
గొట్టిపల్లి శ్రావణి (ఫైల్)
వంగర (శ్రీకాకుళం): మండల పరిధి కొప్పర పంచాయతీ కె.కొత్తవలస గ్రా మానికి చెందిన విద్యార్థిని గొట్టిపల్లి శ్రావణి (17) మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు సమీపంలో వంగర –రాజాం రోడ్డులో ఉన్న వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యకు శుక్రవారం పాల్పడింది. ఎస్‌ఐ రొంగలి దేవానంద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తవలస గ్రామానికి చెందిన శ్రావణి విజయవాడ పడమటి రోడ్డులో ఉన్న శ్రీనివాస హైస్కూల్ లో పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసం వలస వెళ్లిపోవడంతో అక్కడే చదువుతోంది. ఇటీవలే సంక్రాంతికి సొంతూరు వచ్చారు.
చదవండి: (పుట్టిన రోజే ప్రాణాలు పోయాయి)
శ్రావణి సరిగ్గా చదవడం లేదని ఇటీవల తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంట ల సమయంలో ఇంటి నుంచి బయల్దేరి వెళ్లి వంతెన నుంచి నీటిలో దూకేసింది. దీనిపై స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాజాం అగ్నిమాపక శకటం సిబ్బందికి సమాచారం అందించి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనా స్థలాన్ని సీఐ డి.నవీన్‌కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్‌సీకి తరలించారు. తండ్రి గొట్టిపల్లి అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పేదింట విషాదం..
విద్యార్థిని ఆత్మహత్యతో కె.కొత్తవలస గ్రామంలో వి షాద ఛాయలు అలముకున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రావణి తల్లిదండ్రులు గొట్టిపల్లి అప్పలరాజు, చిట్టెమ్మలు కొన్నేళ్ల కిందట విజయవాడకు వలస వెళ్లారు. సంక్రాంతికి సొంతూరు వచ్చారు. ఈ లోగా ఈ విషాదం సంభవించడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment