విశాఖ: హైదరాబాద్‌లో అదృశ్యమైన బాలిక శ్రావణి(13) ఆచూకీ లభించింది. ఈనెల 5న కృష్ణా నగర్ లో బయటకు వెళ్లిన బాలిక అకస్మాత్తుగా కనిపించకుండా పో్యింది. అదే రోజు ఎంతకూ బాలిక ఆచూకీ లభించకపోవంతో తల్లి దండ్రలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నపోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని రైల్వే స్టేషన్ లకు సమాచారం ఇచ్చి రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. ఈక్రమంలో ఆ బాలిక విశాఖ పట్టణంలో నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు.
తనను జూనియర్ ఆర్టిస్టు జెస్సీ నాయుడు అనే వ్యక్తి ట్రైన్ ఎక్కించినట్లు ఆ బాలిక పోలీసులకు తెలిపింది. బాలిక అదృశ్యంనకు సంబంధించి వివరాలు సేకరించే కోణంలో పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.