ట్రెండీగా నిలుస్తున్న నటీనటుల వెడ్డింగ్‌ కార్డు | Rubina Dilaik And Abhinav Shukla Wedding Card Is Stunning | Sakshi
Sakshi News home page

ట్రెండీగా నిలుస్తున్న నటీనటుల వెడ్డింగ్‌ కార్డు

Published Sat, Jun 9 2018 9:32 AM | Last Updated on Mon, Jun 11 2018 1:12 PM

Rubina Dilaik And Abhinav Shukla Wedding Card Is Stunning - Sakshi

బుల్లితెర నటీనటులు రుబినా దిలాయక్‌, అభినవ్‌ శుక్లా

న్యూఢిల్లీ : ఎంతో కాలంగా రిలేషన్‌లో ఉన్న బుల్లితెర నటీనటులు రుబినా దిలాయక్‌, అభినవ్‌ శుక్లాలు ఈ నెల 21న ఒకటవ్వబోతున్నారు. వీరిద్దరూ తమ వివాహ ఆహ్వాన పత్రికను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ కార్డులో ప్రతి ఒక్కటీ చూడముచ్చటగా నిలుస్తోందని సోషల్‌ మీడియా యూజర్లంటున్నారు. వెడ్డింగ్‌ కార్డు చాలా ట్రెండీగా, అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ కార్డు ఎలా డిజైన్‌ చేయించారో తెలుసా..? పర్యావరణ పరిరక్షణగా రీసైకిల్‌ పేపర్‌తో ఈ కార్డును డిజైన్‌ చేయించారట. ఆ కార్డుపై రుబినా, అభినవ్‌ పేర్లలోని తొలి పదాలతో పాటు వివాహ తేదీ కూడా ఉంది. కార్డు పక్కనే ఒక చిన్న గాజు పాత్ర, దానిలో ఉంచిన ప్రకృతితో మమేకమైన పూలు, మొక్కలు ఇవన్నీ కార్డుకు ట్రెండీగా నిలుస్తున్నాయి.

‘ నిజమైన ప్రేమ మన ఆత్మను పెంపొందిస్తోంది. ఈ కార్డుతో మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తూ.. మా స్నేహితులకు ‘జీవితం’గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాం. మాతో కలిసి ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు’ అని రుబియా పోస్టు చేశారు. తమ ఆహ్వానం పూర్తిగా ఆర్గానిక్‌, బయోడిగ్రేడబుల్‌ లాగా ఉందని, ఈ కార్డును ఎండీఎఫ్‌ చెక్క, రీసైకిల్‌ పేపర్‌తో తయారు చేయించామని చెప్పారు. పెళ్లిళ్లు ఎంతో సంతోషభరితంగా, ప్రకృతికి అనుకూలంగా ఉండాలనే భావనను తాము ప్రోత్సహిస్తామని అన్నారు. 

తమ అద్భుతమైన ఈ వెడ్డింగ్‌ కార్డు డిజైన్‌ క్రెడిట్‌ అంతా రుబినాదే అంటూ అభినవ్‌, కాబోయే భార్యను పొగడ్తలతో ముంచెత్తారు. ‘ఇప్పటి వరకు చూసిన వాటిలో ఇదే ఉన్నతమైన ఆలోచన. మొక్కలే పెళ్లికి ఆహ్వానం! సేంద్రియ, ప్రకృతికి అనుకూలమైన విధంగా, ఓ ప్రత్యేకమైన ఆలోచనతో రావడం నీకు మాత్రమే సొంతం’ అని అభినవ్‌ అభినందించారు. తన ఆలోచనకు తగ్గట్టు కార్డును డిజైన్‌ చేసిన వారికి రుబియా కృతజ్ఞతలు చెప్పారు. థ్యాంక్యూ మై లవ్‌ అంటూ అభినవ్‌ శుక్లాపై కూడా ప్రేమ వర్షం కురిపించారు. రుబియా, అభివన్‌ ఎన్నో ఏళ్లుగా పరిచయస్తులు. మార్చిలో వీరిద్దరూ తమ వివాహాన్ని ప్రకటించారు. సిమ్లాలో వీరి వివాహం జరగనుంది. అయితే అభినవ్‌, రుబియాలు తమ వివాహ ఆహ్వాన పత్రిక విషయంలో కోహ్లి, అనుష్క శర్మలను కాపీ కొట్టారని తెలుస్తోంది. కోహ్లి, అనుష్కల వివాహ పత్రిక కూడా ఈ విధంగానే ఉండటం గమనార్హం.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement