
ఫిట్స్ ఆమెకు ఉన్న సమస్య. అయితే పాపం ఆమె బడికి వెళ్తుండగా..
క్రైమ్: చక్కగా చదువుకునే అమ్మాయిని ఆమెకున్న ఆరోగ్య సమస్య హఠాత్తుగా బలిగొంది. అదీ ఎవరూ ఊహించని రీతిలో!. రోజూలాగే స్కూల్‌కు వెళ్తున్న ఆమె ఫిట్స్ రావడంతో పక్కనే ఉన్న చెరువులో పడి కన్నుమూసింది.
సీతానగరం మండలం ఆవాలవలసకు చెందిన శ్రావణి(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. సత్యం-పార్వతిలకు ఆమె ఏకైక సంతానం. గాదెలవలసలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు సైకిల్ మీద వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా.. మార్గం మధ్యలో ఫిట్స్ వచ్చింది. దీంతో బ్యాలెన్స్ ఆగక పక్కనే ఉన్న చెరువులో పడింది.
అది గమనించిన తోటి విద్యార్థులు చుట్టుపక్కల వాళ్లకు సమాచారం అందించారు. అయితే.. అప్పటికే ఆలస్యమైంది. సైకిల్ మీద పడి ఆమె బుదరలో కూరుకుపోవడంతో కన్నుమూసిందామె. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: నితిన్ తన మాట వినడం లేదంటూ..