Bigg Boss Telugu 7: Bangkok Pilla Sravani Gives Clarity On Her Entry - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 : ‘బిగ్‌బాస్‌ 7’లోకి బ్యాంకాక్‌ పిల్ల.. వీడియోతో క్లారిటీ

Published Sat, Jul 15 2023 11:29 AM | Last Updated on Sat, Sep 2 2023 2:30 PM

Bigg Boss 7 Telugu: Bangkok Pilla Sravani Gives Clarity On Bigg Boss 7 Entry - Sakshi

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆరు సీజన్స్‌ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్‌ రియాల్టీ షో.. త్వరలోనే ఏడో సీజన్‌ని ప్రారంభించబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రోమోని కూడా వదిలారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. ఈ సారి గత సీజన్స్‌ కంటే భిన్నంగా బిగ్‌బాస్‌ ఆట ఉండబోతుందట.

గత సీజన్‌ మాదిరి చిన్న చిన్న నటీనటులను కాకుండా..ఈ సారి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులను బిగ్‌బాస్‌లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ ఎంపిక పూర్తయిందట. ఇక ఆ లిస్ట్‌ ఎలాగో షో ప్రారంభం వరకు బయటకు రాదు. కానీ ఎప్పటి మాదిరే ఈ సారి కూడా బిగ్‌బాస్‌-7 కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి.

(చదవండి: అక్కడికెళ్లిన అమ్మాయిల వీడియో షేర్‌ చేసిన నటి.. నెటిజన్ల ఫైర్‌)

ఆ లిస్ట్‌లో ముఖ్యంగా ఒకరి పేరు బలంగా వినిపించింది. ఆమే బ్యాంకాక్‌ పిల్ల. యూట్యూబ్‌ వీక్షకులకు ఈ పేరు బాగా తెలుసు. బ్యాంకాక్‌లో ఉండే ఈ తెలుగుమ్మాయి.. అక్కడి ప్రదేశాలను, వింతలను తెలియజేస్తూ యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ ఫేమస్‌ అయింది. అలాంటి వీడియోలు ఎవరైనా పెడతారు కానీ.. విదేశాల్లో ఉండి కూడా తెలుగులో భాషలో.. తన ప్రాంతం యాస(విజయనగరం)లో మాట్లాడుతూ వీడియోలు చేయడం ఈ పిల్ల స్పెషల్‌. ఈమె అసలు పేరు శ్రావణి సమంతపూడి. యూట్యూబ్‌ చానెల్‌ పేరు బ్యాకాంక్‌.

బిగ్‌బాస్‌ కోసమే ఇండియాకి
ఇటీవల శ్రావణి ఇండియాకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోని తన యూట్యూబ్‌ చానెల్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఆమె బిగ్‌బాస్‌ -7 కోసమే ఇండియాకు వస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అంతేకాదు చాలా మంది ఆమెకు ఆల్ ద బెస్ట్‌ చెబుతూ వీడియోలు కూడా చేస్తున్నారు. పలు వెబ్‌సైట్లలో కూడా ఆమె బిగ్‌బాస్‌-7లో పాల్గొంటున్నారంటూ కథనాలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలను బ్యాకాంక్‌ పిల్ల స్పందించింది. తన బిస్‌బాస్‌ ఎంట్రీ గురించి స్వయంగా ఓ వీడియోని కూడా చేసింది. 

పిలవని పేరంటానికి వెళ్తే బాగోదు
బిగ్‌బాస్‌-7లోకి తాను వెళ్తున్నట్లు వస్తున్న పుకార్లపై ఆమె ఫన్నిగా స్పందించారు. అసలు తకు బిగ్‌బాస్‌ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని, పిలవని పేరెంటానికి వెళ్తే బాగోదని చెప్పింది. ‘నేను బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాననే వార్తలు ఎవరు పుట్టించారో తెలియదు కానీ.. నాకే ఆశ్చర్యం కలిగింది. ఆ వార్తలు బాగా వైరల్‌ కావడంతో నిజంగానే నేను సెలెక్ట్‌ అయ్యానా అని మెయిల్స్‌ చెక్‌ చేసుకున్నాను. నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదు. ఒకవేళ వస్తే తప్పకుండా అందరికి చెబుతాను. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ని నమ్మకండి’ అని శ్రావణి చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement