‘‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా ట్రైలర్ విడుదల చేసినప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మేం ఊహించలేదు. ఈ రోజుల్లో ఓ సినిమా 25 రోజులు సక్సెస్‌ఫుల్‌గా రన్ కావడం అంటే 250 రోజులతో సమానం. 25–30 కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ సినిమా మా జీవితాన్ని మార్చేసింది. పేరు, డబ్బులకంటే గొప్ప స్నేహితులను ఇచ్చిన సినిమా ఇది’’ అని నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ అన్నారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా రావు రమేశ్, రామ్‌కీ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’.
అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 25 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి. నటుడు రావు రమేశ్ మాట్లాడుతూ– ‘‘అమితాబ్‌గారు, చిరంజీవిగారు గ్యాప్ తీసుకుని సినిమా చేసినప్పుడు ఓ ఉప్పెనలా ఉంటుంది. అది కొందరికే చెల్లుబాటు అవుతుంది. ‘ఆర్‌ఎక్స్ 100’ ఓ రకంగా ఇండస్ట్రీకి అసూయను క్రియేట్ చేసింది’’ అన్నారు. ‘‘సక్సెస్ స్వీట్ అంటుంటారు. కానీ, మా సక్సెస్ మాత్రం హాట్’’ అన్నారు అజయ్ భూపతి. ‘‘కొత్తవాళ్లు ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు బయటివాళ్లు చెప్పే మాటలు వినొద్దు. మూవీలో కంటెంట్ ఉంటే అందరూ సపోర్ట్ చేస్తారు’’ అన్నారు కార్తికేయ. ‘‘ఇది డైరెక్టర్ ఫిలిం. ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లో విడుదల చేయడం హ్యాపీ’’ అని నిర్మాత ‘దిల్’రాజు అన్నారు.
25 రోజులంటే 250 రోజులతో సమానం– అశోక్‌రెడ్డి గుమ్మకొండ
Published Wed, Aug 8 2018 1:02 AM | Last Updated on Wed, Aug 8 2018 1:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment