సైబర్ క్రైమ్ నేపథ్యంలో...
సైబర్ క్రైమ్ నేపథ్యంలో...
Published Wed, Sep 18 2013 1:07 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
సంజిత్, శ్రావణి హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘తను... నేను... మహ్మద్ రఫీ’. ఓం ప్రకాష్ మార్తా దర్శకుడు. కె.అనేష్‌బాబు నిర్మాత.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం జరుగుతున్న సైబర్ క్రైమ్, ఐటీ మోసాలకు అద్దం పట్టే సినిమా ఇది. ఇందులో సంగీతం హైలైట్. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం’’ అన్నారు.
రష్ చూసి చాలా సంతృప్తి చెందామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్, సంగీతం: నాని, సమర్పణ: తమ్మినేని పూర్ణారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగుల జగన్నాథ్.
Advertisement
Advertisement