కిడ్నాపైన సుంజిత్ బోయినపల్లిలో ప్రత్యక్షం
హైదరాబాద్ : నారాయణగూడ వెంకటేశ్వరకాలనీలో మంగళవారం రాత్రి కిడ్నాప్‌కు గురైన బాలుడు సంజిత్(8)ను కిడ్నాపర్లు బోయినపల్లిలో బుధవారం ఉదయం వదిలివెళ్లారు. సంజిత్ ట్యూషన్ నుంచి వస్తుండగా ఆటోలో వచ్చిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే 10 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
పోలీసులకు దొరికిపోతామని భావించిన దుండగులు ఉదయం బోయినపల్లిలో వదిలేసి వెళ్లారు. దాంతో పోలీసులు.. బాలుడ్ని హిమాయత్‌నగర్‌లోని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. గతంలో బాలుడి తండ్రి షాపులో పనిచేసిన వ్యక్తే ఈ కిడ్నాప్‌కు సూత్రధారని సమాచారం.