వరుస హత్యలు.. హాజీపూర్‌లో టెన్షన్‌ | High Tension At Hazipur In Bommalaramaram | Sakshi
Sakshi News home page

వరుస హత్యలు.. హాజీపూర్‌లో టెన్షన్‌

Published Tue, Apr 30 2019 10:10 AM | Last Updated on Tue, Apr 30 2019 10:34 AM

High Tension At Hazipur In Bommalaramaram - Sakshi

సాక్షి, బొమ్మలరామారం: వరుస హత్యలు వెలుగు చూసిన యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు అమ్మాయిలను అత్యాచారం చేసి చంపిన కేసులో అరెస్టైన సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై గ్రామస్తులు మంగళవారం ఉదయం దాడి చేశారు. శ్రీనివాస్‌రెడ్డి దారుణాల గురించి తెలుసుకున్న హాజీపూర్‌ వాసులు తీవ్ర ఆగ్రహావేశంతో అతడి ఇంటిని ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. అడ్డుకున్న పోలీసులపైనా దాడికి యత్నించారు.. శ్రీనివాస్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

హాజీపూర్‌ వరుస హత్యలకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఆరో తరగతి విద్యార్థిని కల్పన కూడా హత్యకు గురయివుంటుదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ తెలిపారు. గతంలోనూ పలుమార్లు మహిళలతో శ్రీనివాస్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడని గ్రామస్తులు వెల్లడించారని, ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండేలా కౌన్సెలింగ్‌ ఇస్తామని చెప్పారు. హాజీపూర్‌లో శ్రావణి, మనీషా మృతదేహాలు వెలుగు చూసిన సంఘటనా స్థలాన్ని ఆమె పరిశీలించారు. (శ్రావణి, మనీషాల హత్య కేసు.. ఎవరీ శ్రీనివాసరెడ్డి?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement