
Ram Asur Movie Unit Success Meet In Hyderabad: టాలీవుడ్‌లో చిన్న సినిమాలుగా వచ్చి హిట్ కొట్టిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో మెప్పించిన చిత్రం రామ్ అసుర్. అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్ కథానాయకులుగా నటించారు. ఈ చిత్రానికి వెంకటేష్ త్రిపర్ణ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. విడుదలైన తొలి రోజు నుంచి ప్రేక్షకుల ఆదరణ పొందడమే గాక విమర్శకుల ప్రశంసలు పొందుతుంది. అయితే ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కరోనా సమయంలో ధైర్యంగా షూటింగ్ చేసి విజయం సాధించామని సహ నిర్మాత ఆర్కే తెలిపారు. దీంతో ఫుల్‌జోష్‌లో ఉన్నామన్నారు.
దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ మాట్లాడుతూ, 'ఈ సినిమా విజయం చూసిన తర్వాత మేము ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా మర్చిపోయాం. క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గానీ, కలెక్షన్స్ పాయింట్ అఫ్ వ్యూ లో గానీ మా సినిమా కి మంచి ఆదరణ లభిస్తుంది. భారీ వర్షాల్లో కూడా ప్రేక్షకులు మా సినిమా ను వీక్షిస్తున్నారు అంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా సక్సెస్ కు కారణమైన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.' అన్నారు. హీరో అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. సక్సెస్ టూర్‌లో భాగంగా కొన్ని నగరాలకు వెళ్లి ఆడియన్స్‌తో సినిమా చూసి ఎంతో ఎంజాయ్ చేశామని హీరో అభినవ్ తెలిపారు. ప్రేక్షకుల రెస్పాన్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. తన పాత్రకు మంచి గుర్తింపు వస్తోందని నటుడు షానీ తెలిపారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ వెంకటేష్ అని హీరోయిన్ శెర్రి అగర్వాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment