- పిడుగు పడి మృతిచెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్
- ఏలూరులో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు
ఏలూరు(టూటౌన్), న్యూస్‌లైన్ : విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ అనిల్‌కు పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఏలూరు గ్జేవియర్ నగర్ ప్రాంతానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ కారే అనిల్(32) హైదరాబాద్‌లో గ్రేహౌండ్స్ విభాగంలో పనిచే స్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా బుధవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా అమన్‌జల్ ప్రాంతంలో డెమో ఇవ్వడానికి అనిల్‌తో పాటు పలువురు కానిస్టేబుళ్లు వెళ్లారు.
అక్కడ భారీగా వర్షం కురుసున్న సమయంలో ఖమ్మంకు చెందిన కానిస్టేబుల్ సుధాకర్, అనిల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా వైబ్రేషన్స్‌కు వారిద్దరిపై ఒక్కసారిగా పిడుగు పడింది. ఘటనలో అనిల్ అక్కడికక్కడే మృతిచెందగా, సుధాకర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం అనిల్ మృతదే హం గురువారం ఉదయం ఏలూరు చేరింది. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు విశాఖ్, మణి, భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 2007లో కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన రత్నకుమారితో అనిల్‌కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు సంతానం.
డెప్యూటేషన్‌పై హైదరాబాద్‌లో విధులు
2003 ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కాకినాడకు చెందిన అనిల్ కొంతకాలంగా డెప్యూటేషన్‌పై హైదరాబాద్ గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్నాడు. పట్టుదలతో పోలీసు ఉద్యోగం సాధించాడని, గత ఏడాది క్రిస్మస్‌కు ఏలూరు వచ్చిన కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నాడని స్నేహితులు తెలిపారు. 15 రోజుల క్రితం విశాఖపట్నం బందోబస్తుకు వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళ్తూ ఏలూరులో 10 నిమిషాలు తమ మాట్లాడి వెళ్లిపోయూడని, అవే చివరి చూపులను కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహానికి ఏలూరు డీఎస్పీ ఎం.సత్తిబాబు, త్రీటౌన్ సీఐ పి.శ్రీనివాసరావు నివాళుల్పరించారు. బాధిత కుటుంబానికి జిల్లా పోలీసుల సంఘం అధ్యక్షుడు కె.నాగరాజు ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు.
కానిస్టేబుల్ అనిల్‌కు కన్నీటి వీడ్కోలు
Published Fri, May 30 2014 3:11 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
Advertisement