
హుషారు ఫేమ్ అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్‌లుగా నటించిన తాజా చిత్రం ‘మైల్స్ ఆఫ్ లవ్’. ఫ్యాక్టరీ బ్యానర్ పై రాజిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాలుగు పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని యంగ్ మరో శ్రీవిష్ణు విడుదల చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మైల్స్ అఫ్ లవ్ టీజర్ చూశాను. చాలా ఫ్రెష్ గా ఉంది. హీరో అభినవ్ చాలా అందంగా కనిపించాడు.ఈ సినిమా కి అందరు కొత్తవాళ్లే పని చేశారు. ఈ సినిమా కి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
ఇక టీజర్ విషయానికి వస్తే.. మెలోడీ మ్యూజిక్ తో ఈ టీజర్ మొదలవుతుంది. ఇది ప్యూర్ అండ్ హానెస్ట్ లవ్ స్టోరీ అని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఎంతో ఫీల్ తో హీరో హీరోయిన్ ల మధ్య లవ్ స్టోరీ ఉండబోతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తాయని టీజర్ చివర్లో వచ్చే ఓ షాట్ ద్వారా చూపించారు. 'ప్రాబ్లమ్ ని ప్రాబ్లమ్ లా కాకుండా సొల్యూషన్ లా చూస్తే సొల్యూషన్ ప్రాబ్లమ్ అవుతుంది.. ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుంది..' అనే డైలాగ్ చాలా బాగుంది.
Comments
Please login to add a commentAdd a comment