
తిరుపతి మంగళం: ‘భుజాలు అరిగిపోయేలా టీడీపీ జెండాలు మోశాం. పార్టీ కోసం ఎనలేని సేవలందించాం. జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందినట్టుగా టీడీపీ ప్రభుత్వంలో ఏనాడు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందలేదు. ప్రజలకు మేలు చేయని టీడీపీలో ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒక్కటే. జగనన్న లాంటి నాయకుడు మళ్లీ సీఎం కావాలి’ అంటూ తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తరఫున 30వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గా పోటీచేసిన గుర్రమ్మ చెప్పారు.
తిరుపతి నెహ్రూనగర్‌లో గురువారం కార్పొరేటర్ కల్పనయాదవ్, డివిజన్ అధ్యక్షుడు ఎస్‌కే ఇమ్రాన్‌బాషా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ నారాయణ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ డివిజన్ నుంచి పోటీచేసిన గుర్రమ్మ వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసల వర్షం కురిపించారు.
తాను కూడా జగనన్న సంక్షేమ పథకాల ద్వారా రూ. 11 లక్షలు లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే భూమనకు ఆమె సంతోషంగా చెప్పారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ‘సీఎం వైఎస్ జగన్ కులాలు, మతాలు, పారీ్టలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న గొప్ప నాయకుడు. చంద్రబాబు ధనవంతులకు కొమ్ముకాస్తే, జగనన్న పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. అలాంటి గొప్ప నాయకుడికి అండగా ఉండాలి’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment