మండలంలోని కొప్పోలు గ్రామంలో శ్రావణి (27) అనే వివాహిత బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కొప్పోలుకు చెందిన ఓబుళరెడ్డి భార్య శ్రావణి నాలుగేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది.
వల్లూరు: మండలంలోని కొప్పోలు గ్రామంలో శ్రావణి (27) అనే వివాహిత బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కొప్పోలుకు చెందిన ఓబుళరెడ్డి భార్య శ్రావణి నాలుగేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి వెనుక ఉన్న బాత్‌రూమ్ వద్దకు వెళ్లి కిరసనాయిల్ మీద పోసుకుని నిప్పంటించుకుంది. శరీరం ఎక్కువగా కాలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి 3, 6 సంవత్సరాల వయసు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి తండ్రి మహేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.