
కోర్టు పత్రాలను చూపిస్తున్న ప్రవీణ్‌కుమార్
లాలాపేట: తనతో కాపురం చేయడం ఇష్టం లేకే శ్రావణి ఆరోపణలు చేస్తోందని, ఏదో ఆశించి ఆమె తన ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నదని శ్రావణి భర్త ప్రవీణ్‌కుమార్ అన్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శ్రావణి అనే మహిళ అత్తింటి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటనపై బుధవారం ఆమె భర్త ప్రవీణ్‌కుమార్ తండ్రి రుక్మయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన తల్లిదండ్రులు శ్రావణిని వేధించారనడం అవాస్తవమన్నారు. పెళ్లయిన ఐదేళ్ల కాలంలో శ్రావణి తనతో కనీసం ఆరు నెలలు కూడా కలిసి ఉండలేదన్నారు.
అప్పుడప్పుడు వచ్చి గొడవ పడి తల్లిగారి ఇంటికి వెళ్లేదన్నారు. తాము కలిసి ఉండలేమని భావించి విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిపాడు. అయినా తన నుంచి మరేదో ఆశించి తరచూ తనపై ఒత్తిడి చేస్తోందన్నారు. శ్రావణికి కోర్టు ద్వారా విడాకుల నోటీసు సైతం పంపించామన్నారు. తన తల్లిదండ్రులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తుందన్నారు. తమ ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న శ్రావణిని అక్కడి నుంచి పంపించాలని కోరుతూ లాలాగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.