Sanjith
-
ప్రిక్వార్టర్స్‌లో కవీందర్, సంజీత్
ఎకతెరీన్‌బర్గ్ (రష్యా): ప్రపంచ సీనియర్ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం ముగ్గురు బాక్సర్లు బరిలోకి దిగగా... ఇద్దరు విజయాలు నమోదు చేశారు. మరొకరు ఓడిపోయారు. 57 కేజీల విభాగంలో కవీందర్ సింగ్ బిష్త్, 91 కేజీల విభాగంలో సంజీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 81 కేజీల విభాగంలో బ్రిజేశ్ యాదవ్ పోరాటం ముగిసింది. కవీందర్ 3–2తో చెనా జిహావో (చైనా)పై, సంజీత్ 4–1తో స్కాట్ ఫారెస్ట్ (స్కాట్లాండ్)పై విజయం సాధించారు. బ్రిజేశ్ యాదవ్ 1–4తో బేరమ్ మల్కాన్ (టర్కీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఇప్పటికే భారత్ నుంచి అమిత్ పంగల్ (52 కేజీలు), మనీశ్ కౌశిక్ (63 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
కిడ్నాపైన సుంజిత్ బోయినపల్లిలో ప్రత్యక్షం
హైదరాబాద్ : నారాయణగూడ వెంకటేశ్వరకాలనీలో మంగళవారం రాత్రి కిడ్నాప్‌కు గురైన బాలుడు సంజిత్(8)ను కిడ్నాపర్లు బోయినపల్లిలో బుధవారం ఉదయం వదిలివెళ్లారు. సంజిత్ ట్యూషన్ నుంచి వస్తుండగా ఆటోలో వచ్చిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే 10 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసులకు దొరికిపోతామని భావించిన దుండగులు ఉదయం బోయినపల్లిలో వదిలేసి వెళ్లారు. దాంతో పోలీసులు.. బాలుడ్ని హిమాయత్‌నగర్‌లోని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. గతంలో బాలుడి తండ్రి షాపులో పనిచేసిన వ్యక్తే ఈ కిడ్నాప్‌కు సూత్రధారని సమాచారం. -
సైబర్ క్రైమ్ నేపథ్యంలో...
సంజిత్, శ్రావణి హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘తను... నేను... మహ్మద్ రఫీ’. ఓం ప్రకాష్ మార్తా దర్శకుడు. కె.అనేష్‌బాబు నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం జరుగుతున్న సైబర్ క్రైమ్, ఐటీ మోసాలకు అద్దం పట్టే సినిమా ఇది. ఇందులో సంగీతం హైలైట్. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం’’ అన్నారు. రష్ చూసి చాలా సంతృప్తి చెందామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్, సంగీతం: నాని, సమర్పణ: తమ్మినేని పూర్ణారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగుల జగన్నాథ్.