Tearful farewell
-
వండవదొరకు కన్నీటి వీడ్కోలు
వీరఘట్టం/పాలకొండ: రాజకీయ కురువృద్ధుడు, ప్రజల మనిషి విశ్వాసరాయి నరసింహరావుదొర(95) అంతిమ వీడ్కోలు స్వగ్రామం వీరఘట్టం మండలం వండవలో మంగళవారం జనసందోహం మధ్య నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. ఐదుగురు కుమార్తెలు, కుమారుల కుటుంబ సభ్యులు సుమారు 80 మంది తరలివచ్చి వండవదొర పార్థివదేహం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. భార్య శాంతకుమారి, చిన్న కుమార్తె, ప్రస్తుత పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఇతర కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. జనసంద్రమైన వండవ.. అజాత శత్రువుగా పేరున్న వండవదొర పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వచ్చిన రాజకీయ ప్రముఖులు, బంధువులు, గిరిజన సంఘం నాయకులు, అధికారులతో వండవ జనసంద్రంగా మారింది. అంత్యక్రియల్లో పాల్గొని వండవదొర అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహనరావు, తోటపల్లి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ నిమ్మక పాండురంగ, పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు తరలివచ్చి వండవదొరకు కన్నీటి వీడ్కోలు పలికారు. మామిడితోటలో అంత్యక్రియలు.... వండవదొర కోరిక మేరకు ఆయన మామిడితోటలోనే అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు లక్ష్మణరావు తలకొరివి పెట్టగా చిన్నల్లుడు మండంగి హరిప్రసాద్, మనవడు కుమిధిన్, తమ్ముడు లక్ష్మీనారాయణదొర, అతని పిల్లలు అంత్యక్రియలు పూర్తి చేశారు. భారీ బందోబస్తు.. వండవదొర భౌతిక కాయాన్ని చూసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు, నాయకులు తరలిరావడంతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాలకొండ డీఎస్పీ రారాజుప్రసాద్, సీఐ ఆదామ్ ఆద్వర్యంలో వీరఘట్టం, పాలకొండ, రేగిడి, సీతంపేట ఎస్ఐలు గట్టిపోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రుల పరామర్శ.. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కుటుంబాన్ని మంగళవారం సాయంత్రం జిల్లా ఇన్చార్జి మంత్రి, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌లు పరామర్శించారు. వీరితో పాటు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాసరావు తదితరులు వండవదొర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వండవదొర కుటుంబ నేపథ్యాన్ని పాలవలస విక్రాంత్ వివరించారు. అంతకుముందు అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ వచ్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
అర్జన్ సింగ్‌కు కన్నీటి వీడ్కోలు
► యుద్ధ విమానాలతో ‘ఫ్లై పాస్ట్’ ► అధికార లాంఛనాలతో అంత్యక్రియలు న్యూఢిల్లీ: యుద్ధ వీరుడు, మార్షల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అర్జన్ సింగ్(98)కు జాతి కన్నీటి వీడ్కోలు పలికింది. కంటోన్మెంట్ ప్రాంతంలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో సోమవారం సిక్కు సంప్రదాయం ప్రకారం, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు జరిగాయి. అర్జన్ సింగ్ కుమారుడు అరవింద్ ఆయన భౌతికకాయానికి తలకొరివి పెట్టారు. ఈ సందర్భంగా దేశ రాజధానిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను అవనతం చేశారు. రాజకీయ ప్రముఖులు, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గుండెపోటుతో శనివారం తుది శ్వాస విడిచిన అర్జన్‌సింగ్ భౌతిక కాయానికి తొలుత 17 తుపాకులతో సైనికులు గౌరవ వందనం సమర్పించారు. యుద్ధ వీరుడికి గౌరవ సూచకంగా ‘మిస్సింగ్ మ్యాన్ ఫార్మేషన్’లో ఐఏఎఫ్ సుఖోయ్ ఎస్‌యూ–30 యుద్ధ విమానాలు గగనతలంలో సైనిక విన్యాసాలు (ఫ్లై పాస్ట్)నిర్వహించాయి. ఐఏఎఫ్ ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లు కూడా అర్జన్ సింగ్‌కు నివాళిగా వీఐసీ ఆకారంలో విన్యాసాలు నిర్వహించాయి. అమరుడైన సైనికాధికారి గౌరవార్థం ఆకాశంలో యుద్ధ విమానాలతో నిర్వహించేదే ‘మిస్సింగ్ మ్యాన్ ఫార్మేషన్’. అంతకుముందు జాతీయ పతాకం కప్పిన సింగ్ పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి మిలిటరీ వాహనంలో బ్రార్ స్క్వేర్‌కు తరలించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ తదితరులతో పాటు త్రివిధ దళాల ప్రస్తుత, మాజీ అధిపతులు, సింగ్ కుటుంబ సభ్యులు సైనిక వీరుడికి కడసారి నివాళులర్పించారు. ధీశాలి.. తిరుగులేని పైలట్... వాయుసేనలో ఫైవ్‌స్టార్ ర్యాంక్ పొందిన ఏకైక అధికారి అర్జన్‌సింగ్ 1965 భారత్–పాక్ యుద్ధంలో వీరోచిత పాత్ర పోషించారు. చిన్న వయసులోనే యుద్ధంలో వైమానిక దళాన్ని ముందుండి నడిపించిన ఆయన సేవలను పలువురు కీర్తించారు. నాడు అమెరికా మద్దతు కలిగిన వైమానిక దళాలున్న పాక్‌ను సింగ్ నేతృత్వంలోని ఐఏఎఫ్ తరిమికొట్టిందని మాజీ ఎయిర్ వైస్ మార్షల్ కపిల్ కాక్ కొనియాడారు. ధైర్యవంతుడు, తిరుగులేని పైలట్ అని ఆయన మాజీ సహచరుడొకరు ప్రశంసించారు. -
శ్రీనివాస్‌కు కన్నీటి వీడ్కోలు
-
కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు
నారాయణఖేడ్ రూరల్: ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం మెదక్ జిల్లా నారాయణఖేడ్ మం డలం పంచగామ గ్రామంలోని తన వ్యవసాయక్షేత్రంలో పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం కె.చంద్రశేఖరరావు, మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, ఉప నేత భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జె.గీతారెడ్డి, ఫరీదుద్దీన్, సుదర్శన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. నారాయణఖేడ్‌లోని కిష్టారెడ్డి నివాసం నుంచి ఆయన భౌతికకాయాన్ని ఉదయం ప్రత్యేక వాహనంపై ఉంచి పంచగామలోని వ్యవసాయ క్షేత్రం వరకు మూడు కిలోమీటర్ల మేర ఊరేగింపుగా తరలిం చారు. సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకున్నారు. కిష్టారెడ్డి భౌతికకాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. కిష్టారెడ్డితో కలసి 1989-94లో సిద్దిపేట శాసనభ్యుడిగా పనిచేసిన విషయాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. కిష్టారెడ్డి భౌతికకాయానికి ఆయన పెద్ద కుమారుడు సంజీవరెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎస్పీ బి.సుమతి, పోలీసు సిబ్బంది.. భౌతికకాయానికి గౌరవ వందనం చేయగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. కాగా, అంతకుముందు మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ నుండి నారాయణఖేడ్‌కు చేరుకున్న కిష్టారెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఖేడ్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. -
మేదరమెట్లకు కన్నీటి వీడ్కోలు
జలదంకి: వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు, జలదంకి మండల నేత మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డికి మండల వాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. కావలి నుంచి బ్రాహ్మణక్రాకలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చిన మేదరమెట్ల మృతదేహానికి సోమవారం నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం నిర్వహించిన అంత్యక్రియలలో ఉదయగిరి, కావలి నియోజకవర్గాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు, అభిమానులు, కార్యకర్తలు, మండల వాసులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య మండల వాసులు మేదరమెట్ల అంత్యక్రియలను నిర్వహించారు. అడిగిన వారికి లేదనకుండా ఆయన చేసిన దానాలను, నిర్మించిన ఆలయాల గురించి ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తమ ప్రజానేత మృతి చెందడంతో జలదంకి మండలం మూగబోయినట్లు అయిందని స్థానికుల కన్నీరు మున్నీరుగా విలపించారు. మండల వాసులను ఎవరిని కదిలించినా మేదరమెట్ల గొప్పతనాన్ని చర్చించికోవడం కనిపించింది. బీజేపీ రాష్ట్ర నేత కందుకూరి వెంకటసత్యనారాయణ, వైఎస్సార్సీపీ జలదంకి మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి, వివిధ మండలాల కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు. మేదరమెట్ల కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్ జలదంకి: వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి ఆదివారం మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను సోమవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. మేదరమెట్ల సతీమణి, జెడ్పీటీసీ సభ్యురాలు శివలీలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఓదార్పు యాత్ర జిల్లాలో చేపట్టినపుడు మూడు రోజులపాటు మేదరమెట్ల స్వగృహంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మేదరమెట్ల మంచి వ్యక్తి అని, పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. -
కన్నీటి వీడ్కోలు
మహేశ్వరం: దంపతులతో పాటు చిన్నారి మృతితో మండల పరిధిలోని ఇమాం గూడ శోకసంద్రమైంది. బంధువులు సోమవారం ముగ్గురి అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ కలహాలతో ఇమాంగూడకు చెందిన బంటు వెంకటేష్, పద్మ దంపతులతో పాటు వారి కూతురు శ్రావణి(1) విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసులు ఆదివారం రాత్రి 11:30గంటల సమయంలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం మృతదేహాలను ఇమాంగూడకు తీసుకొచ్చి బంధువులకు అప్పగించారు. కాగా ఆదివారం రాత్రి ఇంట్లో మృతదేహాల పక్కన లభించిన ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘మా చావుకు ఎవరూ కారణం కాదు’ అని అందులో ఉంది. సోమవారం పద్మ పుట్టిల్లు సిరిగిరిపురం నుంచి పెద్దసంఖ్యలో బంధువులు వచ్చారు. దంపతులతో పాటు ఏడాది చిన్నారి మృతిచెందడంతో వారు గుండెలు బాదుకుంటూ రోదించారు. ఇది ముమ్మాటికి హత్యే అని వారు ఆరోపించారు. వెంకటేష్ కుటుంబాన్ని ఆయన సోదరుడు బంటు యాదగిరి మానసికంగా ఇబ్బంది పెట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్ప డి ఉండొచ్చని బంధువులు ఆరోపించా రు. కాగా ముందస్తు జాగ్రత్తగా పోలీసు లు బందోబస్తు నిర్వహించారు. ఈ మేరకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పహాడీషరీఫ్ సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
వీరభద్రస్వామికి కన్నీటి వీడ్కోలు
రామవరప్పాడు : రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన హీరో రాజేంద్రప్రసాద్ సోదరుడు గద్దె వీరభద్రస్వామి మృతదేహం పోస్టుమార్టం అనంతరం శుక్రవారం ప్రసాదంపాడులోని అతని స్వగృహనికి చేరుకుంది. డ్రగ్స్ అండ్ కంట్రోల్ అడ్మినిస్టేటివ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వీరభద్రస్వామి మంగళవారం రాత్రి రామవరప్పాడు బళ్ళెం వారి వీధిలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిన విషయం విధితమే. వీరభద్రస్వామి కూతురు, కొడుకు కెనడాలో ఉండడంతో వారు వచ్చే వరకూ పోస్టుమార్టం వాయిదా వేశారు. తండ్రిని కడసారి చూసుకునేందుకు కూతురు, కొడుకు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. ప్రభుత్వాస్పత్రిలోని మృతదేహన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని బంధువులు, సన్నిహితుల సందర్శనార్థం గ్రామానికి తీసుకోచ్చారు. సినీ హిరో రాజేంద్రప్రసాద్ విగతజీవిగా మారిన తన సోదరుడ్ని చూసి కన్నీటి పర్యంతరమయ్యారు. మృతదేహనికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మృతుడికి చిన్ననాటి మిత్రుడైన నగర మేయరు కోనేరు శ్రీధర్, మృతుడి సహ ఉద్యోగులు, స్నేహితులు, మృతదేహనికి పూలమాలలు వేశారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. -
కానిస్టేబుల్ అనిల్‌కు కన్నీటి వీడ్కోలు
- పిడుగు పడి మృతిచెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ - ఏలూరులో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు ఏలూరు(టూటౌన్), న్యూస్‌లైన్ : విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ అనిల్‌కు పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఏలూరు గ్జేవియర్ నగర్ ప్రాంతానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ కారే అనిల్(32) హైదరాబాద్‌లో గ్రేహౌండ్స్ విభాగంలో పనిచే స్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా బుధవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా అమన్జల్ ప్రాంతంలో డెమో ఇవ్వడానికి అనిల్‌తో పాటు పలువురు కానిస్టేబుళ్లు వెళ్లారు. అక్కడ భారీగా వర్షం కురుసున్న సమయంలో ఖమ్మంకు చెందిన కానిస్టేబుల్ సుధాకర్, అనిల్ ఫోన్లో మాట్లాడుతుండగా వైబ్రేషన్స్‌కు వారిద్దరిపై ఒక్కసారిగా పిడుగు పడింది. ఘటనలో అనిల్ అక్కడికక్కడే మృతిచెందగా, సుధాకర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం అనిల్ మృతదే హం గురువారం ఉదయం ఏలూరు చేరింది. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు విశాఖ్, మణి, భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 2007లో కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన రత్నకుమారితో అనిల్‌కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు సంతానం. డెప్యూటేషన్‌పై హైదరాబాద్‌లో విధులు 2003 ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కాకినాడకు చెందిన అనిల్ కొంతకాలంగా డెప్యూటేషన్‌పై హైదరాబాద్ గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్నాడు. పట్టుదలతో పోలీసు ఉద్యోగం సాధించాడని, గత ఏడాది క్రిస్మస్కు ఏలూరు వచ్చిన కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నాడని స్నేహితులు తెలిపారు. 15 రోజుల క్రితం విశాఖపట్నం బందోబస్తుకు వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళ్తూ ఏలూరులో 10 నిమిషాలు తమ మాట్లాడి వెళ్లిపోయూడని, అవే చివరి చూపులను కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహానికి ఏలూరు డీఎస్పీ ఎం.సత్తిబాబు, త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు నివాళుల్పరించారు. బాధిత కుటుంబానికి జిల్లా పోలీసుల సంఘం అధ్యక్షుడు కె.నాగరాజు ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు.