అభిమానులతో సెల్ఫీ దిగుతున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్
అందాల తార పాయల్ రాజ్‌పుత్ ఆదివారం కడపలోతళుక్కుమన్నారు.ఒక బ్యూటీ సెలూన్‌ప్రారంభించేందుకు వచ్చినరాజ్‌పుత్ అభిమానులతో సందడి చేశారు.ఆమె అభివాదం చేయగానే యువకులు కేరింతలు కొట్టారు.
కడప కార్పొరేషన్ : ఆర్‌ఎక్స్100 సినిమా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కడపలో సందడి చేసింది. అందం, గ్రూమింగ్ విభాగాల్లో అత్యత్తమ సేవలందించే లాక్మే సెలూన్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు. పాయల్ రాజ్‌పుత్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున యువత కోటిరెడ్డి సర్కిల్‌కు చేరుకున్నారు. ఆమె అభివాదం చేయగానే పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా అభిమానులతో ఆమె సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్మే సెలూన్ తన ఫేవరెట్ అని, ఇక్కడ గ్లామరస్ హైలెట్స్ మొదలు పునరుత్తేజం కలిగించే ఫేసియల్స్, మెడిక్యూర్, పెడిక్యూర్ వంటి సేవలు అందించడంలో లాక్మే సెలూన్ అగ్రగామిగా ఉందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన షోరూం ప్రారంభం కావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లాక్మే సీఈఓ పుష్ఫరాజ్ షెనాయ్, టీడీపీ జిల్లా అ«ధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి, ఫ్రాంఛైజీ భాగస్వామి శ్రీ హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment