స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను ఏలిన అందాల తార ప్రీతి జింటా. యాపిల్‌బ్యూటీగా, డింపుల్ గర్ల్‌గా పాపులర్ అయిన ప్రీతి తాజాగా ఒక ఫోటోను ట్విటర్‌లో షేర్ చేసింది.
హిమాచల్‌లోని సిమ్లాలో పుట్టిన ప్రీతి వెండి తెర మీద చెరగని సంతకం. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. 1998లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సందర్బంగా తీసిన ఒక ఫోటోను, దానికి సంబంధించిన జ్ఞాపకాలను ట్వీట్ చేసింది.( మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!)
‘‘దిల్ సే సెట్‌లో తొలి రోజు ఈ ఫోటో తీశారు. మణిరత్నం, షారూఖ్ ఖాన్‌తో కలిసి వర్క్ చేస్తుందకు చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఇంతలో మణిసార్ నన్ను చూడగానే మొహం కడుక్కుని రమ్మని, నవ్వుతూ మర్యాదగా అడిగారు. అయితే సార్... నా మేకప్ పోతుంది సార్ అని చెప్పా. నాకు కావలసింది అదే.. వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రా అని చెప్పారు అంతే మర్యాదగా. తమాషా చేస్తున్నారా అనుకున్నా మొదట. కానీ కాదని ఈ ఫోటో చూసిన తర్వాత అర్థం అయింది. ఫోటోగ్రఫీ డైరెక్టర్ సంతోష్ శివన్ గారు నిజంగా మనసు పెట్టి (దిల్‌సే) తీసిన ఫోటో. ప్రెష్‌గా, ప్రశాంత ముఖంతో అద్భుతమైన ఫోటో ఇది. ఆయనకు ధన్యవాదాలు’’ అంటూ తన మొమోరీస్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ ట్వీట్ 10లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. (ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్‌బర్డ్స్)
This picture was taken on the first day on the set of Dil Se. I was so excited to be working with Mani Ratnam sir & Shah Rukh Khan. When Mani sir saw me he smiled and politely asked me to wash my face…. But sir… my make up will come off, I said smiling …. That’s exactly what I… pic.twitter.com/Lrr6CpSMFA
— Preity G Zinta (@realpreityzinta) February 8, 2024
కాగా 1975 జనవరి 31న పుట్టిన ప్రీతి జింటా హిందీతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్‌లో అనేక సూపర్‌హిట్ మూవీలతోపాటు టాలీవుడ్‌లో కూడా తనదైన ముద్రను వేసుకుంది. ప్రేమంటే ఇదేరాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించి, ప్రిన్స్ మహేష్‌బాబు సరసన 1999లో రొమాంటిక్ కామెడీ రాజ కుమారుడులో నటించి టాలీవుడ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. 2016 ఫిబ్రవరి 29న వ్యాపారవేత్త జీన్ గూడెనఫ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనా నటిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. ఈ జంటకు ఇద్దరు(ట్విన్స్) పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment