
శ్రావణి(ఫైల్)
బంజారాహిల్స్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. యూసుఫ్‌గూడ, శ్రీకృష్ణానగర్‌కు చెందిన మల్లె రాజ్యలక్ష్మి, రమణయ్య దంపతుల కుమార్తె శ్రావణి(21) ఈ నెల 1న రాత్రి తన గదిలో నిద్రకు ఉపక్రమించింది. ఉదయం ఆమె గదిలో కనిపించకపోయేసరికి కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలియకపోవడంతో శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment