కన్నీటి వీడ్కోలు | Tearful farewell | Sakshi
Sakshi News home page

కన్నీటి వీడ్కోలు

Published Mon, Sep 22 2014 11:27 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

కన్నీటి వీడ్కోలు - Sakshi

కన్నీటి వీడ్కోలు

దంపతులతో పాటు చిన్నారి మృతితో మండల పరిధిలోని ఇమాం గూడ శోకసంద్రమైంది. బంధువులు సోమవారం ముగ్గురి అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు.

మహేశ్వరం: దంపతులతో పాటు చిన్నారి మృతితో మండల పరిధిలోని ఇమాం గూడ శోకసంద్రమైంది. బంధువులు సోమవారం ముగ్గురి అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ కలహాలతో ఇమాంగూడకు చెందిన బంటు వెంకటేష్, పద్మ దంపతులతో పాటు వారి కూతురు శ్రావణి(1) విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసులు ఆదివారం రాత్రి 11:30గంటల సమయంలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
 
సోమవారం సాయంత్రం మృతదేహాలను ఇమాంగూడకు తీసుకొచ్చి బంధువులకు అప్పగించారు. కాగా ఆదివారం రాత్రి ఇంట్లో మృతదేహాల పక్కన లభించిన ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘మా చావుకు ఎవరూ కారణం కాదు’ అని అందులో ఉంది. సోమవారం పద్మ పుట్టిల్లు సిరిగిరిపురం నుంచి పెద్దసంఖ్యలో బంధువులు వచ్చారు. దంపతులతో పాటు ఏడాది చిన్నారి మృతిచెందడంతో వారు గుండెలు బాదుకుంటూ రోదించారు.
 
ఇది ముమ్మాటికి హత్యే అని వారు ఆరోపించారు. వెంకటేష్ కుటుంబాన్ని ఆయన సోదరుడు బంటు యాదగిరి మానసికంగా ఇబ్బంది పెట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్ప డి ఉండొచ్చని బంధువులు ఆరోపించా రు. కాగా ముందస్తు జాగ్రత్తగా పోలీసు లు బందోబస్తు నిర్వహించారు. ఈ మేరకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పహాడీషరీఫ్ సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement