.. చిత్రీకరణలో కష్టాలయ్యా

Published Sun, Jul 28 2019 5:47 AM | Last Updated on Sun, Jul 28 2019 5:47 AM

Malaika Arora Reveals How Chaiyya Chaiyya Shoot Left Her Bruised And Bleeding - Sakshi

మలైకా అరోరా

షారుక్‌ ఖాన్‌ ‘దిల్‌ సే’లో ‘చయ్య చయ్య చయ్య చల్‌ చయ్య చయ్య..’ సాంగ్‌ ఎంత పాపులర్‌ అయిందో తెలిసిందే. ట్రైన్‌ సాంగ్స్‌లో ఓ బెస్ట్‌ సాంగ్‌గా ఆ పాట ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో పరిగెడుతూనే ఉంది. ఈ పాటకు షారుక్‌తో కలసి బాలీవుడ్‌ భామ మలైకా అరోరా స్టెప్పులేశారు. ఇటీవలే ఈ సూపర్‌హిట్‌ సాంగ్‌ మేకింగ్‌ వెనక జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను షేర్‌ చేసుకున్నారు. ‘‘కదిలే ట్రైన్‌ మీద నిలబడి ఈ పాటకు డ్యాన్స్‌ చేస్తుంటాను. అది అందరికీ తెలిసిందే. ట్రైన్‌ కదలికలకు ఒక్కోసారి కిందపడిపోయేదాన్ని.

దాంతో మా టీమ్‌ నేను వేసుకున్న గాగ్రా మీదగా నా నడుము చుట్టూ ఓ తాడుతో నన్ను ట్రైన్‌కి కట్టేశారు. అలా అయితే నేను కిందపడను కదా. తాడు కట్టాక చిత్రీకరణ సవ్యంగా జరిగింది. కానీ పాట పూర్తయ్యాక ఆ తాడు తీసేసినప్పుడు నా నడుము మొత్తం గీసుకుపోయి రక్తంతో నిండిపోయింది. దాంతో సెట్లో అందరూ కంగారుపడిపోయారు’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు మలైకా అరోరా. స్క్రీన్‌ మీద కనువిందు చేయడానికి స్క్రీన్‌ వెనక స్టార్స్‌ ఇలాంటి కష్టాలు పడుతుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement