Parvathipuram Manyam
-
‘ఏపీలో బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారంటీ’
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏపీలో కూటమి నేతలది దగా ప్రభుత్వం, మోసపూరిత సర్కార్ అని మండిపడ్డారు మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి. ఈ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ చార్జీల పేరిట 15,845 కోట్లు ప్రజలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేరుస్తారని ఆశపడి ప్రజలు ఓటు వేస్తే నట్టేట ముంచారని ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యుత్ చార్జీలు పెంచడంపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలకు ముందు బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ అన్న మాటలు ఆచరణలో లేకుండా బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారంటీ అనేటట్టు ఉంది. విద్యుత్ చార్జీలు పెంచమని ఎన్నికల ముందు చెప్పిన మాట ఏమైంది?. 2023 సభలో చంద్రబాబు ఏం మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ చార్జీల పేరిట 15,845 కోట్లు ప్రజలపై భారం మోపారు. యూనిట్‌పై జనవరి నుండి 2.19 పైసలు ఎక్కువ వసూలు చేయబోతున్నారు. ఎన్నికల ముందు బాదుడే బాదుడు అని తిరిగారు.. కానీ ఇప్పుడు కరెంటు, నిత్యవసర సరుకులు, మద్యం ధరలు ఈ ప్రభుత్వంలో బాదుడే బాదుడు మొదలైంది.కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం, శ్రీ శక్తి ఏమైంది?. మహిళల కోసం ఈ ప్రభుత్వంలో ఏం ఖర్చు చేశారో చెప్పాలి. ఉచిత గ్యాస్ పెద్ద మోసం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని అబద్ధమే. పథకాల రూపంలో ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో ప్రజలు అష్ట కష్టాలు, అప్పుల బారిన పడుతున్నారు. ఆరు నెలల్లో 15,845 కోట్లు విద్యుత్ చార్జీల భారం మోపిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే. హామీలు నెరవేరుస్తారని ఆశపడి ప్రజలు ఓటు వేస్తే నట్టేట ముంచారు.సెకీ ఒప్పందాలపై పేపర్లలో తప్పుడు రాతలు రాసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేసి పబ్బం గడుపుతోంది. గతంలో చంద్రబాబు దిగేపోయే సమయానికి విద్యుత్ రంగంలో 86 వేల కోట్లు అప్పులు చేసింది. గత ప్రభుత్వం చేసిన పీపీఏలు రద్దు చేసే దమ్ము కూటమికి ఉందా?. మద్యం దుకాణాల యజమానులను కూటమి నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవ్వడం పోయి రాజకీయ కక్షలతో ఉద్యోగాలు తీస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
మూడు జిల్లాల నేతలతో వైఎస్ జగన్ భేటీ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నేతలతో తన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య నేతలతో ఆయన తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల నియామకాలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. -
రూటే సెపరేటు
ఆయన స్థానికుడు కాదు. ఓ ఎన్ఆర్ఐ(నాన్ రెసిడెంట్ ఇండియన్). కానీ ఇక్కడే నివాసమంటూ జనాలకు నమ్మబలుకుతున్నాడు. విదేశాల్లో ఉద్యోగమని..ప్రజాసేవ కోసం ఇక్కడికి వచ్చానని ఊదర గొడుతున్నాడు. నియోజకవర్గ రాజకీయాల్లోకి వస్తూనే టీడీపీలో ముసలం సృష్టించాడు. అప్పటివరకు నియోజకవర్గ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన ఓ మాజీ ఎమ్మెల్సీని, మరో మాజీ ఎమ్మెల్యేను పూర్తిగా పక్కకు నెట్టేశాడు. పార్టీని తన చేతుల్లోకి తీసుకుని నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీల్చేశాడు. ఒంటెత్తు పోకడలకు తెరతీసి ఎవరైనా తన వద్దకే రావాలి గానీ..తాను ఎవరి వద్దకూ వెళ్లనంటూ పార్టీలో విభేదాలకు ఆజ్యం పోశాడు. ఈ పంచాయితీ అధిష్టానం దగ్గరికి వెళ్లినా..‘చినబాబు’ మద్దతుతో ఆయన మాటకు ఎదురే లేకపోయింది. దీంతో పార్టీ సీనియర్ నాయకులంతా ఇప్పుడు అంటీముట్టనట్లు ఉంటున్నారు. ● అందరి వాడు కాదు ● నిన్నమొన్నటి వరకూ స్థానికంగా ఓటుహక్కూ లేదు ● ఒంటెత్తు పోకడతో దూరమైన టీడీపీ సీనియర్లు ● పార్వతీపురం నియోజకవర్గంలో ‘ఎన్ఆర్ఐ’కు ఎదురుగాలిసాక్షి, పార్వతీపురం మన్యం: నిజానికి పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తే అన్నీ ఆర్థిక నేరారోపణలు, మోసాలు. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వాటినే తెలుగుదేశం పార్టీ ఆ వ్యక్తి అర్హతలుగా నిర్ణయించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. రాజకీయాల్లోకి రాకముందే ఇన్ని అబద్ధాలా అంటూ! నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. రేప్పొద్దున ఇటువంటి వ్యక్తికి ఓటేస్తే..ఇంకెన్ని మోసాలు చేస్తాడోనని చర్చించుకుంటున్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ ఎన్నికల బరిలో గెలిచేందుకు అన్ని అడ్డదారులూ తొక్కుతున్నట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఈ వ్యక్తికి రాజకీయంగా గానీ, ప్రజాసేవపరంగా గానీ గతంలో ఎటువంటి అనుభవమూ లేదు. పుట్టింది, పెరిగింది, నివాసం ఇక్కడ కానేకాదు. ఎప్పుడో తాతల కాలంలో ఉండేవార మని ఓ ఊరు పేరు చెప్పి, తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పోనీ, ఆ ఊరిలోనైనా ఓటుహక్కు ఉందా? అంటే అదీ లేదు. మరో ఊరిలో ఆరునెలల క్రితం ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆయనకే అన్న హామీ లభించిన తర్వాతే..ఈ ప్రక్రియలన్నీ ప్రారంభించారు. పార్టీ క్యాడర్‌లోనూ అసంతృప్తి ఎక్కడి వ్యక్తినో తీసుకొచ్చి మా నెత్తిన పెట్టారని..ఆయన ఒంటెత్తు పోకడలతో నలిగిపోతున్నామంటూ టీడీపీ క్యాడర్ రగిలిపోతోంది. దీనికితోడు ప్రచార సమయంలో ఆయన వెంట వెళ్లే క్యాడర్‌కు అయ్యే ఖర్చును సైతం సదరు ‘ఎన్ఆర్ఐ’ పెట్టుకోవడం లేదని, స్థానికంగా ఉండే పార్టీ నాయకుల మీదే నెట్టేస్తున్నాడని వినికిడి. దీంతో చోటామోటా నాయకులకు చేతిచమురు వదిలిపోతోంది. మరోవైపు ప్రజలు కూడా ఎక్కడో వ్యక్తిని ఇక్కడెందుకు ప్రోత్సహించాలన్న ఆలోచనలో పడినట్లు సమాచారం. స్థానికేతరుడికి ఓటు వేయడం కన్నా.. స్థానికంగా ఉంటూ నిత్యం మన సమస్యలను పరిష్కరిస్తూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను మరోసారి గెలిపించుకుందామని ఓ నిర్ణయానికి వచ్చేశారన్న చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతోంది. అటు పార్టీ క్యాడర్‌కు దూరమై, ఇటు ప్రజలకూ దగ్గర కాలేక.. సదరు ‘ఎన్ఆర్ఐ’ ఓటమికి మానసికంగా ముందుగానే సిద్ధపడిపోయినట్లు అనుచరులు చెప్పుకుంటున్నారు. ఆర్థిక నేరారోపణల్లో దిట్ట సదరు అభ్యర్థిపై తీవ్రమైన ఆర్థిక నేరారోపణలూ ఉన్నాయి. కులం ముసుగులో తమను మోసం చేశారని..అక్కడ సంపాదించిన డబ్బులతో రాజ్యాధికారం కోసం సదరు వ్యక్తి ఆరాటపడుతున్నారని ఇన్ఫాం ఇంటర్నేషనల్ అనే సంస్థ గతంలో తీవ్రంగా ఆరోపణలు గుప్పించింది. కులం అభ్యున్నతి కోసం 2014లో ఐఎఫ్ఎం అనే సంస్థ ఏర్పాటైందని చెప్పిన అక్కడి ప్రతినిధులు..2018లో తమ సంస్థ చేసిన కార్యక్రమాలు చూసి ఆ వ్యక్తి తమతో కలిశాడని పేర్కొ న్నారు. సంస్థలో ఉన్న కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ మేధావులను పక్కదారి పట్టించి..ఇదే సంస్థ పేరు మీద విశాఖ గీతం యూనివర్సిటీలో కెనరా బ్యాంకు ఖాతా తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్నారు. అదేవిధంగా ఓ టీవీ చానల్లో డైరెక్టర్‌గా చేరి, రూ.4 కోట్లు వసూలు చేసి సంస్థకు ఇవ్వలేదని నాడు గుర్తు చేశారు. ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియక ఆ టీవీ చానల్ నడుపుతున్న శ్రీనివాసరావు చనిపోయారని అప్పట్లో పార్వతీపురంలో విలేకరుల సమావేశం పెట్టి మరీ సంస్థ సభ్యులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. -
Salur: ఇంట గెలవని రాణి..!
ఆమెది ఒంటెత్తు పోకడ వ్యవహారమన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్సీగా పదవి అనుభవించినా సంతృప్తి లేదు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలన్నదే ఆమె లక్ష్యం. అయితే సొంత పార్టీలోని మాజీ ఎమ్మెల్యేతో ఇప్పటికీ విభేదాలే. కూటమి కట్టి పోటీ చేస్తున్నప్పటికీ..కూటమి పార్టీ ఎంపీ అభ్యర్థితోనూ సఖ్యత అంతంతమాత్రమే. నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ ఆమెను వ్యతిరేకించేవారే ఉన్నారని సొంతపార్టీ నాయకులే చెప్పుకుంటారు. ఆమె ధోరణి, వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు పలుమార్లు పార్టీ అధిష్టానం వద్ద పంచాయితీ పెట్టిన ఉదంతాలూ ఉన్నాయి. మక్కువ మండలంలోని ఆమె వ్యతిరేక వర్గం..కేవలం కూటమి ఎంపీ అభ్యర్థికి మాత్రమే అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. పాచిపెంట మండలంలోనూ పార్టీ కేడర్‌కు గతంలో ఆమెతో విభేదాలున్నాయి. పార్టీలోని సొంత వర్గీయులే కాదు..వ్యతిరేక వర్గం వారైనా తలెగరేస్తే పాతాళానికి తొక్కేసే వరకూ ఆమె నిద్రపోరనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆమె వైఖరిని ఖండిస్తూ గతంలో సొంత పార్టీ నేతలే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం గమనార్హం. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇవన్నీ చాలదన్నట్లు కులవివాదాన్నీ ఎదుర్కొంటున్నారు. ఇలా ఇంటా బయటా వ్యతిరేకతను కూడగట్టుకున్న తెలుగుదేశం పార్టీ సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్యారాణి..ఎని్నకల్లో ఎలా ముందుకు వెళ్తారో అన్న చర్చ సాగుతోంది.పార్వతీపురం మన్యం: సాలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందా అని భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. తనకు ఎమ్మెల్యేగా అవకాశవిుస్తే అది చేస్తా..ఇది చేయిస్తా అంటూ టీడీపీ తరఫున ఎన్నికల బరిలో దిగుతున్న గుమ్మిడి సంధ్యారాణి కొద్దిరోజులుగా ఊదరగొడుతున్నారు. కనీసం తాను ఎమ్మెల్సీగా పదవిని అనుభవించిన ఆరేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో ఆరేళ్లు ఎమ్మెల్సీగా చేసినా నియోజకవర్గానికి ఆమె చేసింది శూన్యం. తాగునీరు, ఇతర అవసరాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని ఆమె చెబుతుంటే అధికార పార్టీ నేతలు అడిగిన ప్రశ్నలకు తిరిగి సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కనీసం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా స్పందించడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఆమె ఎమ్మెల్సీగా పదవిని అనుభవించారు.పదవిలో ఆమె ఉన్నది ప్రజల శ్రేయస్సు కాద ని, ఆమె స్వలాభం కోసమేనని సొంత పార్టీ నేతలే విమర్శిస్తుంటారు. సాలూరులో ఆటోనగర్‌ను అభివృద్ధి చేస్తామని, లారీ పరిశ్రమను ఆదుకుంటామని స్వయంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాంలో హామీ ఇచ్చారు. బైపాస్ రోడ్డును పూర్తి చేస్తామని చెప్పినా చేయలేదు. ఈ ప్రాంత ఎమ్మెల్సీగా వాటి సాధన కోసం ఆమె ఏనాడూ పట్టుబట్టలేదు. టీడీపీ హయాంలో ఏజెన్సీలో గిరిజ నుల మరణాలు అధికంగా సంభవించాయి. ఒక్క కరాసవలసలోనే డెంగీ జ్వరాలతో 10 రోజుల వ్యవధిలో 11 మంది వరకు చనిపోయారు. కొదమ పంచాయతీ గిరిశిఖర సిరివర గ్రామం నుంచి డోలీలో గర్భిణిని తీసుకువస్తే..మార్గమధ్యంలోనే ఆమె ప్రసవించింది. దీంతో మానవహక్కుల సంఘం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.ఎన్నికల ముందు హడావుడిసాలూరులో వంద పడకల ఆస్పత్రికి 2019 ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుతో కలిసి సంధ్యారాణి హడావుడిగా భూమి పూజ చేశారు. తర్వాత పట్టించుకోలేదు. కందులపథం బ్రిడ్జికి కూడా ఎన్నికలకు ముందు కొబ్బరికాయ కొట్టి పనులు చేయకుండా వదిలేశారు. సొంత మండలాన్నే ఆమె ఏనాడూ పట్టించుకున్న పా పాన పోలేదని..ఇంక నియోజకవర్గాన్ని ఏం పట్టించుకుంటారని ‘తెలుదేశం పార్టీలోని ఓ వర్గం ప్రశ్ని స్తోంది. తన పదవీ కాలంలో అంటీముట్టనట్లుగానే ఆమె కాలం గడిపేశారని గుర్తుచేస్తున్నారు. ఇప్పు డు తాము కూడా అలాగే ప్రవర్తిస్తామని ఆ పార్టీ నేతలు, క్యాడర్ చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. -
ఊహించని రీతిలో కబళించిన మృత్యువు
క్రైమ్: చక్కగా చదువుకునే అమ్మాయిని ఆమెకున్న ఆరోగ్య సమస్య హఠాత్తుగా బలిగొంది. అదీ ఎవరూ ఊహించని రీతిలో!. రోజూలాగే స్కూల్‌కు వెళ్తున్న ఆమె ఫిట్స్ రావడంతో పక్కనే ఉన్న చెరువులో పడి కన్నుమూసింది. సీతానగరం మండలం ఆవాలవలసకు చెందిన శ్రావణి(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. సత్యం-పార్వతిలకు ఆమె ఏకైక సంతానం. గాదెలవలసలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు సైకిల్ మీద వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా.. మార్గం మధ్యలో ఫిట్స్ వచ్చింది. దీంతో బ్యాలెన్స్ ఆగక పక్కనే ఉన్న చెరువులో పడింది. అది గమనించిన తోటి విద్యార్థులు చుట్టుపక్కల వాళ్లకు సమాచారం అందించారు. అయితే.. అప్పటికే ఆలస్యమైంది. సైకిల్ మీద పడి ఆమె బుదరలో కూరుకుపోవడంతో కన్నుమూసిందామె. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: నితిన్ తన మాట వినడం లేదంటూ.. -
28న కురుపాంలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. 28వ తేదీ ఉదయం 8 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి.. 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కాలేజ్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కురుపాంలోని బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేసి.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు: కలెక్టర్లు
సాక్షి, అమరావతి: ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు మాట్లాడారు. ఏమన్నారో వారి మాటల్లోనే.. ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాం గడిచిన ఆరు నెలలుగా మీరు ఇస్తున్న సూచనల మేరకు మా జిల్లాలో జిల్లా స్ధాయిలో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటుచేశాం, కలెక్టర్, జేసీల నేతృత్వంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పనిచేస్తుంది, ఇందులో ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కన్వీనర్‌గా ఉన్నారు, అన్ని ప్రభుత్వ విభాగాలలో వస్తున్న వినతులు, ఫిర్యాదులు పరిశీలించడం, మండల స్ధాయిలో కూడా పరిశీలించేలా చర్యలు తీసుకున్నాం, ప్రతి గ్రీవియెన్స్‌ను పరిశీలించడం, మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సంబంధిత వార్త: ప్రజలకు సేవ చేసేందుకే సేవకుడిగా ఇక్కడికి వచ్చాను: సీఎం జగన్ మా జిల్లాలో వస్తున్న గ్రీవియెన్స్‌ను పరిష్కరించడం, రీ ఓపెన్ అయిన వాటిని పరిష్కరించడం చేస్తున్నాం. మీ సూచనల ప్రకారం గ్రామ సచివాలయం నుంచి జిల్లా కేంద్రం వరకు అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీ పేరు ఉండడం వల్ల నాణ్యతతో కూడిన పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకున్నాం, ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, మీ సూచనలు సలహాలు పాటించి ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాం. మా జిల్లా యంత్రాంగం అంతా సర్వసన్నద్ధంగా ఉంది. థాంక్యూ సార్. -దినేష్ కుమార్, కలెక్టర్, ప్రకాశం జిల్లా ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కారం సార్, ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం అంతా వీక్షిస్తుంది. మేం మా దగ్గరకు వచ్చే గ్రీవియెన్స్ పరిష్కారానికి పూర్తి మెకానిజాన్ని సిద్దం చేసుకున్నాం, 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ ఏర్పాటుచేశాం, స్పెషల్ ఆఫీసర్ కూడా పరిశీలిస్తున్నారు, ఫిర్యాదు చేసిన వ్యక్తి సమస్య పరిష్కారం అవగానే చిరునవ్వుతో వెనుదిరగాలి అనే విధంగా ముందుకెళుతున్నాం, గడిచిన కొద్ది వారాలుగా మేం ఈ కార్యక్రమానికి పూర్తి సన్నద్దమై ఉన్నాం. జిల్లా స్ధాయి నుంచే కాదు మండల స్ధాయి నుంచి కూడా అధికారులు సిద్దంగా ఉన్నారు, ఎలాంటి జాప్యం లేకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం, ఇప్పటికే జిల్లా అధికారులకు తగిన విధంగా శిక్షణ కూడా ఇచ్చాం, గ్రీవియెన్స్ పరిష్కారం తర్వాత ఇతరులకు ఉపయోగపడేలా మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నాం. ఇది ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది.! -నిషాంత్‌కుమార్, కలెక్టర్, పార్వతీపురం మన్యం జిల్లా 1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం, జిల్లా స్ధాయిలో, మండల స్ధాయిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లలో అవసరమైన పోలీస్ సిబ్బందిని నియమించాం, ఇప్పటికే అవగాహన తరగతులు నిర్వహించాం, 1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు తీసుకున్నాం, డైలీ స్టేటస్ రిపోర్ట్‌ను తీసుకుని పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం, పిటీషన్‌ను నిర్ణీత కాలపరిధిలో పరిష్కరిస్తున్నారా లేదా అని జిల్లా స్ధాయిలో పర్యవేక్షణ జరుగుతుంది, అన్ని శాఖల సమన్వయంతో పిటీషనర్‌కు న్యాయం జరిగేలా చూస్తాం, సివిల్ కేసుల పరిష్కారానికి మండల, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సహకారం తీసుకుంటాం. ఫీడ్ బ్యాక్ మెకానిజాన్ని కూడా ఏర్పాటుచేశాం, ఈ కార్యక్రమం దేశానికే రోల్‌మోడల్ అవుతుందని భావిస్తున్నాం. అన్భురాజన్, ఎస్పీ, వైఎస్సార్ కడప జిల్లా -
దూసుకొచ్చిన మృత్యువు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: నిశ్చితార్థానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తోన్న గిరిజన కుటుంబాలపై మృత్యువు లారీ రూపంలో దూసుకువచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. తీవ్ర గాయాలతో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన మరో ఐదుగురు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అంటివలసకి చెందిన 2 కుటుంబాల్లోని 12 మంది గిరిజనులు నిశ్చితార్థం కోసం అదే మండలంలోని తుమ్మలవలసకి వెళ్లారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి సొంత గ్రామానికి ఆటోలో బయల్దేరారు. 20 నిమిషాల్లో ఇళ్లకు చేరతారనగా..చోళ్లపదం శివాలయం మలుపు వద్ద ఆటోను పార్వతీపురం నుంచి కూనేరు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జ్జయింది. ప్రయాణిస్తోన్న వారంతా ఎగిరి పడిపోయారు. ప్రమాదంలో ఊయక నరసమ్మ (54), ఊయక లక్ష్మి (48), మెల్లిక శారద(35), మెల్లిక అమ్మడమ్మ(80), ఊయక వెంకట్(55) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయాలైన మిగతా 8 మందిని పోలీసులు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్‌ల్లో తీసుకువెళ్లారు. వారిలో ఊయక రామస్వామి, ఊయక వెంకటేష్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యానికి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ దిలీప్కిరణ్లు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పార్వతీపురం ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు. -
రాష్ట్ర పండుగగా పోలమాంబ జాతర
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించినట్టు రాజమహేంద్రవరం ఆర్జేసీ ఎం.వి.సురేష్‌బాబు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా శంబర గ్రామంలోని పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి ఏయే పనులు అవసరమో, ఎంత నిధులు అవసరమో ప్రణాళికలు తయారు చేసి అందించాలని ఈవో వి.రాధాకృష్ణను ఆదేశించారు. ఫలించిన డిప్యూటీ సీఎం రాజన్నదొర కృషి శంబరపోలమాంబ అమ్మవారు (గిరిజనుల దేవత) జాతర రాష్ట్రంలో అతిపెద్ద జాతరని, అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని గిరిజన సంక్షేమ శాఖమంత్రి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలోని సమ్మక్క, సారక్క జాతరకు ఉన్నంత విశిష్టత ఆంధ్ర రాష్ట్రంలో శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు ఉందని వివరిస్తూ వస్తున్నారు. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శంబర పోలమాంబ అమ్మవారి పండుగ రాష్ట్ర పండుగగా గుర్తింపునివ్వడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
జగనన్న బర్త్‌డే వేడుకలు నిర్వహించిన పుష్ప శ్రీవాణి (ఫొటోలు)
-
ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం
-
మహానాడు కాదు.. ఏడుపునాడు
పార్వతీపురం టౌన్: తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తు న్నది మహానాడు కాదు.. ఏడుపు నాడు అని వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహానాడు పేరుతో ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారని ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజులు ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడు ఆద్యంతం సీఎంను, ఆయన కుటుంబా న్ని దూషించడమే లక్ష్యంగా సాగిందన్నారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, బీసీలకు కల్పించిన ప్రయోజనాలను, భవిష్యత్తులో ఏమి చేస్తారో చెప్పకుండా ప్రభుత్వంపై బురదజల్లడ మే పనిగా పెట్టుకోవడం విచారకరమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదివరకు ఎవరూ చేయని విధంగా మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు 70 శాతం పదవులు కేటాయించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. ఆయా వర్గాల్లోని లబ్ధిదారులకు 95 శాతం మేర సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రకు ఆయా వర్గాల నుంచి వస్తున్న విశేష స్పందనను చూసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి భయం పట్టుకుందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మానసిక స్థైర్యం కల్పించేందుకు నానా తంటాలు పడుతున్నారన్నారు. అదే ఆనాడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017లో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే నవరత్నాల కార్యక్రమం కింద ఏమీ చేస్తామో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం చేసి చూపించారన్నారు. తమ నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: సమ్మర్ స్టడీస్.. ఇంట్లోనే చదవండి ఇలా!) -
సారా రహిత పార్వతీపురమే లక్ష్యం...
పార్వతీపురం టౌన్: సారా రహిత పార్వతీపురమే లక్ష్యంగా ఎస్ఈబీ అధికారులు అడుగులేస్తున్నారు. సారా తయారీ, విక్రయాలపై ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో ఎక్కువ శాతం ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాలు ఉన్నందున ఒడిశా రాష్ట్రంలో తయారవుతున్న సారా పార్వతీపురం పట్టణ ప్రాంతానికి అక్రమార్కులు తరలిస్తున్నారు. విషయాన్ని గ్రహించిన ఎస్ఈబీ అధికారులు పరివర్తన, అంతర్రాష్ట్ర ఆపరేషన్ పేరుతో ముమ్మరంగా దాడులు నిర్వహిస్తూ అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సారా తయారీ కేంద్రాలపై పోలీసులతో కలసి ఎస్ఈబీ సిబ్బంది మెరుపుదాడులు గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్వహిస్తున్నారు. పార్వతీపురం ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో సంవత్సర కాలంలో 578 కేసులు నమోదు చేసి 148 వాహనాలను సీజ్ చేశారు. సారా రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం.. సారా రవాణా, అమ్మకాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నాం. ఇటువంటి కేసుల్లో గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమాన లేదా రెండూ విధిస్తారు. ఒకటికి పైబడి కేసుల్లో నిందితులు పట్టుబడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం. – ఎల్.ఉపేంద్ర, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఈబీ, పార్వతీపురం దాడులు నిర్వహిస్తున్నాం.. సారా తయారీ కేంద్రాలపై ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నాం. ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న సారాపై ప్రత్యేక నిఘా పెట్టాం. గ్రామాల్లో సారా తయారీ, రవాణా చేయడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఒడిశా సరిహద్దుల్లో రూట్‌వాచ్‌లు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నాం. – ఎంవీ గోపాలకృష్ణ, టాస్క్‌ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్, పార్వతీపురం (చదవండి: ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వీరఘట్టం వాసి) -
దారి చూపిన ప్రభుత్వం
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల జాతీయ రహదారిపై గోతులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగేది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన రహదారులను ఎమ్మెల్యే అలజంగి జోగారావు చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో పార్వతీపురం మండలం నర్సిపురం ప్రధాన రహదారిపై గోతుల వల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఏఐఐబీ నిధుల ద్వారా రూ.2 కోట్లు› మంజూరు చేసి కొత్తరోడ్డు వేయించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ ఉత్సాహంతో ప్రయాణాలు చేస్తున్నారు. కొత్త రహదారితో తీరిన ఇబ్బందులు పార్వతీపురం–నర్సిపురం రహదారిలో గతంలో గుంతలతో అవస్థలు పడేవాళ్లం. ఎన్నో ప్రమాదాలు జరిగినా గత పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అలజంగి జోగారావు దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి రహదారి నిర్మాణం పూర్తిచేశారు. కొత్త రోడ్డు వేయడంతో ఇబ్బందులు తీరాయి. – గుంటముక్కల దుర్గారావు, 19వ వార్డు, పార్వతీపురం -
MLA Jogarao: ‘మార్గం’ చూపిన ఎమ్మెల్యే
సాక్షి, పార్వతీపురం మన్యం(బలిజిపేట): పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు చొరవతో వంతరాం నుంచి కొత్త వంతరాం వరకు రూ.20లక్షలతో రోడ్డు నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. కొత్తవంతరాం గ్రామస్తులకు సరైన రహదారి సదుపాయం లేక రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుండడంతో ఎమ్మెల్యే జోగారావుకు కొద్దికాలం క్రితం గ్రామస్తులు విన్నవించుకున్నారు. వంతరాం నుంచి కొత్తవంతరాం వరకు నిర్మిస్తున్న రోడ్డు ఇదే దీనికి స్పందించిన ఎమ్మెల్యే జోగారావు జిల్లా పరిషత్ నిధులు రూ.20లక్షలు మంజూరుచేయించి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2 కిలోమీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో రోడ్డు చేపట్టి నిర్మాణం పూర్తయితే తమ అవస్థలు తీరుతాయని గ్రామస్తులు తెలిపారు. చదవండి: (Nandyal District: నెరవేరబోతోన్న రేనాటి ప్రాంత వాసుల కల) -
అంతరిక్ష కేంద్రానికి ఆహ్వానం.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
రాజాం సిటీ: యువ శాస్త్రవేత్తలను తయారుచేయాలనే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కృషిచేస్తోంది. ఇందులో భాగంగా యువికా–2022 (యువ విజ్ఞాన కార్యక్రమం) యువ శాస్త్రవేత్తలను తయారుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యాసంవత్సరంలో దేశవ్యాప్తంగా 9వ తరగతి చదివే విద్యార్థుల నుంచి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణల వైపు యువతను నడిపించడం, అంతరిక్షంపై మక్కువ పెంచుకోవడం కోసం రాబోయే తరాల్లో శాస్త్రవేత్తలను గుర్తించే దిశగా ఇస్రో దృష్టి సారించి దేశవ్యాప్తంగా దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తోంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఐఎన్‌లలో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేయండిలా.. విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రతిదశలో జాగ్రత్తగా వివరాలు నమోదుచేయాలి. అసంపూర్తి దరఖాస్తులు తిరస్కరిస్తారు.యువికా–2022 కోసం ఏర్పాటుచేసిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో విద్యార్థులు సొంత ఈ–మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్విజ్ సూచనలు చదివి ఈ–మెయిల్ క్రియేట్ చేసిన 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటుచేసిన ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. క్విజ్ అప్లోడ్ చేసిన 60 నిమిషాల తరువాత యువికా పోర్టల్‌లోని ఆన్లైన్ దరఖాస్తులో పూర్తి వివరాలు నమోదుచేయాలి. అనంతరం డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతిని, విద్యార్థి మూడేళ్లలో వివిధ అంశాల్లో రూపొందించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇందులో ఎంపికైన వారిని ఇస్రో వడబోసి తుదిజాబితా అదే నెల 20న వెబ్సైట్లో ఉంచుతుంది. రాష్ట్రానికి ముగ్గురు విద్యార్థులు చొప్పున అవకాశం కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (తిరువనంతపురం), యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (బెంగళూరు), స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (అహ్మదాబాద్), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (షిల్లాంగ్)లలో మే 16 నుంచి 28 వరకు 13 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. అర్హులు వీరే.... ఈ ఏడాది మార్చి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. వారికి ఎనిమిదో తరగతిలో వచ్చిన మార్కులతోపాటు గత మూడు సంవత్సరాల్లో పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొని ఉండాలి. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్‌లలో సభ్యుడై ఉండాలి.