ముగ్గురు ఆడిపిల్లలను హతమార్చి ఏం ఎరుగనట్టు తమ మధ్యే తిరిగిన మానవ మృగం శ్రీనివాస్ రెడ్డిని గుర్తించలేకపోయామని హజీపూర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో చోటుచేసుకున్న వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డి గురించి విచారణలో వెల్లడవుతున్న విషయాలతో గ్రామస్థులు అవాక్కవుతున్నారు.