అనంతపురం, సాక్షి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. టీడీపీలో వర్గ విబేధాలు నెమ్మదిగా బయటకొస్తున్నాయి. శింగనమల నియోజకవర్గంలో వర్గపోరు అయితే తారాస్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్సెస్ టూమెన్ కమిటీగా ఆధిపత్య పోరు నడుస్తోందక్కడ.
నియోజకవర్గంలో రేషన్ షాపుల్ని చేజిక్కించుకోవాలని ఎమ్మెల్యే శ్రావణి వర్గం తీవ్రంగా యత్నిస్తోంది. అయితే.. దానికి టీడీపీ టూమెన్ కమిటీ అడ్డు తగిలింది. ఆ వ్యవహారం మొత్తం తమ చేతుల్లోకి తీసేసుకుంది. దీంతో అధికారం ఎమ్మెల్యే చేతుల్లో ఉందా?.. లేదంటే ఆ కమిటీ చేతుల్లో ఉందా? అని శ్రావణి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే చోట కావాలనే కమిటీకి అధికారం కట్టబెట్టారా? అని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు.
అయితే.. శ్రావణిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన టైంలోనే కొందరు సీనియర్లు ఆమె ఎంపికను బహిరంగంగా వ్యతిరేకించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సైతం వైరల్ అయ్యిది. ఆ తర్వాత చంద్రబాబు ఆదేశాలతో వాళ్లంతా సైలెంట్ అయినప్పటికీ.. ఇప్పుడు ఈ రకంగా తమ రివెంజ్ తీర్చుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు.. టూమెన్ కమిటీ తనకు తలనొప్పిగా తయారైందని భావించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి.. విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శింగనమల నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment