Koteswara Rao Gari Kodukulu Movie Teaser: అభినవ్, సత్యమణి హీరోలుగా ప్రియాంక డి, చందన హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం " కోటేశ్వరరావు గారి కొడుకులు". మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మనీ అనేది క్యాప్షన్. నవీన్ ఇరగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మై గోల్ సినిమా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన్వీర్ యం.డి. నిర్మిస్తున్న ఈ సినిమాలో వశిష్ట్ నారాయణ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని మ్యాచో స్టార్ గోపీచంద్ రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ టీజర్ చాలా బాగా వచ్చిందని అభినందించారు.
టీజర్ విషయానికొస్తే.. 'మనకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా దానికి కారణం ఖచ్చితంగా మనీ అయి ఉంటది' అనే రియలిస్టిక్ డైలాగ్‌తో ప్రారంభమై ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. మనీ కెన్ డు ఎనీథింగ్.. ఈ ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన ఆయుధం డబ్బు అంటూ మోడ్రన్ ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్లు చూపే ప్రయత్నం చేశారు మేకర్స్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అబ్బురపరుస్తున్నాయి.
మిడిల్ క్లాస్ తండ్రి కొడుకుల మధ్య జరిగే స్టోరీ ఇదని, తండ్రీ కొడుకుల మధ్య మనీ మ్యాటర్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందించారని తెలుస్తోంది. కొడుకులను కోటీశ్వరులను చేయాలనుకునే తండ్రి కల నెరవేరిందా? అదేవిధంగా తండ్రిని కోటీశ్వరుడు చేయాలనుకునే ఆ కొడుకుల ప్రయత్నం ఫలించిందా? అనే డిఫరెంట్ స్టోరీని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment