చక్రి కావాలంటూ.. కన్నీరు మున్నీరు | Music director chakri's wife shravani shocks | Sakshi
Sakshi News home page

చక్రి కావాలంటూ.. కన్నీరు మున్నీరు

Published Mon, Dec 15 2014 1:39 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

చక్రి కావాలంటూ.. కన్నీరు మున్నీరు - Sakshi

చక్రి కావాలంటూ.. కన్నీరు మున్నీరు

హైదరాబాద్ : చక్రి హఠాన్మరణాన్ని అతడి భార్య శ్రావణి జీర్ణించుకోలేకపోతోంది. ఆమెను ఓదార్చడం ఎవ్వరి తరమూ కావట్లేదు. చక్రి కావాలంటూ ఆమె హృదయ విదారకంగా ఏడుస్తుండడం .. అందరి గుండెలను బరువెక్కిస్తోంది. శ్రావణి కుటుంబ సభ్యులు ...ఆమెను సముదాయిస్తున్నారు. చక్రి, శ్రావణి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక  చక్రి సోదరుడు  కన్నీటిపర్యంతం అయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా విషాదంలో మునిగిపోయారు. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా చక్రి మరణవార్తను తట్టుకోలేకపోయారు. చక్రి అంత్యక్రియల గురించి ఆర్పీ విలేకర్లతో మాట్లాడుతూ చక్రి గురించి ఇంకేం మాట్లాడాలంటూ... ఒక్కసారిగా భోరున విలపించారు.

సంగీత స్వరం మూగపోయిన వేళ..  చక్రి స్వగ్రామం కంబాలపల్లి వాసుల గొంతు కూడా మూగబోయింది. సంగీత ప్రపంచంలో తన కంటూ ఓ ముద్ర వేసుకున్న చక్రి తిరిగి రాని లోకాలకు పోయారన్న వార్త తెలుసుకున్న కంబాలపల్లి వాసులు కన్నీరుమున్నీరు అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement